Mosquitoes who Lays Eggs in Sequence

దోమ గుడ్లు పెట్టడం ఎప్పుడైనా చూశారా? (షాకింగ్ వీడియో)

దోమలంటేనే మనకి ఎక్కడలేని చిరాకు పుట్టుకొస్తుంది. అవి చేసే శబ్ధానికి ఎన్నో నిద్రలేని రాత్రులని గడుపుతుంటాం. దోమల నివారణకి మార్కెట్లో దొరికే రకరకాల రిపెల్లెంట్లని వాడతాం. అయినప్పటికీ, అది తాను చేయాల్సిన పని పూర్తి చేసే వెళుతుంది. 

అనేక రకాల వ్యాదులకి కారణమైన దోమలని నివారించాలంటే… కొన్ని  ప్రత్యేక చర్యలు తీసుకుంటాం. అందులో మొదటిది వాటి గుడ్లని ధ్వంసం చేయడం. నిజానికి దోమ గుడ్లను తినే చేపలు కూడా ఉన్నాయి. అయినప్పటికీ, ఇంకా కొన్ని దోమలు పెరిగి, పెద్దవై, మన రక్తాన్ని పీలుస్తుంటాయి.

ఒక మగ దోమ జీవిత కాలం 10 రోజులు మాత్రమే! అదే ఆడ దోమ జీవితం కాలం 40 నుండి 50 రోజులు మాత్రమే! విచిత్రం ఏంటంటే, ఆడ దోమ తన లైఫ్ లో కేవలం ఒక్కసారి మాత్రమే లైంగిక సంపర్కం జరుపుతుంది. ఆ ఒక్కసారికే కనీసం 200 నుంచి 500 వరకు గుడ్లు పెడుతుంది.

Also Read: ఈ దోమకు వచ్చిన కష్టం నిజంగా పగవాళ్లకు కూడా రాకూడదు! (ఫన్నీ వీడియో)

People experiencing the mysterious hum sound heard on Earth, unexplained low-frequency noise
భూమిపై రహస్య శబ్దం – ఎవరికీ అర్థం కాని హమ్ సౌండ్

ఇక దోమల్లో మగదోమలు మనిషిని కుట్టవు. ఇవి కేవలం చెట్ల రసాలపై ఆధారపడి జీవిస్తాయి. మనుష్యులని కుట్టేది ఆడ దోమలే! ఆడదోమల్లో మనిషిని కుట్టేందుకు వీలుగా దాని ముఖ భాగంలో ప్రోబోసిస్  అనే ఈటె లాంటి భాగం ఉంటుంది. దానితోనే అవి మనిషి రక్తాన్ని పీలుస్తాయి. అలాగని మనిషి రక్తమే వీటి ఆహారం కాదు, కేవలం ఇవి గుడ్లు పెట్టడానికి అవసరమైన ప్రొటీన్‌ మనిషి రక్తం ద్వారా లభిస్తుంది. దానికోసమే అవి మనుషులను కుడతాయి. కుట్టి ఊరుకోకుండా పలు వ్యాధులను కలుగజేస్తాయి.

అయితే, మరి దోమ గుడ్లు పెట్టడం మీరెప్పుడైనా చూశారా? ప్రస్తుతం వైరల్ అవుతున్న ఈ వీడియోలో దోమ ఎలా గుడ్లు పెడుతుందో చాలా క్లియర్ గా చూడొచ్చు. ఓ ఫిమేల్ మస్కిటో ఒకేసారి 200 నుంచి 500 వరకూ గుడ్లు పెట్టింది. ఆ గుడ్లన్నింటినీ ఒక వరుస క్రమంలో నిటారుగా నిలబెట్టడం చూస్తే చాలా ఆశ్చర్యాన్ని కల్గిస్తుంది. గుడ్లు దెబ్బతినకుండా, దోమ పిల్లలన్నీ సరైన సమయంలో బయటకు వచ్చేలా… ఆ  గుడ్లను పేర్చి పెట్టింది ఆ దోమ.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top