Massive Fire Breaks out at Avighna Park Apartment in Parel at Mumbai

అపార్ట్‌మెంట్‌లో భారీ అగ్ని ప్రమాదం… భవనంపైనుండి దూకేసిన వ్యక్తి! (లైవ్ వీడియో)

ఈరోజు ముంబైలో ఓ భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. దక్షిణ ముంబైలోని పరేల్‌లోని లాల్‌బాగ్‌ ప్రాంతానికి సమీపంలో ఉన్న ఓ  బహుళ అంతస్థుల భవనంలో ఈ అగ్ని ప్రమాదం సంభవించింది. విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని మంటలను ఆర్పటానికి ప్రయత్నిస్తున్నాయి. ఈ ప్రమాదం వెనుక అసలు కారణం తెలియనప్పటికీ, వీలైనంతవరకూ రక్షణ చర్యలు చేపట్టారు.

ఈ అపార్ట్‌మెంట్‌లో మొత్తం 60 అంతస్థులు ఉండగా…  19 వ అంతస్తులో మంటలు చెలరేగాయి. ఈరోజు మధ్యాహ్నం 12 గంటల సమయంలో సంభవించిన ఈ ప్రమాదం 3 వ స్థాయి అగ్ని ప్రమాదం. ప్రశాంతంగా ఉన్న ఈ భవనంలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో… అపార్ట్‌మెంట్‌లో ఉన్న వాళ్లంతా తీవ్ర భయాందోళనకు గురయ్యారు. తమని తాము రక్షించుకునేందుకు పరుగులు పెట్టారు. కొందరైతే భవనంపై నుంచి దూకేందుకు ప్రయత్నించారు. ఇక ఓ వ్యక్తి మంటల బారినుండి రక్షించుకునేందుకు భవనంపై నుంచి దూకేశాడు. దీంతో అదుపు తప్పి కింద పడిపోయాడు. ఇతర అంతస్తుల్లో కూడా చాలా మంది ఈ మంటల్లో చిక్కుకున్నట్లు తెలుస్తోంది.

Futuristic digital creator using Claude AI skills to grow website traffic with glowing SEO analytics dashboards and AI technology visuals.
ఈ Claude AI Skill నా Website Traffic Double చేసింది!

ఈ ప్రమాదం కారణంగా కర్రీ రోడ్‌ బ్రిడ్జిపై ట్రాఫిక్‌ జామ్‌ అయ్యింది.  పోలీసులు ఎక్కడికక్కడ వాహనాలను నిలిపివేశారు. అయితే, ప్రాణ నష్టం, ఆస్తి నష్టం వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

Meesala Pilla Telugu song full lyrics image
మీసాల పిల్ల ఫుల్ లిరికల్ సాంగ్

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top