భారత్-చైనా సరిహద్దుల్లో నెలకొని ఉన్న ఉద్రిక్తతల నేపథ్యంలో… భారత సైన్యం అనునిత్యం అప్రమత్తంగా ఉంటూ పహారా కాస్తోంది. ఈ ప్రాంతంలో ఆయుధం వాడకూడదన్న నిబంధనను గౌరవిస్తున్నట్లు నటిస్తూ… గల్వాన్ లోయలో డ్రాగన్ కంట్రీ విరుచుకుపడింది. ఒక్క తూటా కూడా పేల్చకుండానే… నిముషాల వ్యవధిలో 60 మంది సైనికుల ప్రాణాలు పొట్టన పెట్టుకుంది. భారత్ ని దొంగ దెబ్బతీసి పారిపోయింది. ఈ ఘటన అనంతరం భారత సైనిక వ్యూహం పూర్తిగా మారిపోయింది. గాలి కూడా చొరబడని చోట విధులు నిర్వహిస్తూ… ఒట్టిచేత్తోనే శత్రువును మట్టికరిపించేలా కఠోర శిక్షణ పొందుతున్నారు.
గల్వాన్ ఘటనకి ముందు వరకూ వాస్తవాధీన రేఖ వద్ద భారత సైన్యం కేవలం గస్తీ మాత్రమే నిర్వహించేది. కానీ, గల్వాన్ ఘటన భారత సైన్యానికి ఓ సరికొత్త పాఠం నేరిపించింది. తూటా పేల్చకుండానే శత్రువులని మట్టికరిపించడం ఎలా? అనే అంశంపై ఫోకస్ పెట్టింది. ఈ క్రమంలో పుట్టుకొచ్చిందే “ప్లాన్-190”.
నిజానికి సరిహద్దుల్లో వాతావరణం ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటుంది. శీతాకాలంలో ఇక్కడి ఉష్ణోగ్రతలు మైనస్ 25 డిగ్రీలకి పడిపోతూ ఉంటాయి. ఇలాంటి ప్రాంతంలో వాతావరణ మార్పులతో సంబంధం లేకుండా ప్రతి 24 గంటలకి ఒకసారి 190 నిముషాలపాటు కఠోర శ్రమతో కూడుకొన్న శిక్షణ తీసుకోవాల్సి ఉంటుంది. సముద్ర మట్టానికి దాదాపు 15 వేల అడుగుల ఎత్తులో వీరు ఈ ఈ విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది. ఇక్కడి గాలిలో ఆక్సిజన్ కేవలం 70 శాతం మాత్రమే ఉంటుంది. అందుకే ఇక్కడ శ్వాస తీసుకోవడం కూడా చాల కష్టం. అలాంటి ప్రతికూల పరిస్థితుల్లో వీరు శిక్షణ కొనసాగించాల్సి ఉంటుంది. ఇలాంటి ప్రతికూల పరిస్థితులని తట్టుకొని శిక్షణ తీసుకోవడం, విధులు నిర్వర్తించడం అంటే… దినదిన గండమే! కానీ, అనుక్షణం మృత్యువుతో పోరాడుతూ… పరిస్థితులకి ఎదురు వెళ్ళేది చైనా బలగాల్ని తరిమికొట్టటానికే!