China Space Station Welcomes Shenzhou 13 Crew for a Six Month Stay

అంతరిక్ష పరిశోధనల్లో చైనా రూటే సపరేటు! (వీడియో)

స్పేస్ రీసర్చ్ లలో ప్రపంచ దేశాలన్నీ ఒక రూటులో వెళ్తుంటే… చైనా మాత్రం డిఫరెంట్​ రూట్ లో వెళ్తుంది. అగ్రరాజ్యాలు సైతం స్పేస్​ టూరిజంలో ఆధిపత్యం కోసం పోరాడుతుంటే… చైనా మాత్రం దానికి భిన్నంగా ఏలియన్ల ఉనికి కోసం పోరాడుతుంది. ఈ క్రమంలోనే రీసెంట్ గా మరో సరికొత్త ప్రయోగానికి తెరతీసింది. 

ఏలియన్స్ పై రీసర్చ్ చేయటానికి ముగ్గురు వ్యోమగాములతో కూడిన ఒక  రాకెట్‌ ని స్పేస్ లోకి పంపింది చైనా. అక్టోబరు 15 అర్ధరాత్రి గోబీ ఎడారిలోని జిక్యూక్వాన్​ లాంచ్ సెంటర్​ నుంచి లాంగ్​ మార్చ్​ 2 ఎఫ్​ రాకెట్​ ని ప్రయోగించింది. దీనిద్వారా ముగ్గురు ఆస్ట్రోనట్స్ టియాన్‌గాంగ్‌ స్పేస్‌ స్టేషన్‌లో ఆరు నెలలపాటు స్టే చేయనున్నారు.

ఈ 6 నెలల కాలంలో వీళ్ళు టియాన్​గాంగ్​ స్పేస్​ స్టేషన్​లో ఎక్విప్​మెంట్​ని  సెటప్​ చేయడంతో పాటు… టెక్నాలజీని కూడా టెస్ట్ చేస్తారు. ఇదిలా ఉంటే… చైనా ఇప్పటివరకూ ఏలియన్స్ ఎగ్జిస్టెన్స్ రీసర్చిల కోసం భారీగానే ఖర్చు చేసింది. ప్రపంచంలోనే అతిపెద్ద సిగ్నల్​ వ్యవస్థని కూడా ఏర్పాటు చేసింది. ఇక ఈ ప్రయోగం ద్వారా ఏలియన్స్ ఉనికిని మరింత ముమ్మరం చేయనున్నారు. చైనా ఇప్పటివరకూ చేపట్టిన ప్రయోగాలలో సుదీర్ఘ అంతరిక్ష ప్రయోగం ఇదే!

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top