నిర్లక్ష్యానికి తప్పదు భారీ మూల్యం (వీడియో)

రోడ్డుపై నటిచేటప్పుడు కానీ,  రోడ్డు దాటుతున్నప్పుడు కానీ, డ్రైవింగ్ చేస్తున్నప్పుడు కానీ సెల్ ఫోన్ మాట్లాడటం, హెడ్‎ఫోన్స్ పెట్టుకుని వినటం ఇవన్నీ ప్రాణాలతో చెలగాటమాడటమే! చాలామంది రోడ్డు మీద నడుస్తున్నామనే విషయాన్ని కూడా మర్చిపోయి ఫోన్ సంభాషణలో మునిగిపోతారు. కానీ, రోడ్డుపై నడిచేటప్పుడు, ముఖ్యంగా మనతో పిల్లిల్ని తీసుకెళ్లినప్పుడు మరింత అప్రమత్తంగా ఉండాలి. 

హర్యానాలోని ఫరీదాబాద్ లో ఉన్న జవహర్ కాలనీలో ఓ మహిళ బిడ్డని ఎత్తుకుని… నడుస్తూ ఫోన్ మాట్లాడుతూ వెళుతుంది. ఫోన్ ధ్యాసలో పడి ఎదురుగా ఓపెన్ మ్యాన్‌హోల్‌ ఉందన్న విషయం కూడా గమనించుకోలేదు. ఇంకేముంది! బిడ్డతో సహా ఆ మ్యాన్‌హోల్‌ లో పడనే పడింది.

వెంటనే అటుగా వస్తున్న పాదచారులు అది గమనించి… మ్యాన్ హోల్‎లో దిగి బిడ్డనీ, ఆమెనీ సేఫ్ గా బయటకి తీసుకొచ్చారు.  ఇద్దరూ స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఈ ఘటన అక్కడున్న సీసీ కెమెరాలో రికార్డయింది. 

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top