Agra Hospital Bandaged Broken Arm of Krishna Idol

విరిగిన కృష్ణుడి చేయి.. ఆస్పత్రికి పరుగు తీసిన పూజారి.. కట్టు కట్టిన డాక్టర్లు… పేషెంట్ పేరు శ్రీ కృష్ణగా నమోదు!

ప్రాణమున్న ఏ జీవికి అయినా డాక్టర్లు చికిత్స చేస్తారు. కానీ, ప్రాణం లేని బొమ్మకి చికిత్స చేయటం ఎప్పుడైనా చూశారా? అదికూడా ఓ విగ్రహానికి. విగ్రహానికి ట్రీట్మెంట్ ఇవ్వడం ఏంటి? మరీ చోద్యం కాకపోతేనూ! అని మీరు అనుకోవచ్చు. కానీ, ఇక్కడ ఒక పూజారి చేసిన పనికి అతనిది అమితమైన భక్తిభావం అనుకోవాలా? ఛాదస్తం అనుకోవాలా? పిచ్చి అనుకోవాలా? మీరే చెప్పండి. 

ఉత్తర ప్రదేశ్‌లోని ఆగ్రాకి చెందిన ఓ పూజారి చేసిన వింత పని చూసి… అందరూ నోరెళ్ళబెట్టారు. అర్జున్‌ నగర్‌లో ఖేరియా మోడ్‌లోని పఠ్వారీ ఆలయంలో ఉన్న ఓ  బాలకృష్ణుడి విగ్రహం చాలా కాలంగా భక్తుల పూజలందుకుంటుంది. లేఖ్ సింగ్ అనేవ్యక్తి గత 30 ఏళ్లనుండీ ఈ ఆలయ పూజారిగా వ్యవహరిస్తున్నాడు. 

అయితే, ప్రతిరోజూ లానే ఈరోజు ఉదయం కూడా స్వామివారికి అభిషేకం చేయిస్తుండగా… పొరపాటున విగ్రహం ఆయన చేయిజారి కిందపడింది. దీనత్ ఆ విగ్రహం చేయి విరిగింది. జరిగిన పరిణామానికి ఆ పూజారి ఎంతో తల్లడిల్లిపోయాడు. ఓ పసిబిడ్డను పొదివి పట్టుకున్నట్టుగా… తన బాలకృష్ణుడి విగ్రహాన్ని పట్టుకొని జిల్లా ఆసుపత్రికి పరుగు తీశాడు. విగ్రహానికి కట్టు కట్టాలంటూ వైద్యులని వేడుకున్నాడు. 

సాదారణంగా ఆలయాల్లో అర్చకులు తాము పూజించే దేవుడిపట్ల  ఎంతో భక్తి భావంతో ఉంటారు. వారి సేవల్లో ఏ మాత్రం అపచారం జరిగినా తట్టుకోలేరు. అంతవరకూ ఓకే. కానీ, ఇలా తన వల్ల గాయపడిన దేవుడిని కాపాడాలంటూ ఆస్పత్రికి వెళ్ళటం ఇదే ప్రధమం. పూజారి మాట విని డాక్టర్లు మొదట షాకయ్యారు. ఏం చేయాలో అర్ధం కాలేదు. పూజారికి ఎంతో నచ్చజెప్పాలని చూశారు. కానీ ఆయన వినలేదు. డాక్టర్లు ఎంతకీ పట్టించుకోకపోవడంతో… తన తలని గోడకేసుకుని బాదుకున్నాడు ఆ పూజారి.  దీంతో చేసేదేమీ లేక కృష్ణుడి విగ్రహానికి బ్యాండేజ్ వేసి డాక్టర్ కట్టుకట్టారు.

Illustration of hardworking ants carrying food grains, teaching life lessons of hard work, patience, and teamwork
చీమల నుండి మనిషి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు!

పూజారికి హృద్రోగ సమస్యలున్న కారణం చేత ఆయన్ని ఎక్కువగా ఇబ్బంది పెట్టదల్చుకోలేదు. కేవలం ఆయన త్రుప్తి కోసమే ఈ కట్టు కట్టామని డాక్టర్ తెలిపారు. అంతేకాదు, హాస్పటల్ రికార్డ్స్ లో పేషెంట్ పేరు ‘శ్రీ కృష్ణ’ అని ఎంటర్ చేయడం విశేషం.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top