Ashoka, the Emperor with a Complex Legacy

Ashoka’s Family Conflicts and Power Struggles

ఇండియన్ హిస్టరీలో అశోకుడ్ని గ్రేట్ రూలర్ గా, పాసిఫిస్ట్ గా చెప్తుంటారు. ఇదంతా కాయిన్ కి వన్ సైడ్ మాత్రమే! అదర్ సైడ్ చూస్తే, అతనో క్రూయల్ రూలర్. నిజానికి అశోకుడు రాజ్యం కోసం తోడపుట్టిన వాళ్ళనే చంపేసిన క్రూరుడు.  యుద్ధ దాహంతో లక్షలాది మందిని పొట్టన పెట్టుకొన్న రాక్షసుడు. కానీ, ఆ తర్వాత ప్రజల కోసం సేవ చేసి ఉదారుడిగా మారాడు. ధర్మ స్థాపన కోసం బౌద్ధమత వ్యాప్తికి కృషి చేసి అందరి దృష్టిలో దేవుడయ్యాడు. ఈ నేపధ్యంలో “అశోక ది గ్రేట్” అని అంతా అంటే… కాదు “అశోక నాట్ సో గ్రేట్” అని కొందరు వాదిస్తారు. అందుకు దారితీసిన కారణాలు ఏంటో ఈ రోజు చెప్పుకుందాం.

అశోకుడు ఎవరు?

అశోకుడు మౌర్య సామ్రాజ్య స్థాపకుడైన చంద్రగుప్త మౌర్యుని మనవడు. అంటే రెండవ మౌర్య చక్రవర్తి బిందుసార కుమారుడు. ఈయన క్రీస్తు పూర్వం 304 లో బిందుసారుడు మరియు సుభద్రాంగి దంపతులకు పాటలీపుత్రలో జన్మించాడు. 

“అశోక” అంటే సంస్కృతంలో “అ” అంటే – లేని; “శోక” అంటే – బాధ. టోటల్ గా “అశోక” అంటే – నొప్పిలేకుండా లేదా బాధ లేకుండా ఉండటం అని అర్ధం. అశోకుని తల్లి అతనికి ఈపేరు పెట్టింది, 

అశోకుడు తన తల్లి అలాగే గురువు యొక్క గైడెన్స్ లో విలువిద్య, కత్తిసాము, గుర్రపు స్వారీతో సహా యుద్ధ నైపుణ్యం, మరియు తత్వశాస్త్రంలో శిక్షణ పొందాడు. ఎంతోమంది సిబ్లింగ్స్ ఉన్నప్పటికీ, అశోకుడు సింహాసనాన్ని అధిరోహించడం భారతదేశ చరిత్రలో ఒక ముఖ్యమైన శకానికి నాంది పలికింది.

అశోకుడు తన తండ్రితో పాటు తాను కూడా పోరాటాలకు వెళ్ళేవాడు. అలా యుద్ధం మరియు పాలన విషయంలో ఎంతో అనుభవాన్ని గడించాడు. ఇక వీరి సామ్రాజ్యంలో ఉన్న పొలిటికల్ స్ట్రాటజిస్ట్ అయిన చాణక్యుడు ఇతని ఎర్లీ లైఫ్ లో కీ రోల్ ప్లే చేశాడు. అతను చెప్పిన లైఫ్ లెసన్స్, మిలిటరీ క్యాంపెయిన్స్, అడ్మినిస్ట్రేటివ్ రెస్పాన్సిబిలిటీస్ ఇవన్నీ తరువాత ఇతని పాలనకు పునాది వేశాయి. ఇలా తన లైఫ్ లో ఫేస్ చేసిన అనేక రకాల ఛాలెంజెస్ అండ్ ఎక్స్ పీరియన్సెస్ అశోకుడి పాలనలో ట్రాన్స్ ఫర్ మేటివ్ ఈవెంట్స్ గా నిలిచాయి.  

క్రీస్తు పూర్వం 268 నుండి 232 వరకు భారతదేశాన్ని పరిపాలించిన పురాతన మౌర్య సామ్రాజ్య చక్రవర్తి ఇతను. ఇండియన్ హిస్టరీలో ఉన్న మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్స్ లో వన్ అఫ్ ది పర్సన్ ఈ అశోకుడు.

అశోకుని సామ్రాజ్యం ఎంత పెద్దది?

అశోకుడిని మొదట్లో సింహాసనానికి వారసుడిగా పరిగణించబడలేదు. ఆ గౌరవం బిందుసారుని మొదటి రాణి కుమారుడైన సుసీమా అంటే…. అశోకుని సవతి సోదరునికి దక్కింది. అయినప్పటికీ, అశోకుడు అవంతి ప్రావిన్స్‌కు సేనాధిపతిగా నియమించబడ్డాడు. అక్కడే అతను పాలనలో  గొప్ప అనుభవాన్ని పొందాడు.

అశోకుని పాలనా జీవితం బిందుసారుడి సైన్యానికి సేనాధిపతిగా నియమించబడినప్పటి నుండీ ప్రారంభమైంది. ఈ క్రమంలోనే అతను బ్యాటిల్ ఫీల్డ్ లో తన క్యాపబిలిటీస్ ని  ప్రూవ్ చేసుకున్నాడు. అంతేకాదు, ఆ కాలంలో ఉన్న గ్రేట్ జనరల్స్ లో ఒకరిగా పేరు పొందాడు.

బిందుసార మరణం తర్వాత సింహాసనం కోసం జరిగిన పోరాటంలో అశోకుడు తన అన్న సుసీమను చంపినట్లు ఆధారాలు చెబుతున్నాయి. క్రీస్తుపూర్వం 269 లో అశోకుడు సింహాసనాన్ని అధిరోహించాడు. తరువాతి 8 సంవత్సరాలలో తన సామ్రాజ్యాన్ని తూర్పున బంగ్లాదేశ్ నుండి పశ్చిమాన బలూచిస్తాన్ వరకు, అలాగే ఉత్తరాన ఆఫ్ఘనిస్తాన్ నుండి దక్షిణాన కర్నాటక వరకు విస్తరింపచేశాడు. ఇలా దాదాపు దక్షిణ ఆసియా మొత్తాన్ని పరిపాలించాడు. ఒకరకంగా చెప్పాలంటే, ఇతని సామ్రాజ్యం ప్రస్తుతం ఉండే తమిళనాడు కర్ణాటక, కేరళలోని కొన్ని ప్రాంతాలు మినహా మొత్తం భారత ఉపఖండం అంతటా విస్తరించింది. 

ఆ సమయంలో పాటలీపుత్ర మౌర్య సామ్రాజ్యానికి రాజధానిగా చేయబడింది. ఉజ్జయిని మరియు తక్షశిల ప్రాంతీయ రాజధానులుగా ఉన్నాయి. అశోకుని  సామ్రాజ్యం ఇండియన్ కాంటినెంట్ లోనే అతిపెద్దది. ఇది అశోకుని ఆధ్వర్యంలో 5 మిలియన్ చదరపు కిలోమీటర్లకు పైగా విస్తరించి ఉంది. ఈయన పరిపాలనలో రాజ్యం చాలా సుభిక్షంగా ఉండేది. అలాగే ప్రజలు కూడా ఎంతో  సుఖశాంతులతో వర్ధిల్లే వారు. ఈ విధంగా అశోక చక్రవర్తి క్రీస్తుపూర్వం  268 నుండి 232 వరకు మొత్తం 37 సంవత్సరాలు పరిపాలించాడు.  

అశోకుడు హింసను ఎలా వదులుకున్నాడు?

కళింగ యుద్ధం అతని పాలనలో ఓ కీలకమైన మలుపు. అలాగే అతని జీవితంలో, కళింగకు వ్యతిరేకంగా చేసిన యుద్ధమిది. క్రీస్తుపూర్వం 260 లో అశోకుడు కళింగపై భారీ యుద్ధం చేసి దానిని జయించాడు. ఈ యుద్ధంలో మొత్తం 1,00,000 మందికి పైగా మరణిస్తే…1,50,000 మందికి పైగా  నిరాశ్రయులయ్యారు. ఇది ప్రపంచ చరిత్రలోనే  అత్యంత వినాశకరమైన మరియు విధ్వంసకరమైన యుద్ధం.

యుద్దానికి ముందు అంతటి రక్తపాతాన్ని, విధ్వంసాన్ని అస్సలు ఊహించలేక పోయాడు అశోకుడు. అందుకే, కళింగ యుద్ధంలో గెలిచిన తర్వాత జరిగిన ఘోరం చూసి తట్టుకోలేక పోయాడు. దీనంతటికీ కారణం తానే అని తెలిసి కుమిలి పోయాడు.  రోజులు గడిచేకొద్దీ అతనిలో పశ్చాత్తాపం మరింత పెరిగింది. అందుకే, ఇకపై ఈ హింసను, రక్తపాతాన్ని విడిచిపెట్టాలనుకున్నాడు.

హింసను విడిచిపెట్టటం కోసం అహింసా మార్గాన్ని ఎంచుకొన్నాడు. ఈ క్రమంలోనే బౌద్ధమతం అతనిని నాటకీయంగా మార్చివేసింది. బుద్ధుని బోధనలు అతని దృక్పథాన్ని పూర్తిగా మార్చాయి. అతనిప్పుడు పూర్తి భిన్నమైన వ్యక్తిగా మారాడు. ఇకపై యుద్ధాలే కాదు, మరే ఇతర ప్రాణికీ కూడా హాని చేయకూడదని భావించి జంతువుల వేట కూడా నిషేధించాడు.

ఒక పెద్ద యుద్ధంలో గెలిచిన తర్వాత కొత్త భూభాగాలను జయించాలనే కోరికను విడిచిపెట్టిన ఏకైక రాజుగా  అశోకుడు మిగిలాడు. ఇదంతా అశోకుని 13వ శిలా శాసనం స్పష్టంగా వివరిస్తుంది.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top