మహాభారత ఇతిహాసం గురించి, అందులోని ఎందరో యోధుల గురించి, కురుక్షేత్ర సంగ్రామంలో వారి ప్రాముఖ్యత గురించి ఇప్పటివరకూ అనేక విషయాలు తెలుసుకున్నాము. అయితే ఈ ఇతిహాసంలో అతి ముఖ్య పాత్ర పోషించిన శ్రీకృష్ణుడు మరణించిన తరువాత అతని శరీరం ఏమైందో చాలా మందికి తెలియదు. అంతేకాదు, అతని శరీరంనుండీ విడిపోయిన తర్వాత కూడా అతని ఆత్మ, మరియు గుండె ఇంకా సజీవంగానే మిగిలి ఉన్నాయి. అవి ఇప్పటికీ ఓ ప్రదేశంలో ఉన్నాయని మీకు తెలుసా! అతి కొద్ది మందికి మాత్రమే తెలిసిన ఈ రహస్యాన్ని ఈ రోజు నేను మీతో షేర్ చేసుకుందామని అనుకుంటున్నాను. ముందుగా శ్రీకృష్ణుడు ఎలా మరణించాడో కొంచెం క్లుప్తంగా తెలుసుకొని ఆ తరువాత అతని అంత్యక్రియల గురించి తెలుసుకుందాము.
గాంధారి శాపం
కురుక్షేత్ర యుద్ధం ముగిసిన తరువాత, తన కుమారులందరూ మరణించడానికి కారణం కృష్ణుడేనన్న కోపంతో గాంధారి కృష్ణుడిని శపిస్తుంది. కౌరవుల వలే నీవు కూడా దిక్కులేని చావు చస్తావు. అలాగే యాదవ వంశంలో సోదర సమానంగా ఉన్నవారు అందరూ ఒకరినొకరు చంపుకొని చివరికి యాదవ వంశం నశిస్తుందని ఈ శాపం.
మునుల శాపం
ఒకసారి కొంతమంది మునులు శ్రీకృష్ణుడిని చూడడానికి ద్వారకకు వస్తారు. ఆ మునులను చూసిన యాదవులకు వారిని ఆట పట్టించాలన్న దుర్బుద్ధి కలుగుతుంది. అలాంటి వారిలో కృష్ణుడికి జాంబవతితో కలిగిన కుమారుడు అయిన సాంబుడు కూడా ఉన్నాడు.
ఇతను ఓ గర్భిణీ స్త్రీ వేషం వేసుకొని, తన స్నేహితులతో వచ్చి ఆ ఋషులను కలిసి తనకు పుట్టబోయే బిడ్డ గురించి అడిగి ఋషులను ఎగతాళి చేయాలని అనుకుంటాడు. అయితే, నిజం గమనించిన ఒక ఋషి కోపంతో సాంబడు ఒక ఇనుప గోళానికి జన్మనిస్తాడని, అది పూర్తిగా యాదవ వంశాన్ని నాశనం చేస్తుందని శపిస్తాడు. అంతేకాదు, మీ కపటనాటకానికి ఇదే తగినశిక్ష అని ఆగ్రహంతో ఆ ఋషులు శ్రీకృష్ణుడిని చూడకుండానే వెళ్ళిపోతారు.
యాదవులలో అంతర్యుద్దం
ఆ మరుసటిరోజే సాంబుడు మునుల శాపము ఫలించి ఓ ఇనుప గోళాన్ని కంటాడు. దీంతో భయపడిపోయిన అతను యాదవులతో కలిసి ఉగ్రసేన మహారాజు దగ్గరకు వెళ్లి విషయం చెప్తాడు. అప్పుడు ఆ రాజు వెంటనే ఆ ఇనుప గోళాన్ని అరగదీసి సముద్రంలో పడేయమని చెబుతాడు.
ఆలా అరగదీసిన తరువాత ఒక చిన్న ముక్క మిగిలిపోతుంది. వాళ్ళు ఆ ముక్కను కూడా సముద్రంలో పడేసి వెళ్ళిపోతారు. ఇక ఆ విషయము అంతటితో అందరూ మరచిపోయారు.
జరా అనే ఒక వేటగాడికి ఆ ఇనుప ముక్క దొరుకుతుంది. అతను ఆ ఇనుప ముక్కను తన బాణాలలో ఒకదానికి బాణం కొనగా ఉపయోగిస్తాడు.
కాలం గడిచిపోతుంది. మహాభారత యుద్ధం జరిగిపోతుంది. యుద్ధం పూర్తయి కొన్ని ఏళ్ళు గడిచిన తర్వాత ఒకానొక రోజు శ్రీకృష్ణుడి సుదర్శన చక్రం, పాంచజన్యం, రథం, ఇంకా బలరాముడి ఆయుధాలు అన్నీ అకస్మాతుగా మాయమవుతాయి. అంతా గమనించిన కృష్ణుడు యుగాంతం అయ్యే సమయం దగ్గర పడిందని తెలుసుకొని యాదవులందరినీ ద్వారక వదిలి ప్రభస్సా సముద్రం దగ్గరికి వెళ్ళమని ఆదేశిస్తాడు.
అక్కడ అందరూ మద్యం సేవించి, మద్యం మత్తులో ఒకరినొకరు నిందించుకొని చంపుకుంటారు. అలా యాదవ వంశము అంతా సమూలముగా నాశనము అయింది. ఆ విధంగా గాంధారి శాపం ప్రభావం వలన యాదవులందరూ చనిపోతారు.
ఇదికూడా చదవండి: Philosophical Significance of Ashta Vakra Katha
బలరాముని నిర్యాణము
యుగాంతం జరగబోతుందని తెలిసి తానుకూడా ఇక అవతారాన్ని చాలించదల్చుకొని ఒకచెట్టు కింద కూర్చొని యోగ సమాధిలోకి వెళ్ళిపోతాడు బలరాముడు. ఆ తర్వాత ఓ పెద్ద నాగుపాము రూపంలో సముద్రము మీదుగా వెళ్ళి ఆకాశములో కలిసిపోతాడు.
శ్రీకృష్ణుడి మరణం
ఇక చివరికి శ్రీకృష్ణుడు తాను కూడా అవతారము చాలించవలసిన సమయము వచ్చిందని అనుకున్నాడు. వెంటనే ద్వారకని విడిచిపెట్టి వెళ్ళిపోయి ఒక చెట్టు నీడలో విశ్రమిస్తాడు. అటుగా వచ్చిన ఓ వేటగాడు పొదల మధ్యలో నుండి శ్రీకృష్ణుడి కాలి వేలును చూసి ఒక జింక అని భ్రమించి తనకు దొరికిన ఇనుప ముక్కతో చేసిన బాణం వేస్తాడు. దీనితో శ్రీకృష్ణుడికి మరణం సంభవిస్తుంది.
మరి కొన్ని పురాణాల కథల ప్రకారం, త్రేతాయుగంలో రాముడు చెట్టు చాటు నుండి వాలిని బాణం వేసి చంపినందుకుగానూ ద్వాపర యుగంలో వాలి వేటగాడి రూపంలో చెట్టు చాటు నుండి బాణం వేసి శ్రీకృష్ణుడిని సంహరించాడని చెప్తారు.
ఇక్కడి వరకూ అందరికీ తెలిసిందే! కానీ ఎవ్వరికీ తెలియని విషయం ఏమీటంటే… మరణం సంభవించిన తరువాత శ్రీకృష్ణుడి శరీరం ఏమయిందో… ఆ తర్వాత ఏం జరిగిందో… దాని వెనుక ఉన్న ఒక ముఖ్యమయిన కథ ఏమిటో.. ఎవ్వరికీ తెలియదు. దాని గురించి ఇప్పుడు క్లుప్తంగా తెలుసుకుందాం.