జీవితం గురించి మనకు ఖచ్చితంగా తెలిసిన ఒకేఒక నిజం ఏమిటంటే, అది ఏదో ఒక రోజు ముగుస్తుందని. ఈ కఠినమైన నిజం మనం ఏమి చేస్తున్నాం? మనం చేసే పనుల వల్ల ఉపయోగం ఏమిటి? అనే ప్రశ్నలు తలెత్తేలా చేస్తుంది. హిందూమతంలో ఉన్న దాదాపు అన్ని గ్రంథాలు కూడా మనం ఎలా జీవించాలో చెప్పాయి కానీ మనం చనిపోయినప్పుడు ఏమి జరుగుతుందో చెప్పనేలేదు. కేవలం గరుడ పురాణం ఒక్కటే లైఫ్ ఆఫ్టర్ డెత్ గురించి మనకు తెలియచేస్తుంది. మనం చేసే కర్మలు ఏవీ వ్యర్థం కావు, కర్మ మాత్రమే ముఖ్యమైనది అనే ఓదార్పుని ఇస్తుంది. మరి అలాంటి గరుడపురాణంలో మనం చేసే కర్మలకి ఎలాంటి పనిష్మెంట్స్ ఉంటాయో ఇప్పుడు చూద్దాం.
గరుడ పురాణం ఏం చెబుతోంది?
గరుడ పురాణం హిందూ మతంలోని వేద పురాణాలలో ఒకటి. హిందూ మతంలో మరణానంతరం మోక్షాన్ని ఇచ్చేది గరుడ పురాణం, అందుకే మరణానంతరం గరుడ పురాణం కథను వినాలని లేదా చదవాలనే నిబంధన ఉంది. ఈ గరుడ పురాణానికి అధిపతి విష్ణువు, అందుకే ఇది వైష్ణవ పురాణం.
గరుడ పురాణం ప్రకారం, మన జీవితంలో మనం చేసిన కర్మల ఫలాలు మనకు లభిస్తాయి, కానీ మరణానంతరం కూడా మనం చేసిన కర్మలకు మంచి మరియు చెడు ఫలాలు లభిస్తాయి. ఈ కారణంగా, ఇంట్లో ఒక సభ్యుడు మరణించిన తర్వాత ఈ జ్ఞానాన్ని పొందేందుకు ఇది ఒక అవకాశంగా నిర్ణయించబడింది. దీని ద్వారా జనన మరణాలకి సంబంధించిన అన్ని సత్యాలను మనం తెలుసుకోవచ్చు అంతేకాదు, మరణంతో విడిపోయిన సభ్యునిపట్ల దుఃఖాన్ని తగ్గించుకోవటానికి కూడా ఇదో అవకాశం.
గరుడ పురాణం సారాంశం
ప్రపంచంలో ఉన్న ఏ మతమైనా ఒక వ్యక్తిని ప్రేరేపించడమే పనిగా పెట్టుకుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని పురాణాలు మరియు గ్రంధాలు ఒక వ్యక్తి తన జీవితకాలంలో తన కర్మల ప్రకారం ఫలితాలను పొందుతారని పేర్కొన్నాయి. ఇక హిందూ మతమైతే, తన కథలలో స్వర్గం మరియు నరకం గురించి అనేక రకాలుగా వివరించింది.
పురాణాలు ఏమని చెప్పాయంటే, దేవతలు నివసించే ప్రదేశాన్ని స్వర్గమనీ, మరణానంతరం పుణ్యం చేసే వ్యక్తులు అక్కడికి వెళ్తారని పేర్కొన్నాయి. అందుకు విరుద్ధంగా రాక్షసులు నివసించే ప్రదేశాన్ని నరకమనీ, మరణానంతరం పాపం చేసే వ్యక్తులు అక్కడికి వెళ్తారని పేర్కొన్నాయి.
ఇక గరుడ పురాణంలో, ఒక వ్యక్తి తాను చేసిన కర్మలను బట్టి మరణానంతరం ఎలాంటి ఫలాలని పొందుతారో చాలా క్లియర్ గా వివరించటం జరిగింది. మనిషి యొక్క పాపాలను బట్టి వివిధ రకాల శిక్షల ఉంటాయని వివరంగా చెప్పబడ్డాయి. ప్రతి మనిషికీ మొత్తం 84 లక్షల జన్మలు ఎలా ఉంటాయో, అలాగే 84 లక్షల నరకాలు ఉన్నాయి, మనిషి తన కర్మల ఫలితంగా వాటిని అనుభవిస్తాడు
గరుడ పురాణంలోని శ్లోకాలు మరియు అంశాలు
గరుడ పురాణం యొక్క మరణానంతర జ్ఞానం హిందూ మతాన్ని ఆచరించే వారికి చాలా ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది. గరుడ పురాణంలో మొత్తం పంతొమ్మిది వేల శ్లోకాలు ఉన్నాయి. వాటిలో ప్రస్తుతం ఎనిమిది వేల శ్లోకాలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ఆ శ్లోకాలని కూడా రెండు భాగాలుగా విభజించారు.
మొదటి భాగంలో విష్ణువుతో ముడిపడి ఉన్న భక్తి మరియు పూజా విధానాలను ప్రస్తావించారు. ఈ విభాగంలో, మరణానంతరం జీవితంలో జరిగే చర్యల యొక్క ప్రాముఖ్యతను గురించి గరుడ పురాణంలో మనం చదువుకోవచ్చు.
రెండవ భాగంలో రాక్షస యుగానికి సంబంధించిన వివరణలను ప్రస్తావించారు. మరణం తర్వాత జీవి ప్రవర్తన ఏమిటి? ఇది ప్రేతంలా ఎలా మారుతుంది? ఆ ప్రేత రూపాన్ని ఎలా వదిలించుకోవాలి? శ్రాద్ధ మరియు పవిత్ర కార్యాలు ఎలా చేయాలి? మరియు నరకంలోని దుఃఖాల నుండి ఎలా బయటపడవచ్చు? వంటి ప్రశ్నలకు సమాధానాలు ఈ గరుడ పురాణంలో వివరంగా చెప్పబడ్డాయి.
మరణం తర్వాత ఏమి జరుగుతుంది?
ఆఫ్టర్ డెత్ ఏం జరుగుతుందో తెలుసుకోవాలనే క్యూరియాసిటీ అందరికీ ఉంటుంది. ఈ ప్రశ్నకి గరుడ పురాణం కరెక్ట్ గా ఆన్సర్ ఇస్తుంది. మనిషి చేసే కర్మలని బట్టి దీనిని 3 దశలుగా విభజించటం జరిగింది.
మొదటి దశలో, మానవుడు తన జీవితంలో మంచి చెడులకు సంబంధించిన అన్ని కర్మల ఫలాలను పొందుతాడు.
రెండవ దశలో, మరణానంతరం, మనిషి తన కర్మల ప్రకారం 84 లక్షల జన్మలలో ఏదైనా ఒక జన్మలో జన్మిస్తాడు.
మూడవ దశలో, అతను తన కర్మల ప్రకారం స్వర్గానికి లేదా నరకానికి వెళ్తాడు.
ఇది కూడా చదవండి: Garuda Puranam’s Predictions for the Future