AP Assembly Speaker Tammineni Sitaram Falls Down While Playing Kabaddi

కబడ్డీ ఆడుతూ కింద పడిపోయిన స్పీకర్ తమ్మినేని (వీడియో)

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం ఈరోజు కబడ్డీ ప్లేయర్ గా మారిపోయారు. రెట్టింపు ఉత్సాహంతో ఒక్కొక్కరినీ అవుట్ చేస్తూ… కాలు స్లిప్ అయి పడిపోయారు. అదృష్ట వశాత్తూ దెబ్బలేమీ తగలకపోవటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. 

శ్రీకాకుళంజిల్లా ఆముదాలవలస జూనియర్‌ కాలేజీలో సీఎం కప్ క్రికెట్, కబడ్డీ టోర్నమెంట్స్ స్టార్ట్ అయ్యాయి. ఈ టోర్నమెంట్స్ ని ఎపీ స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రారంభించారు. అంతేకాదు, ప్లేయర్స్ లో  ఉత్సాహం నింపేందుకు తానుకూడా ఓ ప్లేయర్‌గా మారిపోయారు. 

Futuristic digital creator using Claude AI skills to grow website traffic with glowing SEO analytics dashboards and AI technology visuals.
ఈ Claude AI Skill నా Website Traffic Double చేసింది!

ఇక ప్లేయర్ అవతారం ఎత్తిన తమ్మినేని… ఒక టీం తరుపున బరిలోకి దిగి… కూతకు వెళ్లారు. కబడ్డీ ఆడుతూ… ముగ్గురిని ఔట్ చేశారు. ఆ ఉత్సాహంతో నాలుగో వ్యక్తిని ఔట్ చేసే ప్రయత్నంలో…  కబడ్డీ… కబడ్డీ… అంటూ కూత పెడుతూనే కాలు జారి కింద పడిపోయారు. వెంటనే అప్రమత్తమైన సెక్యూరిటీ గార్డులు ఆయన్ని వెంటనే లేవనెత్తారు. ఎటువంటి గాయాలు కాక పోవడంతో అంతా ప్రశాంతంగా ఊపిరి పీల్చుకున్నారు.

 

Meesala Pilla Telugu song full lyrics image
మీసాల పిల్ల ఫుల్ లిరికల్ సాంగ్

 

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top