కోటి ఆశలతో కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టాలని మనమంతా అనుకుంటాం. ఈ ఏడాది మనం చేయలేకపోయిన పనులన్నీ వచ్చే ఏడాది ఎలాగైనా చేయాలని గట్టిగా డిసైడ్ అయిపోతాం. కొత్త ఏడాదిలో అది చేయాలి, ఇది చేయాలి అని ఏవేవో ఆలోచించేస్తుంటాం. మరి అలాంటప్పుడు రాబోయే నూతన సంవత్సరం ఏయే రాశుల వారికి ఎలా ఉండబోతుందో ఇప్పుడు తెలుసుకుందామా..!
మేష రాశి:
ఈ రాశివారు గతంలో చేసిన తప్పులు మళ్ళీ చేయకుండా చూసుకొంటే చాలు. మీ స్కిల్స్ ని నమ్ముకొని ముందుకు వెళ్లడానికి ప్రయ్నతించండి. ఖచ్చితంగా సక్సెస్ అయి తీరతారు.
వృషభ రాశి:
ప్రతి చిన్న విషయానికీ అనవసరంగా ఆందోళన పడుతూ… మీకు మీరే కొన్ని రిస్ట్రిక్షన్స్ పెట్టుకున్నారు. వాటిని దాటి బయటికి వస్తే… కొత్త ప్రపంచం మీ ముందు ఉంటుంది. ఎప్పుడూ మీకు మీరు సేఫ్ జోన్ లో ఉన్నామనుకొని… మీకు తెలియకుండానే మీ జీవితాన్ని మరింత కష్టాలపాలు చేస్తున్నారు.
మిధున రాశి:
లైఫ్ లో ఏది సాధించాలన్నా… ముందు మన లైఫ్ స్టైల్ బాగుండాలి. అందుకే, హెల్దీ లైఫ్ స్టైల్‌ని అలవర్చుకోవాలి. ఇందుకోసం రెగ్యులర్‌గా వ్యాయామాలు చేయాలి.
కర్కాటక రాశి:
మీ జీవితంలో జరగబోయే మంచి మార్పులకి ఇప్పటినుండే సిద్ధం కండి. మీలో ఉన్న మంచేదో..! చెడేదో..! గుర్తించి వాటిని సెపరేట్ చేయండి. ఎందుకంటే, ఎప్పుడు ఏ అవకాశం మీ తలుపు తడుతుందో తెలియదు కాబట్టి.
సింహ రాశి:
కష్టపడండి… కానీ, త్వరగా ఫలితం రావాలని ఆశించకండి! ఎందుకంటే, ఇది ఎంతో ఓపికతో ఉండాల్సిన సమయం. ఫలితం ఏదైనా సరే! అది రావాల్సిన సమయానికి తప్పకుండా వచ్చి తీరుతుంది.
కన్యా రాశి:
మీ మేలు కోరుకొనే వారి కోసం సమయాన్ని కేటాయించండి. మిమ్మల్ని పట్టించుకోని వారికి దూరంగా ఉండండి. ఎందుకంటే, అన్ని వేళల్లో… అందరితో… స్నేహంగా ఉండలేమన్న విషయాన్ని గుర్తు పెట్టుకోండి.
తులా రాశి:
కలిసొచ్చే సమయం వస్తే ఏదీ ఆగదు. ఈ సంవత్సరం మీకు అచ్చొచ్చే సంవత్సరం. అందుకే టైమ్ వేస్ట్ చేసుకోకుండా మీరు చేయదలచుకున్న పనులేవో వెంటనే చేసేయండి. చేయకుండా పెండింగ్ లో ఉన్న పనులకోసం ఎక్కువ ట్రై చేయండి.
వృశ్చిక రాశి:
మీ చెడును కోరుకునే వారు ఎవరైనా సరే! వారిని దూరం పెట్టేయండి. అనవసరమైన ఖర్చుల జోలికి వెళ్ళకండి.
ధనస్సు రాశి:
వీలైనంత వరకూ డబ్బు ఆదా చేయటానికి ప్రయత్నించండి. ఎట్టి పరిస్థితుల్లోనూ దుబారా ఖర్చులు పెట్టకండి.
మకర రాశి:
అనవసరమైన విషయాలకోసం టైం వేస్ట్ చేసుకోకండి. విద్యార్దులైతే, చదువుపై ఎక్కువ ఇంట్రెస్ట్ పెంచుకోండి.
కుంభ రాశి:
ఇల్లు, ఉద్యోగం ఇవి రెండే జీవితం కాదు, అప్పుడప్పుడూ టూర్స్ కూడా ప్లాన్ చేస్తూ ఉండండి. దానివల్ల కొత్త కొత్త ఐడియాలతో ముందడుగు వేస్తారు.
మీన రాశి:
మిమ్మల్ని కోరుకొనే వారికోసం ఎక్కువ టైం స్పెండ్ చేయండి. ఫ్యామిలీతో స్పెండ్ చేసే టైం ఎట్టి పరిస్థితుల్లోనూ వృథా చేయకండి.