బ్రహ్మంగారు తన కాలజ్ఞానం ద్వారా భవిష్యత్తులో ఏం జరగబోతుందో ముందే చెప్పినట్లు… నోస్ట్రడామస్ తన లెస్ ప్రొఫెటీస్ ద్వారా భవిష్యత్తులో ఏం జరగబోతుందో ముందే అంచనా వేశారు. 465 సంవత్సరాల క్రితమే ప్రపంచ భవిష్యత్తుని లెక్క కట్టగలిగాడు. అంతేకాదు, ఈయన అంచనాలన్నీలో ఏ ఒక్కటీ కూడా వృధాపోలేదు, నూటికి నూరుపాళ్ళు నిజమయ్యాయి. దీంతో గొప్ప గొప్ప మేధావులు సైతం ఈయన అంచనాలని నమ్మక తప్పలేదు.
నోస్ట్రడామస్ ఫేమస్ ఫ్రెంచ్ ఆస్ట్రాలజర్. దక్షిణ ప్రాన్స్‌లోని సెయింట్ రెమి డీ ప్రావిన్స్‌లో 1503 డిసెంబర్ లో జన్మించాడు. ఈయన అసలు పేరు మిచెల్ డి నోస్ట్రెడామ్. అయితే, నోస్ట్రడామస్ గా పాపులర్ అయ్యారు.
నోస్ట్రడామస్ 1547లో ‘లెస్ ప్రొఫెటీస్’ అనే ఒక గ్రంధాన్ని రచించారు. అందులో భవిష్యత్తులో ఈ భూమిపై ఎలాంటి సంఘటనలు జరగబోతున్నాయో చాలా వివరంగా రాశారు. ఈ విషయాలన్నీ కవితల రూపంలో ఆ బుక్ లో ఆయన పేర్కొన్నారు. మొత్తం 942 కవితలుగా తన జ్యోస్యాన్ని ఇందులో పొందుపరిచాడు. దీనిని 1555లో పబ్లిష్ చేయగా… అప్పటినుంచి వరల్డ్ వైడ్ గా ఫేమస్ అయ్యారు.
నోస్ట్రడామస్ భవిష్య జ్యోస్యానికి చాలా పేరుంది. ఎందుకంటే, ఈయన చెప్పిన ఏ ఒక్కటీ కూడా ఇప్పటివరకూ రాంగ్ కాలేదు. 465 సంవత్సరాల క్రితమే 21వ శతాబ్దంలో ఏం జరగబోతుందో ముందుగా ఊహించాడు. ఆకాశంలో నక్షత్రాలని చూస్తూ… భవిష్యత్తుని పక్కాగా అంచనా వేయగలిగాడు. ఈయన మొత్తం 6,338 అంచనాలు వేయగా… అవన్నీ ఒక్కొక్కటిగా ఇప్పటివరకూ జరుగుతూ వచ్చాయి. క్రీ.శ 1547 నుండీ 3,797 వరకూ ఈయన అంచనా వేశారు. అయితే, నాలుగున్నర శతాబ్దాల క్రితమే భవిష్యత్తుని ముందే ఎలా ఊహించాడు అన్నదే మిలియన్ డాలర్ల ప్రశ్నగా మిగిలిపోయింది.
చరిత్ర పుటల్లో నిలిచిపోయిన ఎన్నో భయంకరమైన సంఘటనలని నోస్ట్రడామస్ ఆ కాలంలోనే వివరించారు. వాటిలో 1963లో అమెరికా మాజీ అధ్యక్షుడు జాన్ ఎఫ్ కెన్నడీ హత్య, 1933-1945 కాలంలో అడాల్ఫ్ హిట్లర్ అరాచకం, 1945లో హిరోషిమా, నాగాసాకిల పై అణుబాంబు, సెప్టెంబర్ 11 న 2001లో అమెరికాలో ట్విన్ టవర్స్ పై జరిగిన దాడి, 2019లో కరోనా వైరస్ విజృంభణ వంటివెన్నో ఆయన ముందుగానే ఊహించి రాశాడు.
అయితే, 2022 గురించి కూడా నోస్ట్రడామస్ అంచనా వేశారు. అది ఏంటని ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా హై టెన్షన్ నెలకొంది. అసలే గతేడాది యావత్ ప్రపంచం అంటురోగాలు, కరువులు, వరదలు, దొంగతనాలు, దోపిడీలతో అతలాకుతలం అయిపొయింది. ఇక అప్పుడే న్యూ ఇయర్ కౌంట్ డౌన్ కూడా స్టార్ట్ అయింది. దీంతో వచ్చే ఏడాది ఎలా ఉంటుందో అన్న టెన్షన్ పట్టుకుంది అందరిలో. ఈ క్రమంలోనే అనేక జ్యోతిష్య శాస్త్రాలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా ఇప్పుడు అందరి చూపు నోస్ట్రడామస్ పై పడింది.
అయితే, నోస్ట్రడామస్ భవిష్య వాణి 2022… 2021 కన్నా భయానకంగా ఉంటుందని చెప్పింది.
- 2022లో ధరలు విపరీతంగా పెరిగిపోతాయట. క్రిప్టో కరెన్సీ కారణంగా బంగారం, వెండి ధరలు కూడా ఆకాశాన్ని అంటుతాయట. దీనివల్ల ద్రవ్యోల్బణం అదుపుతప్పి… యూఎస్ డాలర్ విలువ పడిపోతుంది.
- అంతరిక్షం నుంచీ పెనుముప్పు పొంచి ఉంది. 2022 మొత్తం ఉల్కల వల్ల కలిగే నష్టాన్ని చవిచూడాల్సి వస్తుంది. నిప్పుతో కూడి పొడవైన తోకచుక్కలు ఆకాశం నుండీ భూమి పైకి దూసుకొని వస్తాయి. భారీ గ్రహశకలాలు కూడా భూమిని ఢీకొనే అవకాశం లేకపోలేదు. ఇక అంతరిక్షం నుండీ దూసుకొచ్చిన ఓ భారీ ఆస్టరాయిడ్ సముద్రంలో పడి… ఉప్పెనకి దారితీస్తుంది.
- ఈ ఏడాది ఫ్రాన్స్‌లో సంక్షోభం ఏర్పడనుంది. భారీ తుఫాను కారణంగా వరదలు, అగ్ని ప్రమాదాలు వంటివి ఏర్పడి కరువుకి దారితీస్తుంది. ఆహారం కోసం యుద్ధాలే జరుగుతాయి.
- ఈ సంవత్సరంలో న్యూక్లియర్ బాంబు పేలనుందట. అయితే, అది ఎక్కడ పేలుతుందో చెప్పలేదు కానీ ఆ న్యూక్లియర్ బాంబు వల్ల భూమికి భారీగా డ్యామేజ్ అవుతుందట. ఇప్పటికే చాలా దేశాలు అణుబాంబులను తయారు చేస్తున్నాయి. దీంతో ఏ దేశం ఎప్పుడు ఎవరి మీద వేస్తుందో తెలియదు.
- 2022లో భారీ ఎత్తున డ్యామేజీ జరగనుంది. అది ఏ స్థాయిలో ఉంటుందంటే, 72 గంటల పాటు మొత్తం చీకటి అయిపోతుందట.
- పెద్ద పెద్ద కొండల మీద మంచు పడుతుందట.
- సైన్స్ ఫిక్షన్ నవలల్లో లాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మానవులపై ఆధిపత్యం చెలాయిస్తాయి. 2022 నాటికి కృత్రిమ మేధస్సు హ్యూమన్ ఇంటర్‌ఫేస్‌తో కంప్యూటర్‌ను పాలించవచ్చని అంచనా.