Deer Sacrifices itself to Save its Baby

బిడ్డ ప్రాణాలు కాపాడేందుకు ఓ తల్లి చేసిన ప్రాణత్యాగం (వీడియో)

ప్రపంచంలో ఏ తల్లైనా తన బిడ్డని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తుంది. ఏ చిన్న దెబ్బ తగిలినా తల్లి మనసు విలవిల్లాడిపోతుంది. ఇది కేవలం మనుషుల్లోనే కాదు. ఈ సృష్టిలో ప్రతి జీవిలోనూ ఉండే తల్లి మనసు ఒకటే! 

ఇక అడవిలో జంతువులు అయితే క్రూరమృగాల బారినుండీ తమ పిల్లలని కంటికి రెప్పలా కాపాడుకుంటాయి. పొరపాటున ఆపద వస్తే, తమ ప్రాణాలను సైతం అడ్డువేస్తాయి. సరిగ్గా ఇదే జరిగింది ఇక్కడ.

ఒక అడవిలో జింకల గుంపు చెరువును దాటే ప్రయత్నం చేస్తున్నాయి. వాటిలో ఒక జింక పిల్ల అనుకోకుండా ఆ గుంపులోనుండీ విడిపోతుంది. ఒంటరిగా చెరువుని దాటుతూ ఉంటుంది. ఇంతలో ఒక మొసలి అది గమనిస్తుంది. దానిని వేటాడటం కోసం వేగంగా జింక పిల్లని సమీపిస్తుంది.  

తన బిడ్డ ప్రాణం ప్రమాదంలో పడిందని గమనించిన తల్లి… ఆగమేఘాల మీద పరిగెత్తుకుంటూ వచ్చి…మొసలికి తాను ఆహారంగా మారి… బిడ్డకు ఒక కవచంలా నిలుస్తుంది. వెంటనే జింక పిల్ల సురక్షితంగా ఒడ్డుకి చేరుతుంది. తల్లి మాత్రం… నేను చెప్పలేను… మీరే చూడండి.

Futuristic digital creator using Claude AI skills to grow website traffic with glowing SEO analytics dashboards and AI technology visuals.
ఈ Claude AI Skill నా Website Traffic Double చేసింది!

ఈ వీడియో చూశాక ప్రతి వ్యక్తి కూడా ఖచ్చితంగా కంట తడి పెట్టి  ఉంటారు కదూ! తల్లి ప్రేమంటే అదే మరి. తన బిడ్డని కాపాడుకొనే నేపధ్యంలో తన ప్రాణాలను సైతం పణంగా పెట్టటానికి సిద్ధమైంది. అందుకే, ఈ వీడియో అందరి హృదయాలని కదిలించి వేస్తోంది. 

 

 

 

Meesala Pilla Telugu song full lyrics image
మీసాల పిల్ల ఫుల్ లిరికల్ సాంగ్
View this post on Instagram

 

A post shared by Binnu Dhillon (@binnudhillons)

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top