Ancient methods of predicting rain using sky, clouds, birds, and animals

వర్షం రాబోతుందని మన పూర్వీకులు ఎలా అంచనా వేసేవారో తెలుసా?

పూర్వీకులు వర్షం అంచనా వేసే విధానం నిజంగా చాలా ఆశ్చర్యకరంగా ఉండేది. నేటి కాలంలో మనం శాటిలైట్ లు, రాడార్‌లు, వాతావరణ శాఖ చెప్పే వివరాలను ఆధారపడి వర్షం గురించి తెలుసుకుంటున్నాం కానీ, పూర్వ కాలంలో అయితే ఎలాంటి టెక్నాలజీ లేకపోయినా, ప్రకృతిలో వచ్చే మార్పులని గమనించి వర్షం ఎప్పుడు వస్తుందో అద్భుతంగా చెప్పగలిగేవారు. మరి ఆ మార్పులేంటో వివరంగా తెలుసుకుందాం.

పూర్వీకులు వర్షం అంచనా వేసే విధానం

పూర్వ కాలంలో ఆకాశం, మేఘాలు, గాలి, పక్షులు, జంతువుల ప్రవర్తనను గమనించి మన పూర్వీకులు వర్షం ఎప్పుడు పడుతుందో ఖచ్చితంగా అంచనా వేసి చెప్పేవారు. అది ఎలానో ఇప్పుడు క్లియర్ గా తెలుసుకుందాం.

ఆకాశం రంగు చెప్పే రహస్యాలు

సూర్యాస్తమయం సమయంలో ఆకాశం ఎరుపు, నారింజ రంగులతో మెరిసిపోతే, మరుసటి రోజు వర్షం వచ్చే అవకాశముందని పూర్వీకులు నమ్ముతారు. అలాగే ఉదయం సూర్యోదయం సమయంలో ఆకాశం మబ్బులతో కప్పబడితే ఆ రోజే వర్షం పడే అవకాశం ఎక్కువగా ఉండేది.

People experiencing the mysterious hum sound heard on Earth, unexplained low-frequency noise
భూమిపై రహస్య శబ్దం – ఎవరికీ అర్థం కాని హమ్ సౌండ్

మేఘాల ఆకారం, కదలిక

  • మేఘాలు నల్లగా, బరువుగా మారితే అది భారీ వర్ష సూచన.
  • మేఘాలు వేగంగా తూర్పు నుంచి పడమటికి కదిలితే వర్షం దగ్గరలో ఉందని భావించేవారు.
  • మేఘాలు తక్కువ ఎత్తులో కప్పుకుంటే వర్షం తప్పనిసరిగా కురుస్తుందని వారు చెప్పేవారు.

గాలి మార్పులు

  • వర్షం రాకముందు గాలి తేమగా, చల్లగా మారుతుంది.
  • అకస్మాత్తుగా గాలి దిశ మారిపోవడం కూడా వర్షానికి సూచన.
  • మన పూర్వీకులు గాలి వాసన చూసి కూడా వర్షం ఎప్పుడు వస్తుందో చెప్పగలిగేవారు.

ఇది కూడా చదవండి: కాకులని పితృదేవతల ప్రతిరూపంగా ఎందుకు భావిస్తారు..!

పక్షుల ప్రవర్తన

  • పక్షులు గుంపులు,  గుంపులుగా తక్కువ ఎత్తులో ఎగరడం వర్షానికి సంకేతం.
  • గువ్వలు, కాకులు అల్లరి చేయడం, నిరంతరం అరవడం కూడా వర్షం దగ్గరలో ఉందని నమ్మేవారు. 
  • చీమలు వాటి గూటి నుంచి బయటికి రావడం, పైకి ఎక్కడం వర్ష సూచనగా పరిగణించబడేది.

జంతువుల సంకేతాలు

  • కప్పలు గట్టిగా అరవడం వర్షం రానుందనే అతి ప్రాచీన సూచన.
  • పశువులు మైదానంలో గుంపులుగా చేరడం కూడా వర్షానికి సంకేతంగా చెప్పబడేది.

వ్యవసాయంలో ఉపయోగం

ఈ సహజ లక్షణాలను గమనించడం వల్ల రైతులు విత్తనాలు వేసే సమయాన్ని నిర్ణయించేవారు. పంటలు వర్షం వల్ల నష్టపోకుండా, ముందుగానే చర్యలు తీసుకునే అవకాశం ఉండేది. సాంకేతికత లేకపోయినా, ప్రకృతిని గమనించే జ్ఞానం వారిని మరింత తెలివిగా మార్చింది.

ముగింపు

ప్రకృతిని గమనించి వర్షం గురించి ముందుగానే చెప్పగలిగిన జ్ఞానం మన పూర్వీకులు వర్షం అంచనా వేసే ప్రత్యేకత. సాంకేతిక పరిజ్ఞానం ఎంత ఎదిగినా, ప్రకృతి ఇచ్చే సంకేతాలు ఎప్పటికీ నిజమే. కాబట్టి మన పూర్వీకుల జ్ఞానాన్ని గుర్తు చేసుకుంటూ, మళ్లీ ప్రకృతితో కలసి జీవించడం మనందరికీ అవసరం.

👉 కాబట్టి, తర్వాతిసారి వర్షం రాకముందు ఆకాశం, మేఘాలు, గాలి, పక్షులు, జంతువులని ఒకసారి గమనించండి. మీకే అర్థమవుతుంది – మన పూర్వీకులు చెప్పిన జ్ఞానం ఎంత గొప్పదో!  

Illustration of hardworking ants carrying food grains, teaching life lessons of hard work, patience, and teamwork
చీమల నుండి మనిషి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు!

👉 ఈ టాపిక్ మీకు నచ్చినట్లయితే, ఫ్రెండ్స్, అండ్ ఫ్యామిలీ మెంబెర్స్ కి షేర్ చేయండి!

👉 ఇలాంటి మరికొన్ని వైరల్ టాపిక్స్ కోసం మా వెబ్ సైట్ ని ఫాలో అవ్వండి. 

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top