Wednesday, September 28, 2022
spot_img

హర్రర్ మూవీని తలపించేలా … బ్లాక్‌హోల్‌ నుంచి వస్తున్న భయంకరమైన శబ్దాలు (వీడియో)

ఈ విశ్వంలో మానవ మేధస్సుకి అందని అంతుచిక్కని రహస్యాలెన్నో దాగి ఉన్నాయి. వీటిలో ముఖ్యంగా ఓకే ఒక విషయం ఆస్ట్రోనమర్స్ కి ఇప్పటికీ అంతు చిక్కని రహశ్యంగా మిగిలి ఉంది. అదే బ్లాక్‌ హోల్స్.

బ్లాక్‌ హోల్స్ అనేవి గెలాక్సీ లో ఒక భాగం. వీటి చుట్టూ ఎంతలా గ్రావిటీ ఉంటుందంటే… సమీపంలోకి ఒక చిన్న సెల్ వచ్చినా సరే దానిలోకి లాగేసుకుంటుంది. చివరికి కాంతి వంటి ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ రేడియేషన్ కూడా దాని నుంచి తప్పించుకోలేదు.

గెలాక్సీ లో ఎన్నో బ్లాక్‌హోల్స్ ఉన్నా… పెర్సియస్ గెలాక్సీ క్లస్టర్ సెంటర్ లో ఉన్న బ్లాక్‌హోల్ మాత్రం ఎంతో ప్రత్యేకం. ఈ బ్లాక్‌హోల్‌ భూమినుంచి 240 మిలియ‌న్ కాంతిసంవ‌త్సరాల దూరంలో ఉంటుంది. అయితే, 2003 నుండీ ఈ బ్లాక్‌హోల్ నుండీ వింత శబ్దాలు రావటం మొదలు పెట్టాయి. తాజాగా, నాసా సైంటిస్టులు ఈ బ్లాక్‌హోల్ చేస్తున్న భయంకరమైన శ‌బ్దాల‌ని విడుద‌ల చేశారు.

గెలాక్సీ క్లస్టర్స్ నుండీ వస్తున్న ఈ సోనిఫికేషన్‌ సౌండ్ వేవ్స్ ని రికార్డ్ చేశారు. నాసాకి చెందిన చంద్ర ఎక్స్‌రే అబ్జర్వేట‌రీ ఈ వింత శబ్దాలని సౌండ్ వేవ్స్ గా మార్చారు. దీనికి సంబందించి ఆడియోతో కూడిన వీడియో ఒకటి రిలీజ్ చేశారు. బాబోయ్… బ్లాక్ హోల్ నుంచీ వస్తున్న ఈ భయంకరమైన శబ్దాలు వింటే… హర్రర్ మూవీని తలపిస్తున్నాయి.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
3,502FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles