సోషల్ మీడియా పుణ్యామా అని రోజూ రకరకాల జంతువుల వీడియోలు చూస్తున్నాం. వీటిలో కొన్ని వీడియోలు నెట్టింట్లో తెగ హల్‌చల్ చేస్తుంటాయి. అలాంటి వీడియోనే ఒకటి ఇప్పుడు విపరీతంగా వైరల్ అవుతుంది.
సాదారణంగా ఇంట్లో మనం ఏ పిల్లులనో, కుక్కలనో పెంచుకుంటూ ఉంటాం. అవి చేసే ముద్దు ముద్దు పనులు చూసి మురిసిపోతూ ఉంటాం. ఇక ఈ మద్య కాలంలో అయితే వాటిని క్యాప్చర్ చేసి సోషల్ మీడియాలో పెట్టేయటం ఫ్యాషన్ అయిపొయింది. ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఈ టాపిక్ లో ఓ పెంపుడు పిల్లి ఏం చేసిందో మీరే చూడండి.
ఓ వ్యక్తి ఎలక్ట్రికల్ పనులు చేస్తూ ఉంటాడు. ఇంతలో అతని పక్కనే ఉన్న ఓ ఫ్రిజ్ పైకి పిల్లి ఎక్కుతుంది. అతను వైర్లను పైకి తీసి చెక్ చేస్తున్నప్పుడు అది కూడా తల పైకెత్తి వాటిని పట్టుకొని చెక్ చేస్తూ ఉంటుంది. అది చేసే పనులు చూసి ఆ వ్యక్తి తనలో తాను మురిసిపోతూ ఉంటాడు.
ఈ వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేయగానే ఇంకేముంది అది కాస్తా వైరల్ గా మారి కూర్చుంది. మొత్తం మీద ఆ పిల్లి చేసిన పనికి పిల్లి చేష్టలు అని సరిపెట్టుకోవాలో… లేక ప్రమాదమని భయపడాలో… లేక ఆ వ్యక్తికి అసిస్టెంట్ గా హైర్ అయింది అనుకోవాలో… మీరే చెప్పండి.
“Yep, looks good… now pull the wires through over here and we’re done” –Electricatian pic.twitter.com/hSY3UidiSK
— Madeyousmile (@Thund3rB0lt) November 24, 2022