తన పర్మిషన్ లేకుండా ఫోటో తీసిందని ఏనుగు ఈ అమ్మాయిని ఏం చేసిందో చూడండి! (వీడియో)

ఏనుగులు చేసే అల్లరి చేష్టలు సరదాగా అనిపిస్తుంటాయి. కొన్ని సందర్భాల్లో ఆ సరదా పనులే కొంతమందిని తీవ్రంగా ఇబ్బందిపెట్టేస్తాయి. మనం చూస్తుండగానే మనుషులపై దాడి చేస్తాయి. 

ఇక సోషల్ మీడియాలో జంతువుల అల్లరి చేష్టలకు సంబంధించిన వీడియోలు తెగ వైరల్ అవుతుంటాయి. అందులో కొన్ని వీడియోలు నవ్వులు తెప్పించగా… కొన్ని వీడియోలు అయ్యో పాపం అనుకొనే  విధంగా ఉంటాయి. ఇక్కడ ఓ ఏనుగు పిల్ల చేసిన పని చూస్తే మాత్రం నిజంగానే అయ్యో పాపం అనిపిస్తుంది.

అప్పటి దాకా ప్రశాంతంగా కనిపించిన ఏనుగుకు ఒక్కసారిగా కోపమోచ్చింది. ఇంకేముంది తన ఎదురుగా ఉన్న అమ్మాయి చెంప పగలకొట్టింది ఆ ఏనుగు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట్లో తెగ వైరల్ అవుతుంది. ఇంతకీ ఉన్నట్టుండి ఆ ఏనుగుకు ఎందుకు అంతంగా కోపం వచ్చిందో ఇపుడు తెలుసుకుందాం.

జూకు వెళ్లిన కొందరు పర్యాటకులు ఏనుగును చూసేందుకు దాని దగ్గరికి వెళ్ళారు. ఆ ఏనుగు కూడా ఎంతో ప్రశాంతంగా కనిపిస్తూ ఉంది. తొండంతో వారి చేతులను కూడా పట్టుకుంది. అయితే అందరు ఏనుగు తొండాన్ని పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్న సమయంలోనే అక్కడే ఉన్న ఓ యువతి ఏనుగును ఫోటో తీయాలనుకుంది. 

వెంటనే తన దగ్గర ఉన్న ఫోన్ తో ఏనుగును ఫోటో తీయడానికి ట్రై చేసింది. దీంతో ఆ ఏనుగుకు కోపం వచ్చి  వెంటనే ఆ అమ్మాయిని చెంప పగల కొట్టింది. దీంతో ఆ అమ్మాయి చేతిలో ఉన్న ఫోన్ కాస్తా కింద పడిపోయింది.

పక్కనే ఉన్న మరో వ్యక్తి ఆ అమ్మాయిని పట్టుకున్నాడు. అమ్మాయిని కొట్టిన తర్వాత కిందపడిన ఫోన్ తీసుకోవడానికి ట్రై చేసింది. దీంతో వెంటనే అప్రమత్తమైన అక్కడున్నవారు వెంటనే ఫోన్ తీసుకున్నారు. ఈ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

 

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top