Frilled Shark Over 80 Million Year Old

రీసెంట్ గా బయటికొచ్చిన 80 మిలియన్ సంవత్సరాల క్రిందటి సముద్ర డైనోసార్ (వీడియో)

డైనోసార్ల యుగం అంటే సుమారు 80 మిలియన్ సంవత్సరాల క్రితం మాట. అప్పట్లో ఈ జాతి భూమిపై సంచరిస్తూ ఉండేవని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఇప్పుడు కేవలం వాటి అవశేషాలని మాత్రమే కొన్ని కొన్ని చోట్ల భద్రపరిచి ఉంచారు. వాటి ఆధారంగా అవి ఎంత భయంకరంగా ఉంటాయో తెలుస్తుంది. 

ఇక సముద్రం అంటేనే అంతుచిక్కని రహస్యాల నిధి. సముద్ర గర్భంలో మరో ప్రపంచమే దాగి ఉంది. అక్కడ చిత్ర విచిత్రాలెన్నో ఉన్నాయి. అలాంటి విచిత్ర సంఘటనే ఇప్పుడు మనం చెప్పుకోబోయేది.

మెరైన్ ఎక్స్ ప్లోరర్స్ కెమెరాకి సడెన్ గా ఓ విచిత్రమైన చేప దర్శనమిచ్చింది. అది చూడటానికి చాలా భయానకంగా ఉంది. దాని శరీరాకృతి అచ్చం డైనోసార్ ని పోలి ఉంది. అంతేకాదు, సగం చేపలా, సగం పాములా కనిపిస్తూ ముఖ భాగం మాత్రం  డైనోసార్ రూపంలో ఉంది. ఆ జీవి హాయిగా సముద్రంలో ఈత కొడుతూ కనిపించింది. దానిని చూసి ఒక్కసారిగా అంతా షాక్ అయ్యారు.

ఈ అరుదైన జీవిని ‘ఫ్రిల్డ్ షార్క్’ జాతికి చెందినదనిగా గుర్తించారు. దీనిని ‘దెయ్యం షార్క్’ అని కూడా అంటారు. దీని తోక పాము ఆకారంలో ఉండటం వల్ల ఈత కొట్టడానికి వీలుగా సహాయపడుతుంది. మిగిలిన భాగం షార్క్ లాగా ఉండటం వల్ల ఎరను ఈజీగా పట్టి చంపడానికి సహాయపడుతుంది.

ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మొత్తమీద ఈ వీడియో నెటిజన్లని విపరీతంగా ఆకట్టుకుంది. 

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top