Giant Cannibal Alligator Eats Another Alligator in South Carolina

మొసలిని మరో మొసలి నమిలి తినటం ఎప్పుడైనా చూశారా..? (వీడియో)

బాహ్య ప్రపంచంతో పోల్చుకుంటే… అడవి ప్రపంచం చాలా భిన్నంగా ఉంటుంది. ఎందుకంటే, అక్కడ క్రూరమృగాలకి దొరక్కుండా… వాటి  బారినుండి సాధు జంతువులు తప్పించుకొని తిరగాలి. ఏమాత్రం నిర్లక్ష్యంగా ఉన్నా… ఇక వాటి పని ఔటే! కానీ, బయటి ప్రపంచం అలాకాదు, ఏ జంతువైనా స్వేచ్చగా తిరిగేయెచ్చు. అయితే, దీనికి భిన్నంగా జరిగిందిక్కడ.

ఇప్పుడు మనం చెప్పుకోబోయే టాపిక్ గురించి వింటే… ఒక్కసారిగా వెన్నులో ఒణుకు పుడుతుంది. ఈ వీడియో చూసిన తర్వాత ఖచ్చితంగా మీరు షాకవుతారు కూడా. 

మొసలి ఎంతటి బలశాలో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. నీళ్లలో ఉన్నప్పుడు మొసలికి వెయ్యి ఏనుగుల బలం ఉంటుంది అంటారు. అందుకే అది ఎలాంటి జంతువునైనా ఇట్టే మట్టుబెట్టేస్తుంది. అలాంటి మొసలి తన ఆహారంగా సొంత జాతికి చెందిన మరో మొసలిని తినడం ఎప్పుడైనా చూశారా..?

టేలర్ సోపెర్ అనే వ్యక్తి ఈ ఫుటేజీని ట్విట్టర్ లో ట్వీట్ చేశాడు. సౌత్ కరోలినాలోని హ్యారీ కౌంటీలో నివాసముంటున్న తన తండ్రి పెరట్లో ఉన్న చెరువులో ఒక మొసలి ఉంది. అది సడెన్ గా చెరువు ఒడ్డున ఉన్న మరో మొసలిని నమిలి తింటూ కనిపించింది. దీనిని వీడియో తీసిన అతను తన ట్విట్టర్ అకౌంట్‌లో పోస్ట్ చేశాడు. చాలా షార్ట్ పీరియడ్ లోనే ఈ వీడియో వైరల్‌గా అయింది. ఇంకా లేట్ ఎందుకు? మీరు కూడా ఆ వీడియోపై ఓ లుక్కేయండి.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top