Google Scholarship 2021

విద్యార్థులకు స్కాలర్‌షిప్స్ అందిస్తున్న గూగుల్..!

టెక్ దిగ్గజం గూగుల్‌ విద్యార్థులకోసం ఓ సరికొత్త ప్రాజెక్ట్ కి శ్రీకారం చుట్టింది. కంప్యూటర్‌ సైన్స్‌లో కెరీర్‌ కొనసాగించాలని అనుకొనే వారికోసం స్కాలర్‌షిప్స్ అందించటానికి సిద్ధమైంది. ఈ మేరకు ‘జనరేషన్‌ గూగుల్‌ స్కాలర్‌షిప్‌‘ అనే ప్రోగ్రామ్‌ని లాంచ్ చేసింది.  

టెక్నాలజీ రంగంలో మహిళలు మరింత రాణించటానికి గూగుల్ చేయూతనిస్తుంది. కంప్యూటర్‌ సైన్స్‌లో కెరీర్‌ కంటిన్యూ చేయాలని కలలు కనే  విద్యార్థులకు గూగుల్‌ ఈ చక్కటి అవకాశం కల్పిస్తోంది. కంప్యూటర్ సైన్స్ చదువుతున్న మహిళలకి జనరేషన్ గూగుల్ స్కాలర్‌షిప్‌ సపోర్ట్ ని అందిస్తుంది. 

ఈ స్కాలర్‌షిప్ కి ఎంపికైన విద్యార్థులకి 1,000 డాలర్లు అందిస్తారు. అంటే ఇండియన్ కరెన్సీలో 74,760 రూపాయలు స్కాలర్‌షిప్ రూపంలో పొందొచ్చు. దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమయింది. దరఖాస్తు చేసుకోవాలి అనుకున్నవారికి ఆఖరితేది డిసెంబర్ 10.

ఈ స్కాలర్‌షిప్ ప్రోగ్రామ్‌కి సెలెక్ట్ చేసేటప్పుడు గూగుల్… విద్యార్థినుల అవుట్ స్టాండింగ్ అకడమిక్ రికార్డుని పరిశీలిస్తుంది. అందుకే గుడ్  అకడమిక్ రికార్డుతో పాటు డైవర్సిటీ, ఈక్విటీ, ఇంక్లూషన్, ఇన్నోవేషన్ పట్ల విద్యార్థుల కమిట్మెంట్ లెవెల్ ని బట్టి… స్కాలర్‌షిప్ ప్రోగ్రామ్‌కి సెలెక్ట్ చేస్తుంది. 

అంతేకాక, స్కాలర్‌షిప్‌కు అప్లై చేసుకున్న విద్యార్థినులు 2021-22 విద్యా సంవత్సరంలో అండర్‌గ్రాడ్యుయేట్ లో ఫుల్‌టైమ్‌ బ్యాచిలర్ డిగ్రీ చదువుతుండాలి. స్కాలర్‌షిప్ ప్రోగ్రామ్‌ కంప్లీట్ అయ్యే నాటికి ఏదో ఒక ఆసియా పసిఫిక్ కంట్రీలో గుర్తింపు పొందిన యూనివర్సిటీలో రెండో సంవత్సరం చేస్తుండాలి.

ఇక అప్లికెంట్స్… మునుపటి, లేదా ప్రస్తుత కంపెనీల టెక్నాలజీ ప్రాజెక్టులు, కమ్యూనిటీ ఎంగేజ్‌మెంట్, అకడమిక్ ట్రాన్‌స్క్రిప్ట్‌లలో పాల్గొన్నట్లుగా రెజ్యూమ్ సమర్పించాలి. అలాగే, కంప్యూటర్ సైన్స్ అండ్ టెక్నాలజీలో తక్కువ ప్రాతినిధ్యం ఉన్న గ్రూపులని ఇంప్రూవ్ చేయడానికి 400 వర్డ్స్ కి మించకుండా ఇంగ్లీష్ లో ఎస్సే రాసి పంపించాల్సి ఉంటుంది.

దరఖాస్తు చేసుకొనే విధానం:

  1. విద్యార్థులు ముందుగా Generation Google Scholarship వెబ్‌సైట్‌పై క్లిక్ చేయాలి.
  2. ఆ తర్వాత Apply Now పై క్లిక్ చేయాలి.
  3. అడిగినన సమాచారాన్ని పొందుపరచాలి.
  4. అవసరమనుకుంటే ఏదైనా స్కాలర్‌షిప్ సంబంధిత సమాచారం కోసం… మీ ప్రశ్నని Google Email Id కి పంపవచ్చు.

స్కాలర్‌షిప్ సంబంధించి కాకుండా మరే ఇతర సమాచారానికి సంబంధించి ప్రశ్నలు అడిగినా… Google దీనికి సమాధానం ఇవ్వలేదు.  టెక్నాలజీ రంగంలో విద్యార్థులను ప్రోత్సహించడానికి గూగుల్ తరచుగా ఇలాంటి ప్రోగ్రామ్‌లను కండక్ట్ చేస్తుంది. చదవులో ఉత్తమ ఫలితాలను అందుకొంటున్నప్పటికీ ఆర్థికంగా వెనుకబడిన నిరుపేద విద్యార్థుల కోసం గూగుల్ ఇలా సహాయపడుతుంది. మరింత సమాచారం కోసం ఈ వెబ్ సైట్ లో చూడండి.

https://buildyourfuture.withgoogle.com/scholarships/generation-google-scholarship-apac

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top