Heron Swallows Live Baby Rabbit

బతికున్న కుందేలుని అమాంతం మింగేసిన హెరాన్ (వీడియో)

డైలీ సోషల్ మీడియాలో ఎన్నో  వీడియోలు వైరల్ అవుతుంటాయి. వాటిలో అన్నిటికంటే ఎక్కువ జంతువులు, పక్షులకి సంబంధించినవే ఉంటాయి. వీటిలో కొన్ని వీడియోలు ఆశ్చర్యాన్ని కలిగిస్తే, ఇంకొన్ని వీడియోలు భయాన్ని కలిగిస్తాయి. కొన్ని ఫన్నీగా ఉంటే, మరికొన్ని శాడ్ గా ఉంటాయి. ఎలా ఉన్నప్పటికీ కొన్ని వీడియోలు మాత్రం మనకి చాలాకాలం వరకూ గుర్తుండిపోతాయి. 

జంతువులన్నాక ఏదో ఒక చిన్న జంతువుని వేటాడటం, తినటం కామనే! అదే పక్షులైతే ఏ గింజలనో, చిన్న చిన్న పురుగులనో తిని బతికేస్తుంటాయి. ఇక్కడ ఈ రెండిటికీ చెందినది కాకుండా వేరే రకం పక్షి ఒకటి ఉంది. అది చూడటానికి అచ్చం కొంగని పోలి ఉంటుంది. కానీ, ఓ మాదిరి సైజ్ ఉండే జీవుల్ని అమాంతం మింగేస్తుంది. అది కూడా బతికుండగానే. దాని పేరే హెరాన్.

ఇది అచ్చం కొంగలా కనిపిస్తూ, వివిధ రకాల కలర్స్ లో ఉంటుంది. కానీ, అది వేటాడితే మాత్రం చాలా సాలిడ్‌గా ఉంటుంది. ఇది చేపల్ని చాలా ఈజీగా ట్రాప్ చేస్తుంది. చేపలే కాకుండా ఇంకా ఎలుకలు, పాములు, పక్షులు, కుందేళ్లు ఇలా దాని వేటకేదీ కాదు అతీతం.

People experiencing the mysterious hum sound heard on Earth, unexplained low-frequency noise
భూమిపై రహస్య శబ్దం – ఎవరికీ అర్థం కాని హమ్ సౌండ్

మంచి ఆకలి మీద ఉన్నప్పుడు ఏ జీవి దొరికితే దాన్ని అమాంతం మింగేస్తుంది. అయితే, దీనికో గుడ్ హ్యాబిట్ కూడా ఉందండోయ్! ఏ జీవినైనా సరే తినే ముందు దానిని ఒకటికి రెండుసార్లు వాటర్ లో క్లీన్ చేసుకొని మరీ తింటుంది. 

ఇక రీసెంట్ గా ఈ హెరాన్ ఓ బతికున్న ర్యాబిట్ ని ఎంచక్కా ఆరగించేసింది. దీని వాలకం చూస్తుంటే కొద్దిగా చిన్నగా ఉంటే… మనల్ని కూడా బతికుండగానే మింగేస్తుందేమో! అనిపిస్తుంది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుత్గుంది. 

Illustration of hardworking ants carrying food grains, teaching life lessons of hard work, patience, and teamwork
చీమల నుండి మనిషి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు!

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top