How Omens Affect Our Lives

శకునాలు మన జీవితంపై ఎలాంటి ప్రభావం చూపుతాయి?

హైందవ సాంప్రదాయంలో ఏ పని చేయాలన్నా… ముందు శకునం చూడటం ఆచారంగా వస్తుంది. ఏదైనా ఒక పనిని ప్రారంభించే ముందు తిధి, వారం, నక్షత్రం వంటివి చూడటం ఒక ఎత్తైతే, జంతువు, లేదా పక్షి ఇచ్చే సంకేతం చూడటం మరో ఎత్తు.

ఆ సంకేతాల ఆధారంగానే అది మంచి ఫలితాన్ని ఇస్తుందా! లేక చెడు ఫలితాన్ని ఇస్తుందా! అనేది అంచనా వేస్తుంటారు. 

Pisces Horoscope September 2025 – Meena Rashi monthly astrology predictions about career, love, finance, and health.
మీన రాశి వారికి సెప్టెంబర్ నెలలో ఏమి జరగబోతుంది?

పూర్వ కాలంలో అయితే పనిమీద బయటికి వెళ్ళేటప్పుడు ఒక జంతువు, లేదా పక్షి ఇచ్చే సంకేతాలని బట్టి  శుభాశుభాలని లెక్కకట్టేవాళ్ళు. మరి ఆ జీవులేవో… అవి ఇచ్చే సంకేతాలేవో… అవి మన జీవితంపై ఎలాంటి ప్రభావం చూపుతాయో… ఇప్పుడు తెలుసుకుందాం.

  • ఉదయాన్నే ఏదైనా ముఖ్యమైన పనిమీద బయటకి వెళ్తుంటే… హంస, నెమలి, చిలుక, తెల్ల గుర్రం వంటివి కనిపిస్తే దానిని శుభ సూచకంగా పరిగణిస్తారు.
  • ఇంట్లో పిల్లి ప్రసవిస్తే… అది సంపదకు సూచిక. అందుకే దానిని శుభప్రదంగా పరిగణిస్తారు. కానీ, ఇంటి చుట్టుప్రక్కల ఎక్కడైనా పిల్లి ఏడుపు వినిపిస్తే… అది విపత్తుకి కారణం. అలాకాక, ముఖ్యమైన పనికోసం బయటికి వెళుతున్నప్పుడు పిల్లి కనిపిస్తే… ఆ పనిలో ఆటంకం ఎదురవుతుంది. 
  • హిందువులు గోవుని చాలా పవిత్రమైన జంతువుగా భావిస్తారు. అలాంటి గోమాత దూడకి పాలిస్తూ కనపడితే… మీరు తలపెట్టిన పని విజయవంతం అవుతుందని అర్ధం.
  • కాకి  ఇంటిపై  కూర్చుని అదేపనిగా అరుస్తూ ఉంటే… అతిథి వస్తారని సంకేతం. అదే కాకి మీ తలపై కానీ, లేదా మీ భుజంపై కానీ తన్నితే… ధన నష్టం, లేదా వ్యాధికి సంకేతం.  
  • ఏదైనా పని మీద బయటకు వెళ్ళినప్పుడు బురదలో పొర్లిన పంది కనిపిస్తే… అది శుభ సూచకం కానీ, దాని బురద ఎండిపోయి ఉంటే… అది అశుభ సంకేతం.
  • ఇంటి నుంచి బయలుదేరేటప్పుడు గాడిద శబ్దం వినిపిస్తే…అది అశుభం. అదే గాడిద కనిపిస్తే… పనిలో ఆటంకం.

తెలుసుకున్నారు కదా! ఈ శకునాల ఆధారంగానే మన పెద్దలు శుభాశుభాలు అంచనా వేసేవాళ్ళు.

Capricorn Horoscope September 2025 predictions for career, love, finance, and health
మకరరాశి వారికి సెప్టెంబర్ నెలలో ఏమి జరగబోతుంది?

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top