కోతి చేష్టలు అంటుంటాం కానీ, నిజానికి కోతులు చేసే పనులు చాలా బాగుంటాయి. అవి కేవలం అల్లరి చేయటంలోనే కాదు, ఆలోచించే విధానంలోనూ మనిషిని పోలి ఉంటుంది. ఎంతైనా మనమంతా ఆ కోతినుండీ పరిణామం చెందినవాళ్ళమే కదా!
ఇప్పుడు ఇందంతా ఎందుకు చెప్తున్నానంటే… సోషల్ మీడియా పుణ్యామా అని ఇటీవలికాలంలో యానిమల్ వీడియోలు తెగ వైరల్ అవుతున్నాయి. అందులో భాగంగానే ఈ కోతికి సంబంధించిన వీడియో కూడా వైరల్ అయింది.
ఇంతకీ ఈ వీడియోలోని కోతి ఏం చేసిందో తెలుసా..! ఎక్కడో… ఏమిటో… తెలియదు కానీ, ఒక అడవిలో కోతికి అందుబాటులో కొన్ని పండ్లు పెట్టారు. అయితే, అది మాములుగా కాదు, ఒక ఫజిల్ టైప్ లో ఉన్న ఉడెన్ బోర్డ్ లో ఉంచారు. కోతికి ఆకలి వేసి, ఆ పండ్లు తీసుకోవాలనిపిస్తే, అది ఆ ఫజిల్ బ్రేక్ చేయాల్సి ఉంటుంది.
కోతి మాత్రం తక్కువదేం కాదు, ఒక్కసారిగా దాని బుర్రకి పదును పెట్టింది. ఊహించని విధంగా ఆ ఫజిల్‌ని క్లియర్ చేసింది. ఆ పండ్లని దక్కించుకుంది. దాని ఆకలి తీర్చుకుంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు అంతా ఇలాంటి కోతి నెవర్ బిఫోర్, ఎవర్ ఆఫ్టర్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ఈ వీడియోపై మీరు కూడా ఓ లుక్కేయండి.
View this post on Instagram