Is it Good to Keep Conch Shell at Home?

శంఖం ఉండే ఇంట్లో… లక్ష్మీదేవి కొలువై ఉంటుందని అంటారెందుకు..?

హైందవ సాంప్రదాయంలో శంఖానికి ఓ ప్రత్యేక స్థానముంది. ఎందుకంటే, శంఖం ఇంట్లో ఉంటే… లక్ష్మీదేవి ఇంట్లో ఉన్నట్లే అని భావిస్తారు. అందుకే, శంఖాన్ని చాలా పవిత్రంగా చూస్తారు. చాలామంది ఇళ్లలో వారి పూజా మందిరాలలో శంకాన్ని పెట్టుకొని పూజిస్తుంటారు. మరి అలా పూజించటం వల్ల ఏయే ఫలితాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. 

నిజానికి తీర్థయాత్రలు చేయటం ద్వారా లభించే పుణ్యం శంఖాన్నిఇంట్లో ఉంచుకోవడం ద్వారా లభిస్తుందని ప్రజల విశ్వాసం. అందుకే శంఖం విలువ తెలిసినవాళ్ళు తమ ఇంట్లో దేవతా మూర్తుల చిత్ర పటాలతో పాటు, శంఖాన్ని కూడా ఉంచి పూజిస్తుంటారు. 

శంఖాన్ని పూజించటం వల్ల పాపాలు తొలగిపోయి… దీర్ఘాయువు కలుగుతుంది. అంతేకాదు, శత్రువులపై విజయాన్ని అందించేదిగా కూడా ఇది తోడ్పడుతుంది. 

శంఖం ఉంచిన ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉంటుందని నమ్ముతారు. అందుకే, శంఖాన్ని లక్ష్మీ దేవి విగ్రహానికి దగ్గరగా ఉంచడం వల్ల ఇంట్లో సంతోషం, శ్రేయస్సు, వైభవం వంటివి కలుగుతాయి.  

శంఖాన్ని ఇంటికి ఈశాన్య దిశలో ఉంచడం వల్ల విజయం లభిస్తుంది. అలాగే, బలహీనమైన దిశలో శంఖాన్ని ఉంచడం వల్ల విజయం, కీర్తి, పురోగతి వంటివి లభిస్తాయి.

పూజానంతరం శంఖంలోని నీటిని ఇంట్లో చల్లటం ద్వారా నెగెటివ్ ఎనర్జీ తొలగిపోయి… పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. అంతేకాక, మన చుట్టూ ఉండే వాతావరణం కూడా ఫ్రెష్ గా మారుతుంది.

శంఖంలో పోసిన నీరు ఎప్పటికీ చెడిపోడు. ఎందుకంటే, శంఖంలో కాల్షియం, ఫాస్పరస్, సల్ఫర్ గుణాలు ఉన్నాయి. అందుకే, దీనిలో ఉంచిన నీటిని తాగడం వల్ల ఎముకలు దృఢంగా మారతాయి. దంతాలు ఆరోగ్యంగా ఉంటాయి.

రోజూ శంఖం ఊదటం వల్ల ఆరోగ్యానికి మేలు జరుగుతుంది. ముఖ్యంగా ఊపిరితిత్తులు దృఢంగా మారతాయి. శ్వాస ఇబ్బందులు తొలగిపోతాయి. 

ఇవిమాత్రమేకాక, శంఖం ఇంట్లో ఉంటే,  ప్రేతాత్మలు వంటి దుష్టశక్తులు దరిచేరవు. 

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top