‘పుష్ప’ సినిమా రిలీజై నెలలు గడుస్తున్నా ఇంకా ‘పుష్ప’ మేనియా తగ్గనే లేదు. ఇక ఈ సినిమాలో పాటలన్నీ ఓ రేంజ్ లో హిట్టయ్యాయి. సమంత స్పెషల్ సాంగ్ ‘ఊ అంటావా మామా… ఉ ఊ అంటావా మామా… సాంగ్ అయితే యావత్ దేశాన్నీ ఒక ఊపు ఊపేసింది.
ఎక్కడ చూసినా… ఎవరినోట విన్నా… ఈ పాటే! సెలెబ్రిటీల నుంచీ, కామన్ పీపుల్ వరకూ ఈ పాటని ఇమిటేట్ చేస్తూ వీడియోలు చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు కూడా. అయితే, రీసెంట్ గా కాలిఫోర్నియాలో కూడా ఈ సాంగ్ మేనియా కనిపించింది.
తాజాగా యూఎస్‌లో కరోలినా ప్రోట్సెంకో అనే ఓ 13ఏళ్ల చిన్నారి ఊ అంటావా మామా… ఊహు అంటావా మామా… సాంగ్ కి వయోలిన్ వాయిస్తూ, కాలిఫోర్నియా వీధుల్లో సందడి చేసింది.
కరోలినా ఉక్రేనియన్ కి చెందిన అమ్మాయి. చిన్నతనంలోనే ఈమె ఫ్యామిలీ యునైటెడ్ స్టేట్స్‌కు మైగ్రేట్ అయింది. అప్పుడు ఈ చిన్నారి వయస్సు కేవలం ఆరు సంవత్సరాలే! కానీ, మ్యూజిక్ పై ఇంట్రెస్ట్ తో మ్యూజిక్ లెసన్స్ నేర్చుకోవటం మొదలుపెట్టింది. అలా అలా వయోలిన్ ప్లేయర్ గా మారింది. ఆ తర్వాత తన అద్భుతమైన పెర్ఫార్మెన్స్ తో సోషల్ మీడియాని షేక్ చేసింది.
నిజానికి కరోలినా ఓ ఫేమస్ యూట్యూబర్. తనకి యూట్యూబ్ లో 7 మిలియన్లకు పైగా సబ్‌స్క్రైబర్స్ ఉన్నారు. తన వీడియోలన్నీ మిలియన్ల కొద్దీ వ్యూస్ కలిగి ఉన్నాయి. ఇక కొన్ని రోజుల క్రితం ఊ అంటావా… సాంగ్ ని యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేయబడింది. అదిరిపోయే వ్యూస్ ని సొంతం చేసుకుంది.
అయితే, ఈ సాంగ్ ఇండియన్ సాంగ్ అని తెలియకపోయినా… కరోలినా అమేజింగ్ పెర్ఫార్మెన్స్ చూసి… ఆగి వినకుండా ఉండలేకపోయారు అమెరికన్లు.