Keeping these things at Home to Avoid Financial Crisis

ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవాలంటే… ఈ ఫోటోలను మీ ఇంట్లో పెట్టుకుంటే చాలు… ఇక వద్దంటే డబ్బు..!

వాస్తు శాస్త్రంలో ఇంటికి సంబంధించి అనేక రకాల టిప్స్ ఉన్నాయి.  ముఖ్యంగా ఇల్లు ఏ దశలో ఉండాలి? ఇంట్లో ఏ వస్తువు ఏ దిక్కుకి ఉండాలి? అనేది తెలుసుకుంటే… ఆ ఇల్లు పాజిటివ్ ఎనర్జీని అందిస్తుందా? నెగెటివ్ ఎనర్జీని అందిస్తుందా? అనేది తెలుసుకోవచ్చు. పాజిటివ్ ఎనర్జీ జీవితంలో ఆనందాన్ని అందిస్తే… నెగెటివ్ ఎనర్జీ   సమస్యలను సృష్టిస్తుంది.  

ఇంట్లో వాస్తు దోషాలు ఏవైనా ఉంటే… జీవితంలో అనేక కష్టనష్టాలు, ఆర్ధిక ఒడిదుడుకులు, మానసిక సమస్యలు ఏర్పడతాయి. అలాంటి సందర్భంలో కొన్ని వాస్తు టిప్స్ పాటించినట్లైతే… సమస్యలు తొలగి ఆనందం, ఐశ్యర్యం సిద్ధిస్తాయి. మరి ఆ టిప్స్ ఏవో మీరూ తెలుసుకోండి.

Aquarius September 2025 horoscope with career, love, health, and astrology predictions
కుంభ రాశి వారికి సెప్టెంబర్ నెలలో ఏమి జరగబోతుంది?
  • ఎంత ప్రయత్నించినా… మీ జీవితంలో ఆర్థిక ఇబ్బందులు తొలగకపోతే, మీ ఇంట్లో లక్ష్మీదేవి, కుబేరుడి ఫోటోలని ఉంచండి. అదికూడా ఇంటికి ఉత్తర దిశలో మాత్రమే పెట్టండి.
  • ఎప్పుడైతే ఇల్లు శుభ్రంగా, అందంగా ఉంటుందో… అప్పుడు ఐశ్యర్యం కూడా పెరుగుతుంది. అందుకే, మీ ఇంటి గోడలపై ప్రకృతికి సంబంధించిన అందమైన చిత్రపటాలని పెట్టండి. అవికూడా తూర్పు, దక్షిణ దిశల గోడలపై మాత్రమే ఉంచండి.
  • వీలైతే ఇంట్లో చిరునవ్వు చిందిస్తున్న చిన్న పిల్లలు ఫోటోలు ఉండేలా చూడండి. దీనివల్ల మీకు తెలియకుండానే పాజిటివ్ ఎనర్జీ ఏర్పడుతుంది. అయితే, ఈ ఫోటోలని తూర్పు, ఉత్తర దిశలలో మాత్రమే ఉంచటం శ్రేయస్కరం.
  • అలాగే నదులు, జలపాతాలతో కూడిన చిత్రపటాలని ఉంచడం ద్వారా కూడా పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది. 

సో, విన్నారు కదా! పైన తెలిపిన ఫోటోలలో వేటినైనా సరే తెచ్చి మీ ఇంట్లో ఉంచిన ఎడల ఎలాంటి ఆర్ధిక ఇబ్బందులైనా తొలగిపోయి… వద్దంటే డబ్బు వచ్చి పడుతుంది. వీటన్నిటికంటే ముఖ్యంగా కుటుంబ సభ్యులందరూ కలిసి కట్టుగా, ప్రేమాభిమానాలతో మెలగాలన్న విషయం మర్చిపోకండి. అప్పుడే ఆ ఇంట్లో ఐశ్వర్య లక్ష్మి తాండవిస్తుంది. 

SPY Telugu Teaser
SPY Telugu Movie Teaser | Nikhil Siddharth

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top