Liger Movie Third Romantic Song Promo Released

“లైగర్” మూవీ నుండీ మరో రొమాంటిక్ సాంగ్ ప్రోమో రిలీజ్

డైనమిక్ డైరెక్టర్ పూరీజగనాథ్ డైరెక్షన్ లో… క్రేజీ హీరో విజయ్ దేవరకొండ, బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే కలిసి నటిస్తున్న చిత్రం “లైగర్”. ఈ మూవీ ప్రమోషన్స్ జెట్ స్పీడ్ తో జరుగుతున్నాయి. ఈ చిత్రంతో అటు విజయ్ బాలీవుడ్ కు, ఇటు అనన్య టాలీవుడ్ కు పరిచయం అవుతున్నారు. 

ఇప్పటికే రిలీజైన సాంగ్స్, పోస్టర్స్, టీజర్, ట్రైలర్ మూవీపై అంచనాలను భారీగా పెంచేశాయి. విడుదలైన రెండు పాటలు యూట్యూబ్ ను షేక్ చేస్తున్నాయి. ఈ నేపధ్యంలో తాజాగా మూడో సాంగ్ ని కూడా రిలీజ్ చేయనున్నారు. అందుకు సంబందించిన ప్రోమో ఒకటి విడుదల చేసింది చిత్ర బృందం. 

ఈ ప్రోమోలో విజయ్ ఇంటికి వచ్చిన అనన్య… అతడి అమ్మకు కనిపించకుండా… అతడితో రొమాన్స్ చేయటానికి సిద్ధపడుతున్నట్లు చూపించారు. ఈ ప్రోమో చూస్తుంటే ఈ ఈ సాంగ్ ఫుల్ రొమాంటిక్ గా ఉండనుందని తెలుస్తోంది. ఆగస్టు 25న ఈ మూవీని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు. 

Meesala Pilla Telugu song full lyrics image
మీసాల పిల్ల ఫుల్ లిరికల్ సాంగ్

ఈ మూవీలో లెజెండ్రీ బాక్సర్ మైక్ టైసన్ ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. అలాగే సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ మరో ముఖ్యమైన రోల్ చేయనున్నారు. 

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top