జ్యూయలరీ షాపులో భారీ చోరీ (వీడియో)

ఇటీవలికాలంలో దోపిడీ దొంగలు తెగ హల్చల్ చేస్తున్నారు. చోరీలకి పాల్పడటం, కత్తులు, తుపాకీలతో బెదిరించటం కూడా ఫ్యాషన్ అయి పోయింది. సరిగ్గా ఇలాంటి సంఘటనే న్యూజెర్సీలోని ఓ నగల దుకాణంలో జరిగింది.

వివరాల్లోకి వెళితే, న్యూజెర్సీలో ఇండియన్స్ కి చెందిన  ఓ జ్యూయలరీ షాప్ ఉంది. ఆ షాప్ లోకి 8 మంది దొంగల ముఠా ఒకరి తర్వాత ఒకరు లోపలికి వచ్చారు. వస్తూనే అక్కడ పనిచేస్తున్న వారందరినీ తుపాకీలతో బెదిరించారు. 

అది చూసి భయపడి యజమానితో పాటు, వర్కర్లు కూడా సైలెంట్ గా సైడ్ అయిపోయారు. దీంతో ఆ గ్యాంగ్ షాపులో ఉన్న నగలని అందిన కాడికి ఒకరి తర్వాత ఒకరు దోచుకెళ్లిపోతారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు ఆ షాపులో ఉన్న సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. ఈ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.   

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top