శత్రువుల గుండెల్లో భయాన్ని కలిగించే ఎలైట్ ఫోర్సెస్ ద్వారా ఇండియన్ మిలిటరీ ఫోర్స్ ఒక స్ట్రాంగ్ వెపన్ గా మారింది. నార్త్ సైడ్ మంచుతో కప్పబడిన హిమాలయాల నుండి సౌత్ సైడ్ ఉన్న ట్రాపికల్ ఫారెస్ట్స్ వరకూ ఈ మోస్ట్ డేంజరస్ ఫోర్సెస్ ఎంతో యాక్యురసీ అండ్ సీక్రెసీతో వర్క్ చేస్తూ ఉంటాయి. హై-రిస్క్ మిషన్స్ కోసం వీళ్ళంతా స్పెషల్ గా ట్రైన్డ్ చేయబడి ఉంటారు. దేశరక్షణ విషయంలో ఎంతో కమిట్మెంట్ తో ఉంటారు. అందుకే వీరిని ‘Army’s true powerhouses’ అని కూడా అంటారు. ఈ ఆర్టికల్ లో మనం ఇండియా యొక్క మోస్ట్ డేంజరస్ ఫోర్సెస్ అయిన పారా కమాండోస్, మార్కోస్, గరుడ్ కమాండో ఫోర్స్, NSG మరియు SFF గురించి తెలుసుకుందాం. అలానే వారి యొక్క డేరింగ్ యాక్టివిటీస్ అండ్ అడ్వాన్స్డ్ టాక్టిక్స్ వెనుక ఉన్న మిస్టరీస్ గురించి కూడా తెలుసుకుందాం.
స్పెషల్ ఫోర్సెస్ అంటే ఏమిటి?
ఈ ఎలైట్ స్పెషల్ ఫోర్సెస్ ని ఫుల్లీ ట్రైన్డ్ మిలిటరీ ఎస్సెట్స్ గా భావిస్తారు. స్ట్రాటజిక్ అవుట్ కమ్స్ ని అందించటమే వీళ్ళ లక్ష్యం. టెర్రరిస్ట్ థ్రెట్స్ కి వెంటనే రియాక్ట్ అయి మిషన్ కంప్లీట్ చేసే విధంగా వీళ్ళని ప్రిపేర్ చేస్తారు. ఛాలెంజెస్ ఫేస్ చేయటానికి ఎప్పటికప్పుడు సైకలాజికల్ గా ఇంప్రూవ్ అవుతారు. అంతేకాదు, లక్ష్యాన్ని సాధించటం కోసం సైబర్ క్యాపబులిటీస్,ఆర్టిఫిషల్ ఇంటలిజన్స్, ఏరియల్ వెహికల్స్ వంటి అడ్వాన్స్డ్ టెక్నాలజీని కూడా ఉపయోగిస్తారు.
జాతీయ భద్రత కోసం సైనిక బలం యొక్క ప్రాముఖ్యత
ప్రతీ దేశానికీ ఉన్నట్లే మన దేశానికి కూడా ఓ స్ట్రాంగ్ డిఫెన్స్ ఫోర్స్ ఉంది. అది ఆర్మీ, నేవీ, అండ్ ఎయిర్‌ఫోర్స్ అని 3 టైప్స్ లో డివైడ్ అయి ఉంది. అయితే ఈ డిఫెన్స్ ఫోర్సెస్ మూడూ కూడా కొన్ని అవసరాల కోసం… మళ్ళీ స్పెషల్ కమాండో ఫోర్సెస్‌ని ప్రత్యేకంగా ఏర్పాటు చేశాయి. ఈ కమాండర్లు అటు సోల్జర్స్ కాదు, ఇటు పోలీసులు అంతకంటే కాదు, డిఫెన్స్ ఫోర్స్ లో వివిధ రంగాల్లో ఆరితేరిన వారిని స్పెషల్ గా సెలెక్ట్ చేసి, ట్రైనింగ్ ఇస్తారు.
వీళ్ళ దగ్గర అడ్వాన్స్‌డ్ వెపన్స్ ఉంటాయి. రెస్క్యూ ఆపరేషన్స్ ఎలా సక్సెస్ చేయాలో వీరికి బాగా తెలుసు. సిట్యుయేషన్ డిఫికల్ట్ గా మారినప్పుడు వీరిని రంగంలోకి దించుతారు. నేషనల్ సెక్యూరిటీ, యాంటీ టెర్రరిస్ట్ ఆపరేషన్స్‌లో ఇలాంటి ఫోర్సెస్ కీ రోల్ ప్లే చేస్తాయి. ఇండియాలో ఇలాంటి డేంజరస్ కమాండో ఫోర్సెస్ కొన్ని ఉన్నాయి. వాటి ప్రత్యేకతలేంటో ఇప్పుడు చూద్దాం
మోస్ట్ డేంజరస్ మిలిటరీ ఫోర్సెస్ టైప్స్
ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ లో వర్క్ చేసే స్పెషల్ ఫోర్స్ యూనిట్స్… కౌంటర్-టెర్రరిజం, సర్వైలెన్స్, అండ్ కోవర్ట్ మిషన్స్ వంటి హై-రిస్క్ ఆపరేషన్స్ కోసం వర్క్ చేస్తాయి.
అయితే ఆ మోస్ట్ డేంజరస్ మిలిటరీ ఫోర్స్ ని 3 టైప్స్ గా డివైడ్ చేశారు. అవి: ఇండియన్ ఆర్మీ యొక్క పారా కమాండోస్, ఇండియన్ నేవీ యొక్క మార్కోస్, మరియు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ యొక్క గరుడ్ కమాండో ఫోర్స్. ఇవి కాక మరో 2 స్పెషల్ ఫోర్సెస్ కూడా ఉన్నాయి. అవి మిలిటరీచే కంట్రోల్ చేయబడవు. కానీ పౌర సంస్థల క్రింద పనిచేస్తాయి. అవి మినిస్టరీ అఫ్ హోమ్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో పనిచేసే నేషనల్ సెక్యూరిటీ గార్డ్ – NSG మరియు ఇండియా యొక్క ఎక్స్టర్నల్ ఇంటలిజెన్స్ ఏజెన్సీ అయిన రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ – RAW అనబడే స్పెషల్ గ్రూప్. RAW అండర్ కంట్రోల్ లో మళ్ళీ సపరేట్ స్పెషల్ ఫోర్సెస్ ని కలిగి ఉంది, అవి: స్పెషల్ ఫోర్స్ – SF మరియు స్పెషల్ ఫ్రాంచైర్ ఫోర్స్ – SFF. ముందుగా…
ఇది కూడా చదవండి: Top 15 Most Dangerous Places on Earth
పారా కమాండోలు
పారాచూట్ రెజిమెంట్ ని పారా కమాండోస్ అంటారు. ఇది ఇండియన్ ఆర్మీకి చెందిన ప్రత్యేక విభాగం. ఈ కమాండో ఫోర్స్‌ని 1952లో ఏర్పాటు చేశారు.
ఇది ఎక్కువగా ఏరియల్ ఆపరేషన్స్ పై ఫోకస్ చేస్తుంది. ఈ కమాండోలు ఎక్స్ట్రా ఆర్డినరీ కరేజ్, ఫిజికల్ స్టామినా, టాక్టికల్ స్కిల్ కలిగి ఉండి చాలా క్విక్ గా ఆపరేషన్ నిర్వహించగలరు. అందుకే పారా కమాండోలకు పారాచూటింగ్, కంబాట్ టాక్టిక్స్, సర్వైవల్ టెక్నిక్స్‌పై ట్రైనింగ్ ఇస్తారు.
పారా కమాండోస్ ట్రైనింగ్ విషయానికొస్తే… ఏరియల్ ఆపరేషన్స్, పారాచూట్ జంప్స్,హెలికాప్టర్ ఎటాక్స్ వంటి విషయాల్లో నైపుణ్యం సాధించటం; కౌంటర్ – టెర్రరిజం, గెరిల్లా యుద్ధంలో శిక్షణ పొందటం; అడ్వాన్స్డ్ వెపన్స్ యూజ్ చేయటం; కోవర్ట్ ఆపరేషన్స్ నిర్వహించటం వంటి విషయాల్లో ఫుల్ ట్రైన్డ్ అవుతారు.
ఈ ఇండియన్ ఆర్మీ యూనిట్ల వాలంటీర్లు కఠినమైన సెలక్షన్ ట్రయల్స్‌కు గురవుతుంటారు. ఖచ్చితంగా వీరికి 90-డేస్ అబ్జర్వేషన్ పీరియడ్ ఉంటుంది. ట్రైనింగ్ పీరియడ్ లో అడ్వాన్స్డ్ పారాచూటింగ్, కంబాట్ టాక్టిక్స్, సర్వైవల్ స్కిల్స్ వంటివి ఉంటాయి.
ఇప్పటివరకూ పారా కమాండోస్ 1984లో సియాచిన్ గ్లేసియర్ ప్రాంతంలో నిర్వహంచిన ఆపరేషన్ మేఘదూత్, 1987లో శ్రీలంక ప్రాంతంలో జరిపిన ఆపరేషన్ పవన్, 1990లో కాశ్మీర్ దగ్గర చేపట్టిన ఆపరేషన్ రక్షక్, జమ్మూ కాశ్మీర్‌లో జరిపిన కౌంటర్ – టెర్రరిజం ఆపరేషన్స్ వంటి ముఖ్యమైన మిషన్స్ చేపట్టారు.
Sky-bound heroes అని చెప్పబడే ఈ పారా కమాండోస్ కరేజ్, అండ్ శాక్రిఫైజ్ అనే ఇన్స్పిరేషన్ కలిగి ఉంటారు. అందుకే వారిని వన్ అఫ్ ది ఇండియాస్ మోస్ట్ ఫియర్డ్ అండ్ రెస్పెక్టెడ్ స్పెషల్ ఫోర్స్ గా చెప్తారు. వీరి కార్యాచరణ విజయం మరియు పోరాటంలో శౌర్యం వారికి అనేక శౌర్య పురస్కారాలు మరియు ప్రశంసలను సంపాదించిపెట్టాయి. ఒక్కమాటలో చెప్పాలంటే, “Men apart, every man a hero” అనే మోటోని వీళ్ళు ఫాలో అవుతుంటారు.
మార్కోస్
మెరైన్ కమాండోస్ ని మార్కోస్ అంటారు. ఇది ఇండియన్ నేవీకి చెందిన స్పెషల్ ఆపరేషన్స్ యూనిట్. ఈ కమాండో ఫోర్స్‌ని 1987లో ఏర్పాటు చేశారు.