Air Disasters, Worst Plane Crashes

Top 10 Worst Air Disasters in History

మనిషి తన జీవిత కాలంలో చేసే జర్నీస్ అన్నిటిలో ఫ్లైట్ జర్నీని మించింది మరొకటి లేదు అనుకొంటాడు. అందుకే, ఈ మోడ్రెన్ వరల్డ్ లో ఇదో పార్ట్ గా మారింది. ఈ బిజీ లైఫ్ స్టైల్ లో లాంగ్ డెస్టినేషన్స్ ని కుడా కేవలం కొద్ది గంటల్లోనే రీచ్ అవ్వొచ్చు. ఈ కారణంగానే ఎక్కువమంది దీనినే ప్రిఫర్ చేస్తున్నారు. అయితే ఫ్లైట్ జర్నీ ఎంతో సేఫెస్ట్ జర్నీ అయినప్పటికీ, ఒక్కోసారి ఇవి కుడా ప్రమాదాలకి గురవుతుంటాయి. అలాంటి వాటిలో వరల్డ్స్ మోస్ట్ వరస్ట్ ఏవియేషన్ డిజాస్టర్స్ గురించి ఈ రోజు ఈ ఆర్టికల్ లో క్లియర్ గా తెలుసుకుందాం, 

హిండెన్‌బర్గ్ డిజాస్టర్ (1937)

హిండెన్‌బర్గ్ ఎయిర్‌షిప్ లగ్జరీ అండ్ ఇన్నోవేషన్స్ కి ఐకాన్ గా ఉండేది. ఇది మే 6, 1937లో, న్యూజెర్సీలో ల్యాండ్ అవటానికి ట్రై చేసినప్పుడు ఘోర వైఫల్యాన్ని ఎదుర్కొంది.  తుఫాను కారణంగా ఆ రోజు మధ్యాహ్నం నుండీ విపరీతమైన గాలులు వీస్తున్నాయి. సాదారణంగా ఈ ఎయిర్ క్రాఫ్ట్స్ గాలికంటే తేలికగా ఉండటంతో ఆ ప్రదేశంలో గాలులు మరింత  ప్రమాదకరంగా మారతాయి. దీంతో ఎమెర్జెన్సి ల్యాండింగ్ ని ఎనౌన్స్ చేసింది ఎయిర్ స్టేషన్. 

సాయంత్రం సరిగ్గా 7 గంటల :25 నిముషాలకి తుఫాను కారణంగా  లేక్‌హర్స్ట్ నేవల్ స్టేషన్ ని రీచ్ అయి… ల్యాండ్ అవుతుండగా… హిండెన్‌బర్గ్ టెయిల్ ఫిన్‌ లో ఫ్లేమ్ రావటం గమనించారు సిబ్బంది. క్షణాల్లోనే, ఆ మంటలు టెయిల్ భాగాన్ని పూర్తిగా చుట్టుముట్టి వేగంగా ముందుకు వ్యాపించాయి. హిండెన్‌బర్గ్ యొక్క టెయిల్ పార్ట్ భూమిని తాకకముందే మిడ్-సెక్షన్ కి మంటలు అందుకున్నాయి. తర్వాత కేవలం 34 సెకన్లలోనే ఈ ఎయిర్‌షిప్ పూర్తిగా మంటల్లో కాలిపోయింది. ఈ ప్రమాదంలో 36 మంది ప్రాణాలు కోల్పోయారు. 

ఈ డిజాస్టర్ ఏవియేషన్ సెక్టార్ లోనే సిగ్నిఫికెంట్ చేంజ్ ని తీసుకువచ్చింది. ఎందుకంటే, ఇది ప్యాసింజర్స్ సేఫ్ గా ఉండేలా డిజైన్ చేయబడలేదు. ముఖ్యంగా ఇది అత్యంత వేగంగా మండే హైడ్రోజన్ గ్యాస్ తో ఫిల్ చేయబడి ఉంది. అందుకే, హిండెన్‌బర్గ్ వంటి ఎయిర్‌షిప్‌లను ఉపయోగించడం మానేశారు.  ఆ తర్వాత తక్కువగా మండే హీలియంని ఉపయోగించి విమానాలని తయారు చేయడం ప్రారంభించారు. అయితే, హైడ్రోజన్ గ్యాస్ లీక్ వల్లనే మంటలు వ్యాపించాయని అందరూ భావించినప్పటికీ, విపత్తుకు కారణం ఇప్పటికీ వివాదాస్పదంగానే ఉంది.

జపాన్ ఎయిర్‌లైన్స్ ఫ్లైట్ 123 క్రాష్ (1985)

జపాన్ ఎయిర్‌లైన్స్ ఫ్లైట్ క్రాష్ ని ‘మౌంట్ ఒసుటాకా ఎయిర్‌లైన్ డిజాస్టర్’ అని కూడా అంటారు. జపాన్ ఎయిర్‌లైన్స్ ఫ్లైట్ 123 అనేది జపనీస్ డొమెస్టిక్ ఎయిర్‌లైన్స్. ఇది టోక్యో యొక్క హనెడా ఎయిర్ పోర్ట్ నుండి జపాన్‌లోని ఒసాకా ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ కి ట్రావెల్ చేయడానికి షెడ్యూల్ చేయబడిన పాసింజర్స్ ప్లేన్. 

ఈ ఫ్లైట్ ఆగష్టు 12, 1985న, టోక్యో నగరం నుండీ బయలుదేరి 24,000 అడుగుల ఎత్తుకు చేరుకుంది. అంతలో డీకంప్రెషన్‌కి గురైంది. తర్వాత 32 నిమిషాల తర్వాత, పర్వతాలపై కూలిపోయింది. ఈ ప్రమాదంలో 505 మంది ప్రయాణికులు, 15 మంది సిబ్బంది మరణించారు.  ఈ ప్రమాదానికి కారణం కొన్నేళ్ళ క్రితం రిపేర్ చేసిన వెనుక ప్రెజర్ బల్క్‌హెడ్ పగిలటమే!

దీనిని గమనించిన పైలట్… కంటిన్యూగా సిగ్నెల్స్ ని పంపుతూనే ఉన్నాడు. టోక్యో ఎయిర్ పోర్ట్ కి రూట్ డైవర్ట్ చేయమని కోరాడు. కానీ, అంతలోనే మౌంట్ ఒసుటాకా సమీపంలోని మౌంట్ తకమగహారాలో కూలిపోయింది. అందుకే ఈ విపత్తుకు ఆ పేరు వచ్చింది.

పాన్ యామ్ ఫ్లైట్ 103 (1988)

పాన్ యామ్ ఫ్లైట్ 103 ఎక్స్ ప్లోడ్ అనేది ఏవియేషన్ హిస్టరీలోనే మోస్ట్ ట్రాజిక్ ఇన్సిడెంట్. డిసెంబరు 21, 1988న, ఎప్పటిలానే పాన్ యామ్ ఫ్లైట్ 103, ఫ్రాంక్‌ఫర్ట్ నుండి డెట్రాయిట్ వెళ్లే రూట్ లో బయలుదేరింది. ఇది స్కాటిష్ టౌన్ లోని లాకర్‌బీ అనే ప్రాంతానికి చేరుకోగానే ఒక్కసారిగా ఎక్స్ ప్లోడ్ అయింది.  పొలిటికల్ రివేంజ్ కారణంగా టెర్రరిస్టులు ఇందులో బాంబు పెట్టటం జరిగింది. ఈ బాంబు దాడిలో 270 మంది ప్రాణాలు కోల్పోయారు. 

ప్రయాణికులు మరియు సిబ్బందికి తెలియకుండా ముందుగానే ఫ్లైట్ కార్గో హోల్డ్‌లో టైమ్ బాంబ్ సెట్ చేయటం జరిగింది. ఫ్లైట్ టేకాఫ్ అయిన తర్వాత కేవలం 38 నిమిషాలకే, బాంబ్ బ్లాస్ట్ అయింది. ఫలితంగా ఎన్నో జీవితాలను ఛిద్రం చేసింది. అందుకే దీనిని ‘లాకర్బీ బాంబింగ్’ ఇన్సిడెంట్ అని కూడా అంటారు. దీని ఇంపాక్ట్ భూమిపై మాత్రమే కాకుండా విమానయాన పరిశ్రమ అంతా పడింది. ఈ కారణంగా విమానయాన భద్రతలో విపరీతమైన మార్పుని  ప్రేరేపించింది.

ఇది కూడా చదవండి: Top 15 Most Dangerous Places on Earth

ఎయిర్ ఫ్రాన్స్ ఫ్లైట్ 447 (2009)

ఎయిర్ ఫ్రాన్స్ ఫ్లైట్ 447 డిజప్పియరెన్స్ అనేది ఏవియేషన్ హిస్టరీలోనే మోస్ట డిస్టర్బింగ్ మిస్టరీ. ఇది రియో డి జెనీరో నుండి పారిస్‌కు ఒక సాధారణ ప్రయాణంగా ప్రారంభమైనది. జూన్ 1, 2009న అట్లాంటిక్ ఓషన్ దగ్గరికి వచ్చేటప్పటికి వ్యానిష్ అయిపోయింది. ఇందులో ట్రావెల్ చేస్తున్న 228 మంది ప్యాసింజర్స్ కూడా  డిజప్పియర్ అయిపోయారు. 

నిజానికి ఈ ఫ్లైట్ డిజప్పియర్ అవటానికి అక్కడున్న ఎక్స్ ట్రీమ్ వెదర్ కండిషన్స్, టెక్నికల్ ఎర్రర్స్, మరియు హ్యూమన్ మిస్టేక్స్ వంటివి కారణాలు. దీని ఫలితంగా ఎయిర్‌క్రాఫ్ట్ సిస్టమ్స్ ఇంప్రూవ్ అయ్యాయి.  పైలట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కూడా ఇంప్రూవ్ అయ్యాయి. 

మలేషియా ఎయిర్‌లైన్స్ ఫ్లైట్ 370 (2014) 

మలేషియా ఎయిర్‌లైన్స్ ఫ్లైట్ 370 అని పిలువబడే బోయింగ్ 777 జెట్ మోస్ట్ మిస్టీరియస్ మిస్సింగ్ ప్లేన్స్ లో ఒకటి. ఇది మార్చి 8, 2014న, కౌలాలంపూర్ నుండి బీజింగ్‌కి బయలుదేరింది. అర్దరాత్రి దాటిన తర్వాత సౌత్ చైనా ఓషన్ పై నుండీ ట్రావెల్ చేస్తూ… నార్త్ ఈస్ట్ కి టర్న్ అయింది. ఇక ఆ తర్వాత నుండీ ఇప్పటివరకూ కనిపించలేదు. 

ఈ సంఘటన ఎయిర్‌క్రాఫ్ట్ ట్రాకింగ్ సిస్టమ్‌పై అనేక రకాల చర్చలకు దారితీసింది. ఎన్నో రకాలుగా ఎక్స్ ప్లోరేషన్ చేపట్టారు. కానీ ఫ్లైట్ ఆచూకీ మాత్రం ఎక్కడా లభించలేదు.  దీని ప్రభావంతో ఎయిర్‌క్రాఫ్ట్ పొజిషన్ రిపోర్టింగ్ మరియు రియల్ టైమ్ ట్రాకింగ్‌కు సంబంధించి రెగ్యులేటరీ చేంజెస్ కి దారితీసింది. 

చార్ఖీ దాద్రీ మిడ్-ఎయిర్ కొలిషన్ (1996)

చార్ఖీ దాద్రీ మిడ్-ఎయిర్ కొలిషన్ అనేది భారతీయ విమానయాన చరిత్రలో ఒక విషాద సంఘటన. దీని ఫలితంగా వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు.  నవంబర్ 12, 1996న, హర్యానా రాష్ట్రంలోని చార్కి దాద్రీ అనే టౌన్ ప్రాంతంలో ఆకాశంలో రెండు విమానాలు ఢీకొనటం జరిగింది. ఈ ఘటనలో సౌదీ అరేబియా ఎయిర్‌లైన్స్‌కి  చెందిన బోయింగ్ 747, కజకిస్థాన్ ఎయిర్‌లైన్స్ కి  చెందిన ఇల్యుషిన్ ఇల్-76 అనే 2 ఫ్లైట్స్ మద్య కొలిషన్ జరిగింది. ఈ ఇన్సిడెంట్ లో మొత్తం 349 మంది మరణించారు.

మిస్ కమ్యూనికేషన్ కారణంగా ఈ కొలిషన్ జరిగినట్లు తేలింది. ఈ సంఘటన ఎయిర్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ ని  ఇంప్రూవ్ చేయాల్సిన అవసరాన్ని మరియు పైలట్లు, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్‌ల మధ్య కమ్యూనికేషన్ యొక్క ఇంపార్టెన్స్ ని కూడా హైలైట్ చేసింది.

అమెరికన్ ఎయిర్‌లైన్స్ ఫ్లైట్ 191 క్రాష్ (1979)

అమెరికన్ ఎయిర్‌లైన్స్ ఫ్లైట్ 191 అనేది అమెరికన్ ఎయిర్‌లైన్స్ ద్వారా నిర్వహించబడే రెగ్యులర్ షెడ్యూల్డ్ ప్యాసింజర్ ఫ్లైట్. ఇది మే 25, 1979న టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ఓహేర్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ సమీపంలో కూలిపోయింది. ఈ ప్రమాదంలో 258 మంది ప్రయాణికులు మరియు 13 మంది సిబ్బంది మరణించారు. 

ఈ ఫ్లైట్ ఇల్లినాయిస్‌లోని చికాగో సిటీకి దగ్గర్లో ఉన్న ఓహేర్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ నుండీ ప్రారంభమై… కాలిఫోర్నియా హబ్ లోని లాస్ ఏంజిల్స్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ కి షెడ్యూల్డ్ చేయబడి ఉంది. అయితే ఫ్లైట్ టేకాఫ్ అయిన సమయంలో దాని  రెక్క నుండి ఇంజిన్  విడిపోయింది. ఈ కారణంగా రెక్క పైభాగంలో వెనుకకు దొర్లింది.  దీనివల్ల కంట్రోల్ తప్పి కూలిపోయింది. ఇది యునైటెడ్ స్టేట్స్‌లోనే మోస్ట్ వరస్ట్ ప్లేన్ క్రాష్  గా నిలిచిపోయింది. 

ఇది కూడా చదవండి: Unexplained Himalayan Natural Phenomena

ఎయిర్ ఇండియా ఫ్లైట్ 182 (1985)

ఎయిర్ ఇండియా ఫ్లైట్ 182 ని ఏవియేషన్ హిస్టరీలోనే వరస్ట్ టెర్రరిస్ట్ ఎటాక్ గా కన్సిడర్ చేశారు. ఇది ఇండియాలోని టొరంటో నుండి సహార్ ఇంటర్నేషనల్‌కు వెళుతూ…  ఐర్లాండ్ తీరంలో కూలిపోయింది. దీనికి కారణం కెనడియన్ సిక్కు టెర్రరిస్ట్ ఈ ప్లేన్ కార్గోలో బాంబు పెట్టినట్లు సమాచారం. 

జూన్ 23, 1985న, ఈ ఫ్లైట్ భూమికి 31,000 అడుగుల ఎత్తులో ఎగురుతున్నప్పుడు, బాంబ్ ఎటాక్ కి గురైంది. ఈ ఇన్సిడెంట్ ఐరిష్ ఎయిర్ స్పేస్ లో జరగడంతో ఫ్లైట్ అట్లాంటిక్ ఓషన్ లో క్రాష్ అయింది. ఈ డిస్ట్రక్షన్ ఫలితంగా 268 మంది కెనడియన్స్, 27 మంది బ్రిటిషర్స్, మరియు 24 మంది ఇండియన్స్ తో సహా 329 మంది ప్రాణాలు కోల్పోయారు. దేనిని మోస్ట్ డెడ్లియెస్ట్ ఏరియల్ బాంబింగ్ ఎటాక్ గా కన్సిడర్ చేశారు. అంతేకాదు, ఇది కెనడియన్ హిస్టరీలోనే లార్జెస్ట్ మాస్ మర్డర్ గా నిలిచింది. 

టర్కిష్ ఎయిర్‌లైన్స్ ఫ్లైట్ 981 (1974)

టర్కిష్ ఎయిర్‌లైన్స్ ఫ్లైట్ 981 వరల్డ్స్ డెడ్లియెస్ట్ సింగల్ ఎయిర్ క్రాఫ్ట్ ఏవియేషన్ యాక్సిడెంట్ గా రికగ్నైజ్ చేయబడింది. ఇది ఓవర్ లోడ్ కారణంగా ఫారెస్ట్ ఏరియాలో క్రాష్ అయింది. దీని ఫలితంగా విమానంలో ఉన్న మొత్తం 346 మంది వ్యక్తులకి వినాశకరమైన నష్టం ఏర్పడింది. 

మార్చి 3, 1974న, టర్కిష్ ఎయిర్‌లైన్స్ కి చెందిన TK 981 ఫ్లైట్ ఇస్తాంబుల్ నుండి లండన్ హీత్రూకు వెళ్లాల్సి ఉంది. అయితే ప్యారిస్ ఓర్లీ ఎయిర్ పోర్ట్ లో ఆగి ఉంది. ఆ సమయంలో బ్రిటిష్ యూరోపియన్ చేస్తున్న స్ట్రైక్  కారణంగా ఈ ఫ్లైట్ ఎకానమీ క్యాబిన్ నిండిపోయింది. ఇది టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ఎర్మెనోన్‌విల్లే ఫారెస్ట్ ఏరియా దగ్గరికి రాగానే దాని రియర్ కార్గో డోర్ ని లాస్ అయింది. తర్వాత ఫ్లైట్ కీలక భాగాలలో దాని యాక్సెస్ ని కోల్పోయింది. ఇక క్యాబిన్‌ లో ప్రెజర్ ఎక్కువ అవటంతో కంట్రోల్ తప్పిప్లేన్ క్రాష్ అయింది. 

ఎర్మెనోన్‌విల్లే ఫారెస్ట్‌ లో ప్లేన్ క్రాష్ అయింది కాబట్టి దీనిని ‘ఎర్మెనోన్‌విల్లే డిజాస్టర్’ అని కూడా అంటారు. అంతేకాదు, ఇది యూరప్ లో సంభవించిన సెకండ్ డెడ్లియస్ట్ ప్లేన్ క్రాష్.  

టెనెరిఫే ఎయిర్ పోర్ట్ డిజాస్టర్ (1977)

టెనెరిఫే ఎయిర్ పోర్ట్ డిజాస్టర్ ఏవియేషన్ హిస్టరీలోనే మోస్ట్ డెడ్లియస్ట్ యాక్సిడెంట్ గా నిలిచింది. ఇది గాలిలో ఎగిరేటప్పుడు కాకుండా నేలపై ఉన్నప్పుడు జరిగింది. మార్చి 27, 1997లో, ఒకే రన్‌వేపై పూర్తిగా లోడ్ చేయబడిన రెండు బోయింగ్ 747 ప్యాసింజర్ జెట్‌లు ఢీకొనటం వల్ల ఈ ప్రమాదం జరిగింది. అందుకే ఇది అత్యంత ఘోర విమాన ప్రమాదంగా చరిత్ర పుట్టల్లో నిలిచిపోయింది. 

లాస్ ఏంజిల్స్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ నుండి వచ్చిన పాన్ అమెరికన్ 1736, మరియు ఆమ్‌స్టర్‌డామ్ నుంచి వచ్చిన కేఎల్‌ఎం 4805 ఫ్లైట్స్ రెండూ కూడా స్పెయిన్‌లోని గ్రాన్ కెనరియా ఎయిర్ పోర్ట్ కి ట్రావెల్ చేయాల్సి ఉన్నాయి. ఈ క్రమంలో ఒక్కసారిగా టెనెరిఫే రన్‌వేపై ఢీకొనడంతో పెద్ద ఎత్తున పేలుడు సంభవించింది. 

పొగమంచు కారణంగా రెండు విమానాల పైలట్లకి రన్‌వే స్పష్టంగా కనిపించలేదు. కంట్రోల్ సెంటర్స్ మద్య మిస్ కమ్యూనికేషన్ కారణంగా కేఎల్‌ఎం బోయింగ్ టేకాఫ్ ప్రారంభించింది. అప్పటి వరకు పాన్ అమెరికన్ విమానం రన్‌వేపై అలాగే ఉండిపోయింది. 180 డిగ్రీస్ లో ఇది బ్యాక్ టర్న్ తీసుకొని వెనక్కి వెళ్లగానే రన్‌వేపైకి పాన్‌ అమెరికా విమానం వచ్చింది. దాన్ని తప్పించేసరికి పరిస్థితి చేయి దాటిపోవడంతో పాన్‌ అమెరికా విమానాన్ని ఢీకొని కుప్పకూలిపోయింది.

ఈ ప్రమాదంలో 583 మంది మరణించారు. 61 మంది ఇంజ్యూరీస్ తో బయటపడ్డారు. చరిత్రలోనే అత్యంత ఘోరమైన ప్రమాదంగా దీనిని  ఇప్పటికీ చెప్పుకుంటుంటారు. ఈ ప్రమాదం తర్వాత  ఎయిర్ పోర్ట్ ని క్లోజ్ చేసి ట్రాఫిక్ డైవర్ట్ చేశారు. 

చివరిమాట 

సాదారణంగా ఎయిర్ డిజాస్టర్స్ అనేవి చాలా రేర్ గానే జరుగుతూ ఉంటాయి. అయినప్పటికీ, ఊహించని ఈ పరిణామం ఒక్కోసారి ఇటు మానవులపైనా, అటు ఏవియేషన్ ఇండస్ట్రీ పైనా గ్రేట్ ఇంపాక్ట్ చూపుతుంది. ఫ్యూచర్ లో ఇలాంటి ఇంసిడెంట్స్ మళ్ళీ రిపీట్ కాకుండా ఉండాలంటే గవర్నమెంట్ తీసుకొనే సేఫ్టీ మేజర్స్ తో పాటు మనవైపు నుంచీ కూడా ఫుల్ సపోర్ట్ అందిద్దాం.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top