హిస్టరీ పేజీల్లో నుంచీ బయటపడిన మరో మిస్టరీ పూరీ జగన్నాధుని రత్న బండార్. ఇది పూరీ ఆలయంలో ఉన్న మిస్టీరియస్ రూమ్. విచిత్రం ఏమిటంటే, ఆధ్యాత్మికంగా ఎంతో ప్రాముఖ్యం ఉన్న జగన్నాథ ఆలయంలో అర్ధ శతాబ్ధిగా ఈ సీక్రెట్ రూమ్ కి సంబంధించి ఓ రహస్యం వెంటాడుతోంది. అది అంతు చిక్కని మిస్టరీగా మారి అందరినీ ఆందోళనకు గురి చేస్తోంది. అంతేకాదు, వందల ఏళ్లుగా భూస్థాపితమైన ఆ మిస్టరీని రివీల్ చేస్తే ప్రపంచమంతా సర్వనాశనం అయిపోతుందట. ఇంతకీ ఆ మిస్టరీ ఏంటి? ఆ సీక్రెట్ రూమ్ లో ఏముంది? అది ఓపెన్ చేస్తే ప్రపంచానికి వచ్చిన ముప్పు ఏమిటి? ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ గురించి ఈరోజు మనం తెలుసుకుందాం.
రత్న భండార్ అంటే ఏమిటి?
మన దేశంలోని అత్యంత ముఖ్యమైన ఆలయాల్లో ఒడిశాలోని పూరీ జగన్నాథ ఆలయం ఒకటి. 12వ శతాబ్ధంలో రాజా అనంత వర్మ చోడగంగదేవ్ హయాంలో ఈ ఆలయ నిర్మాణం మొదలైంది. ఆయన మనవడు అయినటువంటి అనంగ భీమ్ దేవ్ పాలనలో ఆలయంలో పూజలు మొదలయ్యాయి. శ్రీకృష్ణుడు, సుభద్ర, బలరాముడి చెక్క విగ్రహాలే ఈ ఆలయంలో ఉండే ప్రధాన దేవతలు. కృష్ణుని ఆరాధించేవారికి ఇది అత్యంత పవిత్రమైన క్షేత్రం.
ఈ క్షేత్రంలో పూజలందుకొనే కృష్ణుడిని జగన్నాథుడిగా పిలుస్తుంటారు. జగన్నాథుడు అంటే ఈ ప్రపంచానికి నాయకుడని అర్ధం. అలాంటి ఈ ఆలయానికి నార్త్ సైడ్ ఉన్న బేస్‌మెంట్‌లో రత్న భండార్ ఉంది. ఈ రత్న భండార్ లో ‘భితర్ భండార్’, ‘బాహర్ భండార్’ అనే రెండు గదులు ఉన్నాయి.
‘బాహర్ భండార్’ ని ‘అవుటర్ ట్రెజరీ’ అంటారు. ఉత్సవాలు, ఊరేగింపులు జరిగే సమయాల్లో దేవుడి విగ్రహాలని అలంకరించేందుకు అవసరమైన ఆభరణాల కోసం ఈ బాహర్ భండార్‌ను తరచూ తెరుస్తుంటారు.
‘భీతర్ భండార్’ ని ‘ఇన్నర్ ట్రెజరీ’ అంటారు. రాజులు పెద్దయెత్తున విరాళంగా ఇచ్చిన బంగారు ఆభరణాలు, కిరీటాలు, రత్నాలు, వజ్రవైడూర్యాలు ఇలా వెలకట్టలేనంత అపార సంపద ఇక్కడ ఉంది. వీటితోపాటు సాధారణ భక్తులు సమర్పించుకొనే బంగారు ఆభరణాలు, ఇతర కానుకలను కూడా ఈ భండార్‌లోనే భద్రపరుస్తూ వచ్చారు.
బాహర్ భండార్ ని ఎప్పుడూ తెరుస్తూనే ఉంటారు. కానీ, భీతర్ భండార్ ని తెరచి 40 ఏళ్లకుపైనే అవుతోంది. అత్యంత రహస్యమైనదీ, అంతులేని సంపదతో నిండి ఉన్నదీ శతాబ్దాలుగా తెరుచుకోని ఈ రెండో గదిలోనే అసలు మిస్టరీ అంతా ఉందని చరిత్ర చెబుతోంది.
చరిత్రని తిరగేసి చూస్తే, ఇప్పుడు మనం ఓడిస్సాగా చెప్పుకొంటున్న ప్రాంతాన్ని ఒకప్పుడు ఉత్కళ అని పిలిచేవారు. 12వ శతాబ్ధం నుండీ 18వ శతాబ్ధం వరకూ ఈ ఉత్కళని అనేకమంది రాజులు పాలించారు. వారంతా తమ సంపదని జగన్నాథుని సన్నిథిలో ఉన్న ఈ రత్న భాండాగారంలోనే దాచి ఉంచేవారు.
ఈ సీక్రెట్ రూమ్ తెరవాలంటే ఏం చేయాలి?
అప్పట్లో ఓ గదికి మూడు తాళాలు వేయడం అంటే ఎంత పకడ్బందీగా చేసుంటారో అర్ధం చేసుకోవచ్చు. రత్నభండార్ లోని ఇన్నర్ ట్రెజరీకి 3 డోర్స్ ఉంటాయి. ఒక్కో డోర్ కీ ఒక్కో కీ చొప్పున మొత్తం 3 కీస్ ఉంటాయి. వీటిలో ఒక కీ గజపతి రాజుల దగ్గర ఉంటుంది. మరో కీ దేవాలయ పాలనాధికారుల దగ్గర ఉంటుంది. ఇక మూడో కీ ఆలయ ప్రధాన అర్చకుడు భండాగార ఇన్ఛార్జ్ దగ్గర ఉంటుంది.
ఈ గదిని తెరవాలంటే మూడు తాళాలు ఉండాలి. అయితే, ప్రస్తుతం రెండు తాళాలు ఉన్నప్పటికీ మూడో తాళం దశాబ్ధాలుగా కనిపించకుండా పోయింది. దీంతో ఆ మిస్టీరియస్ రూమ్ ని తెరవడం అసాధ్యంగా మారిపోయింది. ఇలాంటి సమయంలో ఓ హిస్టారియన్ పూరీ జగన్నాథుని సీక్రెట్ రూమ్ ఓపెన్ చేయాలంటే దానికి కీతో పనిలేదని చెప్పి షాకిచ్చాడు. ఆ రెండో గదిని చేరుకునేందుకు దానికింద నుంచీ ఓ టన్నెల్ వే ఉందన్నారు. అయితే, అక్కడికి చేరుకోవటం అనుకున్నంత ఈజీ ఏమీ కాదు.
ఇది కూడా చదవండి: అంతుచిక్కని జ్వాలాముఖి ఆలయం రహస్యం
గతంలో ఈ గదిని తెరిచినప్పుడు ఏమి జరిగింది?
నిజానికి 1926లోనే పూరీ రాజు గజపతి రామచంద్రదేవ, బ్రిటిష్ పాలకులు కలిసి పూరీ జగన్నాథుని రత్న భాండాగారాన్ని తెరిపించి, ఆభరణాలను లెక్కించారు. 15 కిలోల కంటే ఎక్కువ బరువున్న జగన్నాథ, బలభద్ర, సుభద్రల బంగారు కిరీటాలతో పాటు, 597 రకాల విలులైన ఆభరణాలు ఉన్నట్టు గుర్తించారు. కానీ రత్న భాండాగారంలోని అసలైన సీక్రెట్ రూమ్ డోర్స్ మాత్రం ఓపెన్ చేయలేక పోయారు. ఇందుకు కారణం ఆ గదిని చేరుకునే కొద్దీ రకరకాల వింత శబ్ధాలు రావడమే. దీంతో ఎవరికీ ముందుకు వెళ్లే ధైర్యం చేయలేక పోయింది. దీంతో ఆ గదిని తెరవాలన్న ఆలోచనే విరమించుకున్నారు.
అప్పట్లో శ్రీక్షేత్రంపై 18 సార్లు దండయాత్రలు జరిగాయి. కానీ, జగన్నాథుని రత్న భాండాగారం లోపలి గదుల్లోకి మాత్రం ఎవరూ వెళ్ళలేక లేకపోయారు. అందుకే బ్రిటిష్ పాలకులు జగన్నాథుడిని మిస్టీరియస్ గాడ్‌గా డిస్క్రైబ్ చేశారు. అంతేకాదు, వాళ్ళ పాలనలో రత్న భాండాగారం సంరక్షణ, ఆచార నియమాలకు ఎలాంటి భంగం కలగకుండా తగు జాగ్రత్తలు కూడా తీసుకున్నారు.
1926లో లెక్కించింది ఒక గదిలో సంపద మాత్రమే! అసలు సంపదంతా ఆ రెండో గదిలోనే ఉందనేది చరిత్ర కారులు చెబుతున్న మాట. శతాబ్ధాలుగా ఆ రెండో గది మిస్టరీని రివీల్ చేయాలని ప్రభుత్వాలు, యంత్రాగాలు ఎంత ప్రయత్నించినా గది తలుపులు తెరవడంలో మాత్రం ఫెయిల్ అవుతూనే ఉన్నారు. దీనికి ప్రధాన కారణం ఆ గది తాళం కనిపించకుండా పోవడమే! ఒకవేళ తాళం పగలగొడదామన్నా అదంత ఈజీ కాదని ఆర్కియాలజిస్టులు తేల్చి చెప్పారు.
1978లో ఈ రత్న భండార్ లోపలి గదిని తెరచారు. ఆ ఏడాది మే నెలలో తలుపులు తెరిస్తే… లోపల సంపదను లెక్కించటం జులైలో ముగిసింది. అయితే, అప్పట్లో లోపలున్న సంపద విలువెంతో ఆలయ నిర్వహణ కమిటీ బయటపెట్టలేదు.