Puneeth Raj Kumar’s Pet Dogs get Emotional after his Death

పునీత్ సంస్మరణ సభ: పునీత్ ఫోటో వైపు దీనంగా చూస్తూ ఏడుస్తున్న పెంపుడు కుక్కలు (వీడియో)

శాండిల్ వుడ్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ మరణించి రెండు వారాలు గడుస్తున్నప్పటికీ… ఇప్పటికీ ఆ విషయాన్ని ప్రజలు డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారు. తమ అభిమాన హీరో ఆకస్మాత్తుగా తమకి దూరంయ్యడనే విషయాన్ని ఫ్యాన్స్ తట్టుకోలేక పోతున్నారు. కన్నడ చిత్రపరిశ్రమ ఒక గొప్ప నటుడ్ని కోల్పోయి… శోకసంద్రంలో మునిగిపోయింది. ఇక పునీత్ ఫ్యామిలీ అయితే… పుట్టెడు దుఃఖంలో మునిగిపోయింది.

ఆయన్ని అంతగా అభిమానించే మనుష్యుల సంగతే ఇలా ఉంటే… ఇక పెంపుడు కుక్కల పరిస్థితి ఏమిటి? ఎప్పుడూ పునీత్ వెన్నంటి ఉండే ఆయన పెట్ డాగ్స్ పరిస్థితి మరీ దారుణంగా మారింది. ఇప్పుడవి యాజమాని పట్ల వాటి విశ్వాసం నిరూపించుకున్నాయి.

వాస్తవానికి పునీత్ కి కుక్క పిల్లలంటే చాలా ఇష్టం. అందుకే ఆయన చాలా కుక్కలని ఎంతో ప్రేమతో పెంచుకుంటున్నారు. గతంలో కూడా చాలాసార్లు తన పెట్ డాగ్స్ కి సంబంధించిన ఫోటోలను, వీడియోలను సోషల్ మీడియా ద్వారా షేర్ చేశారు.

Futuristic digital creator using Claude AI skills to grow website traffic with glowing SEO analytics dashboards and AI technology visuals.
ఈ Claude AI Skill నా Website Traffic Double చేసింది!

అయితే, తమతో ఎంతో ప్రేమగా ఉండే యాజమాని ఇక లేడని, ఎప్పటికీ తిరిగి రాడని తెలిసి ఆ కుక్క పిల్లలు కన్నీంటి పర్యంతమయ్యాయి. ఏకంగా ఆయన ఫోటో దగ్గరికి వెళ్లి దీనంగా ఏడుస్తూ కుర్చుంటున్నాయి. పునీత్ కనిపించకపోవడంతో… అవి ఆహారం కూడా ముట్టట్లేదు. తమ యజమాని లేదనీ, ఇక రాడనీ వాటికి ఎలా చెప్పాలో తెలియక ఆయన కుటుంబ సభ్యులు మదనపడుతున్నారు. వాటి బాధ చూడలేక చివరికి వాటిని పునీత్ సమాధి వద్దకు తీసుకెళ్లారు. పునీత్ పెట్స్  పరిస్థితి చూస్తున్న అక్కడున్న వారికి కన్నీళ్లు ఆగడం లేదు.

ఈ రోజు బెంగుళూరులోని ప్యాలెస్ గ్రౌండ్స్ లో… పునీత్ సంస్మరణ సభ జరిగింది. ఈ కార్యక్రమానికి పునీత్ కుటుంబసభ్యులతో పాటు టాలీవుడ్, కోలీవుడ్ సినీ ప్రముఖులు, అలాగే, కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై, మరియు ఇతర మంత్రులు, రాజకీయ నాయకులు  హాజరయ్యారు. వేరేకాక ఇంకా దాదాపు 1500 మంది గెస్టులు విచ్చేశారు. 

Meesala Pilla Telugu song full lyrics image
మీసాల పిల్ల ఫుల్ లిరికల్ సాంగ్

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top