Monday, October 3, 2022
spot_img

వైరల్‌ గా మారిన పునీత్ ఆఖరి చిత్రం జేమ్స్ డ్రోన్ షూట్ (వీడియో)

కన్నడ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ మరణం శాండల్‌వుడ్‌ ఇండస్ట్రీకి తీరని లోటు. ఆకస్మిక మరణం వల్ల ఆయన ఒప్పుకొన్న అనేక ప్రాజెక్టులు అర్ధాంతరంగా నిలిచిపోయాయి. ఇక ఆయన నటించిన చివరి సినిమా ‘జేమ్స్’. అందుకే ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి.

చేతన్ కుమార్ డైరెక్షన్లో రూపుదిద్దుకుంటున్న ఈ మూవీ లాస్ట్ స్టేజ్ లో  ఉండగా… పునీత్  రాజ్‌కుమార్ తిరిగిరాని లోకాలకి వెళ్లిపోయారు. దీంతో ఈ సినిమా సగంలో నిలిచిపోయింది. అయితే, అభిమానులని శ్యాటిస్ఫై చేయటం కోసం పునీత్ బర్త్ డే కానుకగా మార్చి 27న జేమ్స్ సినిమా ప్రేక్షకుల ముందుకు తీసుకు రానున్నారు చిత్ర యూనిట్.

అయితే, ఈ మూవీ పునీత్ నటించిన లాస్ట్ మూవీ కావటంతో ఈ మూవీ  డ్రోన్ షూట్ వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది. ఈ వీడియోలో పునీత్ వాటర్ ఫాల్స్ దగ్గర నిలబడి ఉన్నారు. ఈ సన్నివేశాలను డ్రోన్‌ తో షూట్ చేశారు ఫిలిం యూనిట్. ఈ వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇప్పుడది వైరల్ అవుతోంది. ఈ వీడియో చుసిన అభిమానులంతా   ‘మిస్ యూ అప్పు’ అంటూ కామెంట్లు చేస్తున్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
3,506FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles