రంగ రంగ వైభవంగా టీజర్ లాంచ్ (వీడియో)

ఉప్పెన మూవీతో టాలీవుడ్ ఇండస్ట్రీలో అడుగుపెట్టాడు మెగా హరో వైష్ణవ్ తేజ్. ఫస్ట్ మూవీతోనే సూపర్ హిట్ అందుకుని, ఆ తర్వాత వరుస ఆఫర్లు అందుకుంటున్నాడు. ఈ క్రమంలోనే రంగ రంగ వైభవంగా చిత్రంలో కూడా నటిస్తున్నాడు. 

శ్రీ వెంక‌టేశ్వ‌ర సినీ చిత్ర ఎల్ఎల్‌పి బ్యాన‌ర్‌పై… బాపినీడు.బి స‌మ‌ర్ప‌ణ‌లో… బి.వి.ఎస్‌.ఎన్‌.ప్ర‌సాద్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి గిరీశాయ ద‌ర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో  వైష్ణవ్ సరసన హీరోయిన్ గా కేతికా శ‌ర్మ నటిస్తుంది. పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ పనులన్నీ పూర్తి చేసుకొని త్వరలోనే విడుదలకి సిద్ధమవుతుంది.

ఈ క్రమంలో తాజాగా ఈ చిత్రానికి సంబందించిన టీజర్ రిలీజ్ చేసింది చిత్రబృందం. ఈ టీజర్ లో లవ్… రొమాన్స్… యాక్షన్… అన్నీ సమపాళ్ళలో కలిసి ఉన్నాయి. ఇందులో వైష్ణవ్ తేజ్ మరింత స్టైలీష్ లుక్ లో కనిపిస్తున్నాడు. ఇక హీరో హీరోయిన్ల మద్య కెమిస్ట్రీ అదిరింది.

ల‌వ్, ఎంట‌ర్‌టైన్‌మెంట్, అండ్ ఫ్యామిలీ డ్రామాగా రూపొందుతోన్న ఈ చిత్రానికి ఆడియెన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక ఈ మూవీని జూలై 1న విడుదల చేయాలని మేకర్స్ ట్రై చేస్తున్నారు.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top