Rowdy Sheeter Hulchul In ICU

ఐసీయూలో… కత్తితో హల్‌చల్‌ చేసిన రౌడీషీటర్‌ (వీడియో)

హైదరాబాద్ టోలిచౌకిలో ఖాజా పరీదుద్దీన్‌ అనే రౌడీషీటర్‌ నిన్న రాత్రి కత్తితో హల్‌చల్‌ చేశాడు. న్యూ ఇయర్ రోజు తన సోదరుడు పటాన్‌చెరు వద్ద రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. అందుకు కారణం అతని స్నేహితులే అనే అనుమానంతో వారిపై కక్ష పెంచుకున్నాడు. ఈ క్రమంలో నిన్న రాత్రి వాళ్ళు బంజారాహిల్స్‌లో కనబడటంతో ఖాజా వారిని వెంబడించాడు.

ఒక్కసారిగా బైక్ స్పీడ్ పెంచేసి… దారిలో వచ్చేవారిని ఢీకొ డుతూ… వారిని చేజ్ చేయటానికి ట్రై చేశాడు. అతని ర్యాష్ డ్రైవింగ్ కారణంగా తక్కిన వాహనదారులు ఖాజాని వెంబడించారు. దీంతో అతను టోలీచౌకి వైపు పరారయ్యాడు.

Futuristic digital creator using Claude AI skills to grow website traffic with glowing SEO analytics dashboards and AI technology visuals.
ఈ Claude AI Skill నా Website Traffic Double చేసింది!

ఇంతలో అక్కడ వాహనాల తనిఖీలు చేస్తున్న కానిస్టేబుల్‌పై దాడికి దిగాడు. తర్వాత పారిపోతుండగా ఖాజాని పట్టుకోవటం కోసం పోలీసులు, స్థానికులు వెంబడించారు. ఈ క్రమంలో ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలోకి దూరి… అక్కడ ఐసీయూలో ఉన్న ఓ పేషంట్ మెడపై కత్తిపెట్టి తప్పించుకునేందుకు యత్నించాడు. కానీ, పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి ఖాజాను పట్టుకొని పీఎస్‌కు తరలించారు.

Meesala Pilla Telugu song full lyrics image
మీసాల పిల్ల ఫుల్ లిరికల్ సాంగ్

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top