గత జూన్ లో ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ (ISS) ద్వారా బోయింగ్ స్టార్‌లైనర్ లో స్పేస్ లోకి వెళ్ళిన సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ కొన్ని టెక్నికల్ రీజన్స్ వల్ల ఇప్పటి వరకూ అక్కడే చిక్కుకు పోయిన విషయం మనందరికీ తెలిసిందే! ఎలాన్ మాస్క్ యొక్క డ్రాగన్ జెట్ ఫాల్కన్ 9 ద్వారా వారిని ఈ ఏడాది మార్చి లేదా ఏప్రిల్‌లో తిరిగి భూమి మీదికి తీసుకు రానున్నారు.
ఈ క్రమంలో ఎప్పటికప్పుడు అక్కడ జరిగే విషయాలన్నీ ISS తన అఫీషియల్ సోషల్ మీడియా ఎకౌంట్ X ద్వారా తెలియచేస్తూ వస్తుంది. మొన్నటికి మూన్న సునీతా విలియమ్స్ టీమ్ క్రిస్మస్ సెలెబ్రేషన్స్ ని స్పేస్ లో ఎలా సెలెబ్రేట్ చేసుకొన్నారో తెలియచేస్తూ ఓ వీడియో పోస్ట్ చేసింది. ఇప్పుడు లేటెస్ట్ గా వాళ్ళు జరుపుకొన్న న్యూ ఇయర్ సెలెబ్రేషన్స్ గురించి వీడియో పెట్టింది.
సునీతా విలియమ్స్ ఇంకా ఆమె యొక్క క్రూ మేట్స్ అందరూ న్యూ ఇయర్ సెలెబ్రేషన్స్ ని 16 టైమ్స్ జరుపుకున్నారు. ఎలాగంటే, 400 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న ISS వద్ద నుండీ ప్రతి 90 నిమిషాలకోసారి సూర్యోదయం చూడొచ్చట.
ఈ విధంగా చూస్తే, భూ గ్రహం చుట్టూ తిరిగేటప్పుడు వాళ్ళు 16 సూర్యోదయాలు, సూర్యాస్తమయాలను చూస్తారు. అందుకే వాళ్ళు 16 సార్లు న్యూఇయర్ వేడుకలని జరుపుకున్నారు.
సాదారణంగా భూమిపై అయితే అన్ని దేశాల ప్రజలు ఒకే ఒక్కసారి నూతన సంవత్సర వేడుకలు జరుపుకుంటుంటే ISSలోని వాళ్ళు మాత్రం 16 సార్లు న్యూ ఇయర్ కి వెల్ కం చెప్పటం చాలా విచిత్రంగా అనిపిస్తుంది కదూ!