విశ్వంలో ఉండే 9 గ్రహాలు ఎప్పటికప్పుడు తమ స్థానాన్ని మార్చుకుంటూ ఉంటాయి. ఈ మార్పు జోతిష్యశాస్త్రంలో ఉండే 12 రాశులపై ప్రభావాన్ని చూపిస్తుంది. అందులో భాగంగానే, 2021 చివర్లో అంటే… డిసెంబర్ 30న, శుక్రుడు ధనుస్సు రాశిలోకి ప్రవేశిస్తాడు. ఇలా ప్రవేశించటం వల్ల 4 రాశులకి అదృష్టం వరిస్తుంది. ఆ రాశులేవో ఇప్పుడు చూద్దాం.
మేష రాశి:
శుక్రుడు తన స్థానాన్ని మార్చుకోవడం వల్ల లాభపడే రాశులలో మేషరాశి మొదటిది. వీరికి రాబోయే రెండు నెలలు అదృష్టం వరిస్తుంది. కష్టానికి తగిన ఫలితం దక్కుతుంది. చిత్తశుద్ధితో చేసే ఏ పనైనా సరే తప్పకుండా విజయవంతమవుతుంది. ఉద్యోగస్తులకి పదోన్నతులు లభిస్తాయి.
వృషభ రాశి:
శుక్రుడి సంచారం వృషభరాశివారిని అర్దికంగా ముందుండేలా చేస్తుంది. పాత బకాయిలు వసూలవుతాయి. ఉద్యోగులకు పదోన్నతులు లభిస్తాయి. సరైన ప్లానింగ్ ఉంటే విజయం మీ వెంటే.
కర్కాటక రాశి:
శుక్ర గమనంలో మార్పు ఈ రాశివారికి కెరీర్లో మంచి లాభాన్ని చేకూరుస్తుంది. ఉద్యోగస్థులకి ప్రమోషన్ వచ్చే ఛాన్స్ ఉంది. ప్రభుత్వ ఉద్యోగాలకి సిద్ధమవుతున్న వారికి ఇదే సరైన టైం. ముఖ్యంగా ఈ రాశివాళ్ళు వచ్చిన ఏ అవకాశాన్ని మిస్ చేసుకోవద్దు.
వృశ్చిక రాశి:
శుక్ర సంచారం కారణంగా ఈ రాశివారికి అదృష్టం తలుపు తడుతుంది. ఉద్యోగులు శుభవార్తలు అందుతాయి. డబ్బు కూడబెడతారు. కొత్తగా వ్యాపారం ప్రారంభించాలనుకొంటున్న వారికి ఇది సరైన సమయం. ఆదాయం పెరిగే ఛాన్స్ ఉన్నాయి. అంతేకాదు, ప్రతి విషయంలోనూ మీ ఫ్యామిలీ సపోర్ట్ ఉంటుంది.