Underwater Volcano Eruption in Tonga Island

సముద్ర గర్భంలో బద్దలైన భారీ అగ్నిపర్వతం (వీడియో)

పసిఫిక్ దేశమైన టోంగా సమీపంలో శనివారం నీటి అడుగున ఉన్న అగ్నిపర్వతం విస్ఫోటనం చెందింది. ఈ విస్ఫోటనం కారణంగా వచ్చిన బూడిద 20 కిలోమీటర్ల మేర వ్యాపించింది. నల్లటి అలల మాదిరిగా ఏర్పడ్డ బూడిద ఆ ప్రాంతాన్నంతా చుట్టుముట్టింది. 

ఈ వాల్కెనో గత నెల 20వ తేదీ నుంచే యాక్టివ్‌గా మారి.., జనవరి 11వ తేదీ నుంచి కదిలటం మొదలుపెట్టింది. అదికాస్తా 15వ తేదీ విస్పోటనం చెందింది. శనివారం, ఈ ప్రాంతంలో భారీ వర్షం, ఉరుములు, మరియు మెరుపులతో కూడిన వాతావరణం ఉండి. ఇంతలో  నీటి అడుగున అగ్నిపర్వతం విస్ఫోటనం చెందింది.

పేలుడు దాటికి సముద్రంలో ఉన్న నీరంతా అలల రూపంలో బయటికి పొంగి… చుట్టుపక్కల ఉన్న ప్రదేశాలన్నిటినీ ముంచేశాయి. అలల ఉధృతి తగ్గక పోవటంతో సునామీ హెచ్చరికలు జారీ చేశారు.

80 సెంటీమీటర్ల మేర అలలు ఎగిసి పడుతున్నాయి. ఎగసిపడుతున్న అలలు వీధులను మోకాళ్ల లోతు నీటితో నింపుతున్నాయి. భారీ విస్ఫోటనం కారణంగా ఏర్పడిన  బూడిద, ఆవిరి మరియు వాయువు పసిఫిక్ జలాల పైన పుట్టగొడుగులా వ్యాపించాయి.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top