ఎందుకో… ఏమో… తెలియదు. అప్పుడే కారు దిగిన ఒక మహిళని గుర్తు తెలియని కొందరు వ్యక్తులు దారుణంగా చితకబాదారు. వారు ఎవరో… ఏమిటో… ఆమెకి తెలియదు. కొట్టడానికి గల కారణం అంతకంటే తెలియదు. ఒక్కసారిగా తనపై జరిగిన ఈ అఘాయిత్యానికి ఆ మహిళ నిశ్చేష్టురాలైంది.
నవంబర్ 19 రాత్రి ఢిల్లీలోని షాలిమార్‌బాగ్ లో పార్కింగ్ ప్లేస్ లో ఓ కారు వచ్చి ఆగుతుంది. అందులోనుంచి ఓ మహిళ కిందకి దిగుతుంది. ఆమె అలా దిగీ దిగగానే ఎక్కడ నుండీ కాపు కాశారో తెలియదు కానీ, ఒక్కసారిగా గుర్తు తెలియని కొందరు వ్యక్తులు ఆమెని కర్రలతో దారుణంగా కొట్టారు. ఈ ఘటన జరిగిన సమయంలో ఆమె పిల్లలు కూడా పక్కనే ఉన్నారు.
ఇక గాయపడిన మహిళని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. పోలీసులు ఈ కేసుని విచారిస్తున్నారు. ఈ సంఘటన మొత్తం అక్కడ ఉన్న సీసీ పుటేజీలో రికార్డ్ అయ్యింది.
అయితే ఆ మహిళ మాత్రం స్థానిక ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్యే తనపై ఈ దాడి చేయించి ఉంటారని ఆరోపిస్తోంది. ఎమ్మెల్యే ఈ దాడికి పాల్పడినట్లు ఆ మహిళ ఆరోపిస్తుండగా, ఆ ఎమ్మెల్యే మాత్రం ఆ ఆరోపణలను ఖండించారు.
#WATCH | A group of persons beat up a woman with sticks in a residential colony in Shalimar Bagh area of Delhi on November 19
Based on the woman’s complaint, Delhi Police has registered an FIR against unknown persons, it said.
(CCTV footage of the incident) pic.twitter.com/YmZRtD7COu
— ANI (@ANI) December 1, 2021