పుష్ప క్రేజ్ మామూలుగా లేదుగా… బెల్లీ డ్యాన్స్ ఇరగదీశారు (వీడియో)

0
12
Women Belly Dance Performance to Oo Antava and 'Tip Tip Barsa Pani Songs

పుష్ప మూవీ వచ్చిపోయి నెలలు గడుస్తున్నా… దాని క్రేజ్ మాత్రం ఈ రోజుకీ తగ్గలేదు. ఈ సినిమాలోని సాంగ్స్,  డ్యాన్స్,  డైలాగ్స్ ఇప్పటికీ ఎక్కడో అక్కడ వినిపిస్తూనే ఉన్నాయి. అంతలా అవి ఫేమస్ అయ్యాయి. ఇక వీటిని ఇమిటేట్ చేస్తూ… అనేక మంది ఇప్పటికే ఎన్నో  రీల్స్ చేసి సోషల్ మీడియాలో అప్ లోడ్ చేశారు కూడా. 

ఇక స్టార్ హీరోయిన్ సమంత చేసిన ఐటం సాంగ్ ‘ఊ అంటావా మావా… ఉ ఊ అంటావా మావా… గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే ఏజ్ తో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరినీ ఈ పాట కదిలించివేసింది. ఈ పాటకున్న క్రేజ్ ఖండాంతరాలు దాటిపోయింది. సెలెబ్రిటీల నుండీ సామాన్యుల వరకూ ఈ పాటని అనుకరిస్తూ స్టెప్పు కలిపినోళ్లె.

రీసెంట్ గా ఓ ముగ్గురు మహిళలు ఈ పాటకి చేసిన డాన్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద దుమారమే లేపింది. వీరి స్టెప్పులు సినిమాలో సమంతని మరిపిస్తున్నాయి. వారివి నడుములా..! లేక స్ప్రింగులా..! అనిపించేంతగా డ్యాన్స్ లో లీనమైపోయి చేశారు. . ఈ ఘటన నోయిడాలో జరిగింది.

నోయిడాలోని ఓ సొసైటీలో ఉన్న ఒక ఫంక్షన్ లో వీరు ఈ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. వీరి డాన్స్ తో పాటు, వీరి అందాన్ని చూసి ప్రతి ఒక్కరూ వీళ్ళు చాలా హాట్‌ గురూ! అంటూ కామెంట్లు కూడా పెడుతున్నారు. ఈ డాన్స్ చేసిన వాళ్ళలో ఒకరి పేరు ఖుషీ శర్మ, ఇంకొకరి పేరు అవ్నీ, మరొకరి పేరు హనీ. వీళ్ళలో ఖుషీ శర్మ ఓ డ్యాన్స్ టీచర్, మిగిలిన ఇద్దరూ ఆమె స్టూడెంట్లు. వీరు చేసిన బెల్లీ డ్యాన్స్ నెక్ట్స్ లెవల్‌లో ఉంది.   

కేవలం ఊ అంటావా…  పాటకు మాత్రమే కాదు,  బాలీవుడ్ సాంగ్ టిప్ టిప్ బర్సా పానీ పాటకు కూడా వీళ్ళు డ్యాన్స్ ఇరగదీశారు. ఈ సాంగ్ కి కూడా వీళ్ళు అదిరిపోయే స్టెప్స్ వేశారు. వీళ్ళ పెర్ఫార్మెన్స్ కి అక్కడున్న వాళ్ళు మాత్రమే కాదు నెటిజన్లు సైతం కళ్ళప్పగించుకొని మరీ చూశారు. ఇంకెందుకు ఆలస్యం ఈ వీడియోపై మీరూ ఓ లుక్కేయండి. 

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here