పుష్ప మూవీ రిలీజై మూడు నెలలు గడుస్తున్నప్పటికీ… దాని మేనియా ఇప్పట్లో తగ్గేలా లేదు. తెలుగు సినిమా క్రేజ్ ని మరోసారిచాటి చెప్పిందీ ఈ సినిమా.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కిన సినిమా పుష్ప. ఈ సినిమాలోని పాటలు ఎంతలా హిట్ అయ్యాయో అందరికీ తెలిసిందే!
కామన్ పీపుల్ నుంచి సెలబ్రిటీల వరకు అందరికీ పుష్ప మేనియా పట్టుకుంది. ఈ సినిమాలోని పాటలకు స్టెప్పులేస్తూ… తమ వీడియోలని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ తమ టాలెంట్ చాటుకుంటున్నారు.
ఇక రీసెంట్ గా క్రికెటర్లు కూడా ఇదే లిస్టులో జాయిన్ అయిపోతున్నారు. మొన్నీమద్యనే టీమిండియా స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్… పుష్ప మూవీలో అల్లు అర్జున్ మేనరిజాన్ని ఇమిటేట్ చేస్తూ ఓ వీడియో చేశాడు. ఆ వీడియో సోషల్ మీడియాని షేక్ చేసిన విషయం తెలిసిందే!
ఇక ఇప్పుడు తాజాగా చాహల్ భార్య ధనశ్రీ వర్మ కూడా ఈ లిస్థులో వచ్చి చేరింది. నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ధనశ్రీ… పుష్పలో సాంగ్స్ అయిన ‘ఏయ్ బిడ్డ… ఇది నా అడ్డ’, మరియు ‘ఊ అంటావా మావా… ఊహూ అంటావా మావా…’ సాంగ్స్ కి అదిరిపోయే స్టెప్పులేస్తూ… సోషల్ మీడియాని షేక్ చేసింది. ఇప్పుడు ఆ వీడియో కూడా వైరల్ అవుతోంది.
ఈ వీడియోతో పాటు ఆమె ఒక క్యాప్షన్ కూడా మెన్షన్ చేసింది. తనకు డ్రామా కంటే డ్యాన్స్ అంటేనే ఎక్కువ ఇష్టమని చెప్పింది.
View this post on Instagram