Man Posing for Video Dies after being Hit by Train

ట్రైన్ వస్తుండగా వీడియోకు ఫోజిచ్చాడు… అనంత లోకాలకు వెళ్ళిపోయాడు!

ఈ మధ్య కాలంలో చాలా మంది యువతీ,యువకలు సరదా కోసం, వీడియో లైకుల కోసం వారు చేస్తున్న పనులు, వేస్తున్న వెర్రి వేషాలు చూస్తే చిర్రెత్తుకొస్తుంది. కేవలం సెల్ఫీల మోజులో పడి…తమ  ప్రాణాలని గాలిలో కలిపేసుకుంటున్నారు. 

తాజాగా ఇలాంటి సంఘటనే మధ్యప్రదేశ్​ హోశంగాబాద్​లో జరిగింది. ఇటార్సీ-నాగ్​పుర్​ మార్గంలో ట్రైన్ వస్తుండగా వీడియో తీయమని ఓ యువకుడు తన ఫ్రెండ్‌ని ఆదేశించాడు. అంతలోనే ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు. 

తన ఫ్రెండ్ వీడియో తీస్తుండగా… ట్రైన్ రావటం గమనించి… అతను రైల్వే ట్రాక్ పక్కగా వెళ్లి నిలబడతాడు. అయితే, వీడియో మోజులో పడి… ట్రైన్ స్పీడ్ ని అంచనా వేయలేకపోయాడు. దీంతో, అప్పుడే ట్రైన్ దూసుకుని రావటం… ఆ యువకుడిని డీ కొట్టడం… అంతా క్షణాలల్లో జరిగిపోయింది. 

People experiencing the mysterious hum sound heard on Earth, unexplained low-frequency noise
భూమిపై రహస్య శబ్దం – ఎవరికీ అర్థం కాని హమ్ సౌండ్

రైలు వేగాన్ని అతను కానీ, అతని ఫ్రెండ్ కానీ, ఇద్దరూ కూడా గుర్తించక పోవటంతో ఈ ప్రమాదం జరిగిందని అక్కడి వారు చెప్పుకుంటున్నారు. ట్రైన్ డ్రైవర్ నాన్‌-స్టాప్‌గా హారన్ కొట్టినప్పటికీ… ఫలితం మాత్రం శూన్యం. ఈ ప్రమాదంలో అతడి తలకు బలమైన గాయం అవ్వడంతో… ప్రక్కనే ఉన్న ఆస్పత్రికి తరలిస్తూ ఉండగా… మార్గ మధ్యలోనే అతను ప్రాణాలు విడిచాడు. అతని స్నేహితుడు మాత్రం గాయాలపాలై చికిత్స పొందుతున్నాడు.

మృతుడు పంజార కలా గ్రామానికి చెందిన సంజూ చౌరేగా పొలీసులు గుర్తించారు. శరద్​దేవ్​ ఆలయాన్ని దర్శించి వచ్చిన వీరు పక్కనే ఉన్న రైలు పట్టాలపైకి వెళ్లి సరదాగా వీడియో తీసుకుంటూ ఉండగా… ఈ ఘటన జరిగినట్లు తెలుస్తుంది. చూశారాగా… సరదా ఎంత పని చేసిందో! ఇప్పటికైనా ఇలాంటి  పనులకు స్వస్తి చెప్పండి.ప్లీజ్…

Illustration of hardworking ants carrying food grains, teaching life lessons of hard work, patience, and teamwork
చీమల నుండి మనిషి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు!

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top