Puneeth Rajkumar’s Steps on Naatu Naatu Song

‘నాటు నాటు’ పాటకి పునీత్ స్టెప్పులేస్తే… ఎలా ఉంటుందో చూడండి! (ఫ్యాన్‌ మేడ్‌ వీడియో)

టాలీవుడ్ మోస్ట్ ఎవైటెడ్ మూవీ ‘ఆర్ఆర్ఆర్’. ఇప్పుడు ఎవరినోట విన్నా… అందులోని ‘నాటు నాటు’ పాట గురించే! దర్శకధీరుడు రాజమౌళి అత్యంత ప్రతిష్ఠాత్మకంగా రూపొందిస్తున్న ఈ మూవీలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగాపవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌ హీరోలుగా నటిస్తున్న సంగతి తెలిసిందే! 

అయితే, ఈ చిత్రంలో రీసెంట్ గా రిలీజైన ‘నాటు నాటు’ సాంగ్ యూట్యూబ్ ని ఒక ఊపు ఊపింది. సెలెబ్రిటీల నుండి కామన్ పీపుల్ వరకు… చివరికి వృద్ధులకి సైతం తెగ నచ్చేసింది. అది ఎంతలా అంటే… ఒక బామ్మ ఈ పాటకి తన స్టైల్ లో స్టెప్పులేసి అదరగొట్టింది. ఆ వీడియో కాస్తా వైరల్ అయ్యింది. 

ఇప్పటివరకు ఈ సాంగ్ 10 మిలియన్లకి పైగా వ్యూస్‌ రాబట్టింది. ఈ సాంగ్ కి కీరవాణి మ్యూజిక్ అందించ‌గా, చంద్రబోస్‌ లిరిక్స్ అందించారు. కాలభైరవ, రాహుల్‌ సిప్లిగంజ్‌ కలిసి ఈ సాంగ్ ని ఆలపించారు. ఇక ఈ సాంగ్ లో తారక్‌, చరణ్‌ వేసిన మాస్‌ స్టెప్పులకి నెటిజన్లు ఫిదా అయిపోయారు.

ఇదిలా ఉంటే, కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ అభిమాని ఒకరు ఈ సాంగ్ గురించి కొంచెం క్రియేటివ్ గా ఆలోచించారు. అసలే పునీత్ మంచి డ్యాన్సర్ కావటంతో… ఈ పాటకి పునీత్ డ్యాన్స్ చేస్తే ఎలా ఉంటుంది? అనే ఆలోచన వచ్చింది. రీసెంట్ గా పునీత్ కార్డియాక్ అరెస్ట్ అయి చనిపోయిన విషయం తెలిసిందే! ఆ బాధనుండీ అభిమానులు ఇంకా కోలుకోలేదు. ఈ నేపద్యంలోనే పునీత్ వేసిన ఓల్డ్ డ్యాన్స్‌ స్టెప్పులకి… న్యూ నాటు నాటు సాంగ్ ని మిక్స్ చేసి… ఓ వీడియో  రీక్రియేట్‌ చేశాడు. ఈ సాంగ్ కి కన్నడ వెర్షన్ మాషప్‌ని  రూపొందించాడు. ఎంతో మురిపెంగా రూపొందించిన ఆ వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఈ వీడియో ఇప్పుడు నెటిజన్లని విపరీతంగా ఆకట్టుకుంటుంది. మీరు కూడా ఆ సాంగ్ పై ఓ లుక్కేయండి.

 

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top