Abhinandan Varthaman Awarded Vir Chakra

అభినందన్ వర్ధమాన్‌కి వీరచక్ర పురస్కారం (వీడియో)

ఇండియన్ ఎయిర్ ఫోర్స్ గ్రూప్ కెప్టెన్ అభినందన్ వర్ధమాన్‌… రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ చేతులమీదుగా ఈరోజు వీరచక్ర పురస్కారాన్ని అందుకున్నారు. ఇండియన్ ఆర్మీలో సేవలందిస్తున్న అభినందన్… బాలాకోట్​ లో జరిగిన వైమానిక దాడుల్లో… పాక్​ ఆర్మీతో వీరోచితంగా పోరాడారు.  ఈ కారణంగా అభినందన్‌ వీరచక్ర పురస్కారాన్ని అందుకొన్నారు. గతంలో కూడా పాకిస్తానీ వాయు చొరబాట్లను అడ్డుకొన్నందుకు శౌర్య చక్ర పురస్కారాన్ని అందుకున్నారు.  

2019, ఫిబ్రవరి 26న, బాలాకోట్‌లోని జైష్-ఎ-మహ్మద్ శిక్షణా శిబిరంపై ఇండియన్ ఆర్మీ వైమానిక దాడి చేసింది. ఫిబ్రవరి 27న, LOC వద్ద F-16, F-17 పాక్ యుద్ధ విమానాలని గ‌మ‌నించాడు. ఏదో ముప్పు రాబోతుందని ఊహించాడు. ఎంతో సాహ‌సోపేతంగా, చాలా చాక‌చ‌క్యంగా త‌న దగ్గర ఉన్న మిస్సైల్‌తో ఆ విమానాలని కూల్చేశాడు.

F-16 ఎయిర్‌క్రాఫ్ట్‌తో డాగ్‌ఫైట్ చేస్తున్నప్పుడు, అభినందన్ యొక్క MiG-21 బైసన్ విమానం POK లో కుప్పకూలింది. వెంటనే, ప్యారాచూట్ సహాయంతో పాక్ లో ల్యాండ్ అయ్యాడు. అది గమనించిన పాకిస్తాన్ ప్రజలు అతనిపై దాడి చేశారు. ఈ విషయం తెలుసుకున్న పాక్ దళాలు అభినందన్‌ ని బంధించి, కళ్లకు గంతలు కట్టి వారి సైనిక స్థావరానికి తీసుకువెళ్ళారు. ఆ తర్వాత ఆయన్ని పాక్ ఆర్మీ చిత్రహింసలు పెట్టిన వీడియో కూడా ఒకటి రిలీజ్ చేశారు. చివరికి భారత దౌత్యవేత్త ఒత్తిడితో అతనిని విడుదల చేశారు. ఆయన చేసిన ఈ వీరోచిత పోరాటానికి గుర్తుగా భారత ప్రభుత్వం అభినందన్‌ ని వీర చక్ర పురస్కారంతో సత్కరించింది.

Futuristic digital creator using Claude AI skills to grow website traffic with glowing SEO analytics dashboards and AI technology visuals.
ఈ Claude AI Skill నా Website Traffic Double చేసింది!

Meesala Pilla Telugu song full lyrics image
మీసాల పిల్ల ఫుల్ లిరికల్ సాంగ్

 

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top