ధర్మానికీ, అధర్మానికీ మద్య జరిగిన సంగ్రామమే మహాభారత యుద్ధం. ఈ యుద్ధంలో మొత్తం 47,23,920 మంది పాల్గొన్నారు. కానీ, యుద్ధం ముగిసేసరికి కేవలం 10 మంది మాత్రమే మిగిలారు. ఇంత భారీ నష్టం జరగటానికి కారణం ఈ యుద్ధంలో పవర్ ఫుల్ వెపన్స్ ప్రయోగించడమే! మహాభారత యుద్ధం మామూలు యుద్ధం కాదు, ‘న్యూక్లియర్ వార్’ అని చాలామంది హిస్టారియన్స్ చెపుతుంటారు. అంతేకాదు, మహాభారత యుద్ధంలో ఉపయోగించిన వెపన్స్ అన్నీ మిస్సైల్సే! అని కూడా అంటుంటారు. 18 రోజుల్లో 47 లక్షలకి పైగా జనాభా మరణించడం అంటే సామాన్యమైన విషయం కాదు. అది మామూలు వెపన్స్ తో సాధ్యమయ్యేది కాదు. ఈ యుద్ద సమయంలో, పవర్ ఫుల్ సెలెస్టియల్ వెపన్స్ ఉపయోగించబడ్డాయి. వాటికి అపారమైన శక్తి ఉంది. అవసరమైతే అవి ఖండాలను, గ్రహాలను కూడా నాశనం చేయగలవు. మరి అలాంటి వాటిలో 10 మోస్ట్ పవర్ ఫుల్ వెపన్స్ గురించి ఈరోజు డిస్కస్ చేసుకుందాం.
వాసవి శక్తి (ఇంద్రుని ఆయుధం)
వాసవి శక్తి ఇంద్రునికి చెందిన ఆయుధం. దీనిని భారతంలో ఇంద్రుడు కర్ణుడికి గిఫ్ట్ గా ఇస్తాడు. ఇది మోస్ట్ పవర్ ఫుల్ వెపన్. హై ఇంటెన్సిటీతో ఎలక్ట్రిసిటీని డిశ్చార్జ్ చేసే ఒక దైవిక ఈటె ఇది. అంటే… ఉరుములతో దాడి చేస్తుంది. దీనిని ఒక్కసారి ప్రయోగిస్తే… టార్గెట్ ఫినిష్ చేసేదాకా ఆగదు. కానీ, ఇది ఒక్కసారి మాత్రమే ఉపయోగించబడుతుంది. ఉపయోగించిన తర్వాత, ఖచ్చితంగా అది శత్రువుని చంపి తీరుతుంది.
వాసవి శక్తి అసలు పేరు శక్తి అస్త్రం మాత్రమే! కానీ, వాసవి ఇచ్చిన శక్తి కాబట్టి దీనిని వాసవి శక్తి అని పిలుస్తారు. ఈ అస్త్రాన్ని కర్ణుడు అర్జనుడిని సంహరించటం కోసం ఉంచుతాడు. కానీ, శ్రీకృష్ణుడి యుక్తితో ఈ అస్త్రాన్ని ఘటోత్కచుడిపై ప్రయోగించేలా చేస్తాడు.
మహాభారత యుద్ధంలో కర్ణుడికి, అర్జనుడికి మద్య పోరు మొదలైంది. ఆ సమయంలో, దేవతల రాజైన ఇంద్రుడు కర్ణుడి దగ్గరికి వచ్చి… తన కవచ కుండలాలని ఇవ్వవలసిందిగా కోరతాడు. వెంటనే కర్ణుడు తనని దానమడిగిన దేవేంద్రుడికి… పుట్టుకతో వచ్చిన కవచ కుండలాలని తీసి ఇచ్చేస్తాడు. అందుకు ప్రత్యామ్నాయంగా ఏదో ఒకటి చేయాలని భావిస్తాడు ఇంద్రుడు. అప్పుడే తన దగ్గర ఉన్న వాసవి శక్తి అస్త్రాన్ని కర్ణుడికి బహుమతిగా ఇస్తాడు. ఈ అస్త్రానికి దేవుళ్లని సైతం చంపే శక్తి ఉంది. ఇది ఒక దైవిక ఆయుధం.
ఈ ఆయుధాన్ని కలిగి ఉన్నవారికి సృష్టిలో తిరుగుండదు. అలాంటి ఆయుధాన్ని కలిగి ఉండటానికి కర్ణుడు ఒక్కడే అర్హుడని భావించి ఇంద్రుడు దానిని కర్ణుడికి ఇస్తాడు. అయితే, అర్జునుడిని చంపగల ఏకైక శక్తివంతమైన అస్త్రం ఇదేనని భావించి, అతని కోసం దాచిపెడతాడు కర్ణుడు. కానీ, దుర్యోధనుడు పట్టుబట్టడంతో, భీముడి కుమారుడైన ఘటోత్కచుడు కౌరవ సైన్యం మొత్తాన్ని ఒంటరిగా తుడిచిపెట్టేస్తాడు. దీంతో కర్ణుడు తప్పనిసరి పరిస్థితుల్లో వాసవి శక్తి అస్త్రాన్ని ఘటోత్కచుని మీద ప్రయోగించాల్సి వస్తుంది.
వజ్రాయుధం (ఇంద్రుడి వ్యక్తిగత ఆయుధం)
వజ్రాయుధం ఇంద్రుని యొక్క అత్యంత శక్తివంతమైన ఆయుధం. దీనిని మహాభారత యుద్ధ సమయంలో ఇంద్రుడు తన కుమారుడైన అర్జునుడికి ఇచ్చాడు. ఇది దధిచి అనే మహర్షి వెన్నెముక నుండి తయారు చేయబడింది. వజ్ర అంటే సంస్కృతంలో “డివైన్ లైటింగ్” అని అర్ధం.
ఈ వెపన్ గాలినుండీ లైటింగ్ ని ప్రొడ్యూస్ చేస్తూ… మెరుపులతో దాడి చేస్తుంది. ఒక్కసారి దీనిని టార్గెట్ చేసి వదిలితే… ఆకాశం నుండి మెరుపుల వర్షం కురిపిస్తుంది. వజ్రాస్త్రాన్ని యుద్ధభూమిలో అత్యంత భయంకరమైన ఆయుధాలలో ఒకటిగా పరిగణిస్తారు. ఎందుకంటే ఇది శత్రువులకి ప్రాణనష్టం ఎక్కువగా కలిగిస్తుంది. మరియు శత్రు సైన్యాన్ని చెదరగొడుతుంది.
మహాభారతంలో ఈ మోస్ట్ డిస్ట్రక్టివ్ వెపన్ ని వృత్రాసురుడు అనే రాక్షసుడిని చంపడానికి ఉపయోగించారు. వృత్రాసురుడు మహాశక్తి సంపన్నుడైన రాక్షసుడు. దేవతలపై కోపంతో, తపస్సు చేశాడు. లోహంతో తయారుచేయని ఆయుధం తప్ప… మరే ఇతర దానితో చావు రాకూడదని వరం పొందాడు. వర గర్వంతో దేవలోకం మీదకి దండెత్తి, ఇంద్రుడి సింహాసనాన్ని ఆక్రమించుకున్నాడు. దేవతలందరినీ హింసించాడు. ఏమీచేయలేని పరిస్థితుల్లో ఇంద్రునితో సహా దేవతలంతా విష్ణుమూర్తికి మొరపెట్టుకుంటారు. అప్పుడు శ్రీహరి అత్యంత బలమైన వెన్నుముకతో ఓ పదునైన ఆయుధాన్ని తయారు చేయించమని సూచించాడు. అయితే, దానికి బలంతోపాటు, తపశ్శక్తి కూడా కలబోసి ఉండాలని చెప్పాడు.
అందుకోసం భృగుమహర్షి కుమారుడు, మహా తపస్సంపన్నుడైన దధీచిని ఎంచుకొంటారు. వెంటనే, దేవేంద్రుడు దధీచి మహర్షి ఆశ్రమానికి చేరుకొని విషయం చెప్పగా… ఆ మహర్షి తన వెన్నెముక ఇవ్వడానికి అంగీకరించి… యోగశక్తితో ప్రాణత్యాగం చేస్తాడు. అలా తయారైందే ఈ వజ్రాయుధం. ఆ వజ్రాయుధంతోనే వృత్రాసురుని వధిస్తాడు దేవేంద్రుడు. అప్పటినుండీ వజ్రాయుధమే ఇంద్రుడికి ప్రధాన ఆయుధమైంది.
నారాయణాస్త్రం (విష్ణువు యొక్క వ్యక్తిగత ఆయుధం)
నారాయణాస్త్రం సాక్షాత్తూ ఆ విష్ణుమూర్తి యొక్క ఆయుధం. మహాభారతంలో దీనిని ప్రయోగించడం కేవలం కృష్ణుడు, ద్రోణుడు, మరియు అశ్వత్థామకి మాత్రమే తెలుసు. విష్ణువు స్వయంగా ఈ ఆయుధాన్ని ద్రోణుడికిచ్చి ఆశీర్వదించారు. ద్రోణుడు తన కుమారుడైన అశ్వత్థామకు ఈ అస్త్రాన్ని ప్రేమతో సమర్పిస్తాడు.
చూడటానికి ఇది ఒక సర్క్యులర్ డిస్క్ రూపంలో ఉంటుంది. కానీ, లక్షలాది మిసైల్స్ ని ఒకేసారి ప్రయోగించినంత తీవ్రత ఉంటుంది. ఈ అస్త్రాన్ని ఒక్కసారి ప్రయోగిస్తే చాలు, బాణాల జల్లులు కురిపిస్తుంది. దీనినుండీ తప్పించుకోవడానికి గల ఏకైక మార్గం ఏంటంటే… దీనిని ప్రతిఘటించకుండా ఉండటమే!
దీనిని ఎవరైనా తమ జీవితకాలం మొత్తంలో కేవలం ఒక్కసారి మాత్రమే ఉపయోగించాల్సి ఉంటుంది. అలాకాక ఎక్కువసార్లు ఉపయోగించడానికి ప్రయత్నిస్తే, ఎవరైతే దానిని ప్రయోగిస్తారో… వారినే టార్గెట్ చేస్తుంది. అందుకే, హిందూ పురాణాలలో ఉన్న మోస్ట్ పవర్ ఫుల్ వెపన్స్ లో ఇది ఒకటి.
మహాభారత యుద్ధంలో పాండవుల చేతిలో ద్రోణుడు మరణిస్తాడు. తన తండ్రి మరణానికి కారణమైన పాండవులపై కక్ష్య కడతాడు అశ్వత్థామ. అందుకే వారిపై నారాయణాస్త్రాన్ని ప్రయోగిస్తాడు. వెంటనే అప్రమత్తమైన శ్రీకృష్ణుడు, పాండవులు, మరియు ఇతర యోధులని తమ తమ ఆయుధాలని వదిలేసి, నేలపై పడుకోమని చెప్తారు. ఇది విష్ణుమూర్తి యొక్క దివ్యాస్త్రం; కాబట్టి ఆ అస్త్రానికి పూర్తిగా లొంగిపోక తప్పదని సలహా ఇస్తాడు. మిగిలిన వీరులంతా ఒప్పుకున్నప్పటికీ, పాండవ వీరుడు భీముడు మాత్రం అది పిరికి చర్యగా భావించి… లొంగిపోవడానికి నిరాకరించాడు. అంతేకాక దానిపై ఎదురుదాడికి దిగుతాడు. దీంతో, ఆ అస్త్రం భీముడిని టార్గెట్ చేస్తుంది. చివరికి అతని సోదరులు, మరియు కృష్ణుడు అడ్డుకోవడంతో భీముడు చంపబడలేదు.
ఇది కూడా చదవండి: అర్జునుడు VS కర్ణుడు: ఎవరు గొప్ప?