Mekapati Goutham Reddy at Dubai Expo

దుబాయ్‌ టూర్‌లోనే ఉండగానే… గౌతమ్‌రెడ్డికి వార్నింగ్ ఇచ్చిన గుండె! (వీడియో)

ఏపి మినిస్టర్… యంగ్ డైనమిక్ లీడర్… మేకపాటి గౌతమ్ రెడ్డి హఠాన్మరణం రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ తీవ్ర విషాదాన్ని నింపింది. ఎప్పుడూ పార్టీ కార్యకలాపాలలో చాలా యాక్టివ్ గా పాల్గొంటూ… అన్నింటా ముందుండే  గౌతమ్ రెడ్డి ఇప్పుడు పార్టీకి తీవ్ర విషాదాన్ని మిగిల్చి పోయారు. 

ఏపీ ప్రభుత్వం పారిశ్రామిక రంగానికి పెద్ద పీట వేస్తూ, మౌలిక వసతుల రూప కల్పనలో ముందంజలో ఉంది. ఈ క్రమంలో దుబాయ్‌ ఎక్స్‌పోలో 12 థీమ్‌లతో కూడిన ఏపీ పెవిలియన్‌ ని ప్రారంభించారు. యీ కార్యక్రమానికి హాజరవటం కోసం మంత్రి గౌతమ్ రెడ్డి ఈ నెల 11న దుబాయ్‌ వెళ్లారు. వారం రోజుల పాటు ఆయన దుబాయ్‌లో పర్యటించారు.

దుబాయ్ ఎక్స్ పోలో వివిధ పరిశ్రమలకి చెందిన ప్రతినిధులతో వరుసగా సమావేశం అయ్యారు. వారితో పెట్టుబడులకు సంబంధించిన విషయాలని చర్చించారు. కొన్ని పరిశ్రమలతో ఒప్పందాలు కూడా కుదుర్చుకున్నారు. 

అయితే, దుబాయ్‌ టూర్‌లోనే ఉండగానే మంత్రి గౌతమ్‌రెడ్డి ప్రవర్తించిన తీరు చూస్తుంటే.. అనేక అనుమానాలకి తావిస్తోంది. ఆయన గుండె ఆరోజునే ఓ చిన్న వార్నింగ్ ఇచ్చిందేమో అనిపిస్తోంది.

ఈ ఎక్స్‌పోలో మొదట అంతా చాలా యాక్టివ్‌గా కనిపించారు మేకపాటి. తర్వాత కొంతసేపటికి చాతీని పట్టుకుంటూ కనిపించారు. ఒకటికి రెండుసార్లు ఆయన కుడిచెయ్యిని చాతీపై పెట్టి రుద్దుకుంటూ కనిపించారు. ఈ క్రమంలో కాస్త ఇబ్బందికి గురయినట్లుగా కూడా ఆయన ఫీలింగ్స్ చూస్తుంటే అర్ధమవుతుంది. అప్పటివరకూ యాక్టివ్‌గా కనిపించిన ఆయన తర్వాత మాత్రం కాస్త స్లో అయ్యారు. ఇదంతా వీడియోలో రికార్డు అయింది. 

ఇక 20వ తేదీ తెల్లవారుఝామున హైదరాబాద్ తిరిగొచ్చారు. సాధారణంగా ఆయనకి ఉదయాన్నే జిమ్‌ చేసే  అలవాటు ఉంది. కానీ జర్నీ చేసి బాగా టైర్డ్ అవటంతో జిమ్‌కి వెళ్లలేదు. అయితే, ఆ రోజు సాయంత్రం గచ్చిబౌలిలోని ఓ ఎంగేజ్మెంట్ కి హాజరయ్యారు. ఆ మరుసటి రోజే అంటే 21వ తేదీ ఉదయం గుండెపోటుతో మరణించారు.

దీన్నిబట్టి చూస్తే దుబాయ్ టూర్ లో ఉండగానే ఆయన గుండె ఆయనకి హింట్ ఇచ్చింది. కానీ, దానిని మైనర్ ప్రాబ్లెమ్ గా భావించి లైట్ తీసుకున్నారు. అయితే, వారం రోజుల తర్వాత అదే  గుండె లయతప్పి పూర్తిగా ఆగిపోయింది. దీంతో ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. 

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top