జగన్ సర్కారుపై అలుపెరుగని పోరాటం చేస్తున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్… రాష్ట్రంలోని సమస్యలపై దశలవారీగా స్పందిస్తున్నారు. ఈ క్రమంలో మత్యకారుల సమస్యల పరిష్కారం కోసం పోరాటం నిర్వహించారు.
మత్స్యకారుల ఉపాధిని దెబ్బతీసే విధంగా ఉన్న జీవో 217 విషయంలో గళం ఎత్తడానికి మత్స్యకార అభ్యున్నతి సభ నిర్వహించారు పవన్. ఈ సభ పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపుంరలో జరిగింది.
ఈ బహిరంగ సభకి జనసేన కార్యకర్తలు, పవన్ అభిమానులు పోటెత్తారు. ఇంతలో కారులో నుంచే ప్రజలకి అభివాదం చేస్తూ వస్తున్న పవన్… అందరికీ కనిపించాలన్న ఉద్దేశంతో కారుపైకి ఎక్కారు.
అయితే అక్కడ ఊహించని విధంగా ఓ అభిమాని పవన్ వెనక నుంచి పరిగెత్తుకుంటూ వచ్చి… కారుపైకి ఎక్కి… పవన్‌ని హగ్ చేసుకోబోయాడు. అది గమనించిన ఓ బాడీగార్డ్ ఆ అభిమానిని పట్టుకుని లాగాడు. ఒక్కసారిగా బాడీగార్డ్ లాగడంతో సపోర్ట్ కోసం పవన్‌ని పట్టుకో బోయాడు. కానీ, పట్టుతప్పి ఆ అభిమాని కిందకి దూకేశాడు.
ఈ క్రమంలో పవన్ అదుపు తప్పి కారుపై జారి పడిపోయారు. ఏం జరిగిందో అర్ధం కాక పవన్ కళ్యాణ్ కొంత సేపు కారుపైనే కూర్చుండిపోయారు. తర్వాత, నవ్వుకుంటూ పైకి లేచి… తిరిగి అభిమానులకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.