Ghost Village Appears After 30 Years

30 ఏళ్ల తరవాత బయటపడిన ఘోస్ట్ విలేజ్ (వీడియో)

ప్రకృతిలో వచ్చే మార్పుల వల్ల గ్రామాలే కనుమరుగై పోవచ్చు; అలానే కనుమరుగై పోయిన గ్రామాలు బయట పడనూ వచ్చు. సరిగ్గా ఇదే జరిగింది ఇప్పుడు.

స్పెయిన్‌ లోని 30 ఏళ్ల క్రితం డ్యామ్ నిర్మాణం చేపడుతుండగా… ఒక విలేజ్ నీటిలో మునిగిపోయింది.  అయితే, ఇప్పుడు ఆ ప్రాంతమంతా నీటి ఎద్దడిని ఎదుర్కొంటూ ఉంది. ఈ కారణంగా అక్కడ కరువు తాండవిస్తుంది. 

ఎప్పుడైతే అక్కడ డ్యామ్ లో నీరంతా అడుగంటి పోయిందో… అప్పుడు లోపల ఉన్న గ్రామం బయటపడింది. స్పానిష్ లో ఉన్న ‘అసెరెడో’ అనే ఘోస్ట్ విలేజ్ 1992 నుండి డ్యామ్ నీటి అడుగున ఉండిపోయింది. ఇప్పుడు ఆ డ్యామ్ నీళ్ళు తగ్గటంతో… మళ్ళీ ఆ విలేజ్ వెలుగులోకి వచ్చింది.

ఆల్టో లిండోసో రిజర్వాయర్‌ నిర్మాణం సమయంలో ఆ ప్రాంతమంతా భారీ వరదలు వచ్చాయి. ఆ వరదల్లో అసెరెడో గ్రామం రిజర్వాయర్ అడుగుకి చేరుకుంది. ఇప్పుడు ఆ  రిజర్వాయర్‌ ఎండిపోవటంతో శిథిలాలు బయటపడ్డాయి.

ఒకప్పుడు ఈ ప్రాంతమంతా  ద్రాక్షతోటలు, నారింజ చెట్లతో నిండి ఉండేది. కానీ, ఇప్పుడు మాత్రం ఘోస్ట్ విలేజ్ లా మారిపోయింది. 

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top