What Happens 30 Seconds before you Die

మ‌నిషి మరణించడానికి 30 సెకండ్ల ముందు ఏం జరుగుతుందో తెలుసా?

పుట్టిన ప్రతి జీవి గిట్టక మానదు, అందులో మనిషికేమీ మినహాయింపు లేదు. పుట్టుక ఎంత స‌హ‌జ‌మో… చావు కూడా అంతే స‌హ‌జం. కానీ, ఒక జీవి చావు,  పుట్టుక‌లని మాత్రం ఎవ్వరూ డిసైడ్ చేయలేరు. అయితే, ఆ మనిషి మరణించటానికి 30 సెకండ్ల ముందు ఏం జరుగుతుందో మాత్రం ఖచ్చితంగా చెప్పొచ్చట.

టెక్నాలజీ ఎంత డెవలప్ అయినా… మెడికల్ ఫీల్డ్ లో ఎన్ని చేంజెస్ వచ్చినా… కొన్ని విషయాలు మాత్రం ఇప్పటికీ మిస్టరీగానే మిగిలిపోతున్నాయి. అదే ‘మరణం’. 

Bodhidharma's disappearance, mysterious Buddhist legend
Unraveling the Mystery of Bodhidharma’s Disappearance

మ‌నిషి మరణానికి సంబంధించి ఎన్నో రకాల వార్తలు మనం రోజూ వింటూ ఉంటాం. అయితే, రీసెంట్ గా ఓ ఇంటరెస్టింగ్ న్యూస్ బయటపడింది. అదేంటంటే, మ‌నిషి మరణించటానికి  ఇంకా 30 సెకండ్ల సమయం ఉందనగా… తన లైఫ్ సర్కిల్ మొత్తం ఒకసారి కళ్ళముందు గిర్రున తిరుగుతుందట.  పుట్టిన‌ప్ప‌టి నుంచి మరణించేంతవరకూ తాను చేసిన ప‌నులు, గడిచిపోయిన జ్ఞాప‌కాలు, తనతో గడిపిన మ‌నుషులు ఇలా అన్నీ ఒక్కసారిగా గుర్తుకు వస్తాయిట. 

ఇక మరణం సమీపిస్తున్నప్పుడు సరిగ్గా 30 సెకండ్ల ముందు మన బ్రెయిన్ బ్లడ్ ని రిసీవ్ చేసుకోవటం ఆపేస్తుందట. ఆ సమయంలో బ్రెయిన్ వేవ్స్‌ ని కనుక గమనించి చూస్తే… అది తనలో స్టోర్ అయి ఉన్న ఓల్డ్ మెమరీస్ అన్నిటినీ ఒక్కసారిగా బ్యాకప్ అందిస్తుంది. ఒక్క‌సారిగా బ్రెయిన్‌లో జరిగే ఈ ఊహించ‌ని యాక్టివిటీకి సంకేతం మరణమే!

The Dark Side of Dubai, Human Rights Concerns
Dubai’s Hidden Poverty

అయితే, ఇది జరిగిన 30 సెకండ్ల తర్వాత హార్ట్ బీటింగ్ ఆగిపోతుంది. కానీ, హార్ట్ బీట్ నిలిచిపోయాక కూడా 30 సెకండ్ల పాటు ఈ ప్రాసెస్ కంటిన్యూ అవుతుంది. ఇదే మ‌నిషి జీవితంలో చివ‌రి ప్ర‌క్రియ‌. ఆ తర్వాత మనిషి ఉండడు, తన జ్ఞాప‌కాలు ఉండ‌వు. మొత్తం తుడిచిపెట్టుకు పోతాయి. 

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top