Kerala Floating Bridge

కేరళలో విశేషంగా ఆకట్టుకుంటున్న ఫ్లోటింగ్ బ్రిడ్జి

గాడ్స్ ఓన్ కంట్రీగా పిలవబడే కేరళ… ఏది చేసినా అందులో ఏదో ఒక ప్రత్యేకత ఉండి తీరుతుంది. మనదేశంలో ఉన్న బెస్ట్ టూరిస్ట్ ప్లేసెస్ లో ఇదీ ఒకటి. కేరళ గవర్నమెంట్ ఏటా టూరిజానికి పెద్ద పీట వేస్తుంది. అందులో భాగంగానే ఇప్పుడొక విన్నూత్న ప్రయోగం చేసింది. సముద్రంలో ఫ్లోటింగ్ బ్రిడ్జిని ఏర్పాటుచేసి… పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. 

కేరళ రాష్ట్రంలోని కోజికోడ్ బే పోర్ బీచ్ లో అలలపై తేలియాడే వంతెనని నిర్మించింది. సముద్రంలోని  అలలకు తగ్గట్టుగా ఈ బ్రిడ్జి కదులుతుండడంతో… టూరిస్టులు  తెగ  ఎంజాయ్ చేసేస్తున్నారు. బ్రిడ్జిపై నిల్చొని ఫోటోలు, సెల్పీలు దిగుతూ తెగ ఖుషీ అవుతున్నారు.

ముఖ్యంగా అడ్వెంచర్ లవర్స్ కోసం ఈ ఫ్లోటింగ్ బ్రిడ్జ్ ని ఏర్పాటుచేయటం జరిగింది. డిస్ట్రిక్ట్ టూరిజం ప్రమోషన్ కౌన్సిల్ (DTPC) కోజికోడ్, మరియు పోర్ట్ డిపార్ట్‌మెంట్ సహకారంతో చాలకుడి క్యాప్చర్ డేస్ అడ్వెంచర్ టూరిజం అండ్ వాటర్ స్పోర్ట్స్ ఈ బ్రిడ్జ్ ని ఏర్పాటు చేసింది.

మొత్తం 100 మీటర్ల పొడవు, 3 మీటర్ల వెడల్పుతో నిర్మితమైన ఈ బ్రిడ్జ్ టూరిస్ట్ లకి ఓ డిఫరెంట్ మెరైన్ ఎక్స్ పీరియన్స్ ని అందిస్తుంది. ఈ బ్రిడ్జ్ వాటర్ పై ఫ్లోట్ అయ్యే హై-డెన్సిటీ పాలిథిలిన్ (HDPE) బ్లాక్‌లతో రూపొందించబడింది. దీనిని వీలైనంత త్వరగా అసెంబుల్డ్ చేయొచ్చు, మరియు డిస్ మాంటిల్ చేయొచ్చు. దీనివలన అవసరమైన లొకేషన్స్ కి ఈజీగా మూవ్ చేయవచ్చు.

ఈ ఫ్లోటింగ్ బ్రిడ్జ్ పై ట్రావెల్ చేసేటప్పుడు ప్రజలు పడిపోకుండా… సేఫ్టీకి అన్ని చర్యలు తీసుకున్నారు. దీనికి  ఇరువైపులా ఉన్న రెయిలింగ్‌లను పట్టుకోవచ్చు. 100 కిలోల బరువున్న 31 యాంకర్లతో ఈ వంతెన సాలీడ్ గా చేయబడింది. అలలతో పాటు ఈ వంతెన కూడా పైకి లేచి పడిపోతూ ఉంటుంది. 

ఒకేసారి 500 మంది వరకు దీనిపై ప్రయాణించవచ్చు. అయితే ప్రస్తుతం 50 మందిని మాత్రమే లైఫ్ జాకెట్లు ధరించి వంతెనపైకి అనుమతిస్తారు. సమ్మర్ సీజన్ కావడంతో ఇక్కడికి టూరిస్ట్ లు ఎక్కువగా  వచ్చే అవకాశం ఉంది. ఇక ఈ బ్రిడ్జ్ ప్రతిరోజూ ఉదయం 11 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు ప్రజల కోసం తెరవబడుతుంది. దీని ఎంట్రీ ఫీజ్ రూ. 10

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top